Saturday, October 16, 2010

మా ఆవిడ గొంతులో వడ్రంగి పిట్ట పొడిచింది

విజయ దశమి రోజున మా ఆవిడ - శ్రీదేవి - గొంతులో వడ్రంగి పిట్ట పొడిచింది. అవును "పొడిచింది".

ఇహ మీరు ఆ సంగతి ఇక్కడ వినాల్సిందే...

ఇంకొన్ని జంతువులు కూడా పొడిచేసినాయి కానీ, ముందు ఇది విన్నాక సంగతి చెబితే - మిగతా జంతువులేమిటో, ఆ పొడుపుడు విశేషాలేమిటో - అన్నీ మీ ముందుకు రావడానికి తయారుగా ఉన్నాయి........మీదే ఆలస్యం...

ష్ ష్....ఓ సంగతి....ఈ వడ్రంగి పిట్ట చేత నేనే పొడిపించా..కసి తీరా!

లేపోతే కర్నాటక సంగీతం నేర్చుకుని కూడా నాకు ఏ సాయంత్రంపూటైనా అలా ఓ సారి ఆహ్లాదంగా ఓ పాట పాడి వినిపించవమ్మా అంటే, మూతి ముప్ఫై వంకర్లు తిప్పుకుంటూ పోతుంది... అందుకు పెంచుకున్న కసి ఇలా తీర్చుకున్నానన్నమాట..

భవదీయుడు
వంశీ

9 comments:

  1. మీ ఆవిడ గొంతులో వడ్రంగిపిట్ట బాగుందండి

    ReplyDelete
  2. విశ్వాశహీనులకు తగిన శాస్తి తప్పదని బాగా చెప్పారు. శ్రీదేవిగారికి థాంక్స్ చెప్పగలరు.

    ReplyDelete
  3. చాల బాగుందండీ !

    ReplyDelete
  4. శ్రీదేవి గారు చెప్పిన ఈ కథ పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా పనికొస్తుందండీ :-))

    ఆమె కంఠస్వరం, ఉచ్ఛారణ చాలా స్పష్టం గా వున్నాయి. మరి ఆలస్యం దేనికి? మరిన్ని కథలు చదివించండి.
    శ్రీదేవిగారు ఆకాశవాణి లో పనిచేశారా? ఆ మాడ్యులేషన్ చూస్తే అలా అనిపించింది లెండి.

    ReplyDelete
  5. మంచి ప్రయత్నం వంశీ గారూ.
    శ్రీదేవి గారికి గొంతు మీద మంచి control ఉన్నట్లుంది.
    శ్రీదేవి గారు పిల్లల మీద పెద్ద మనసు చేసుకుని ఈ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్తే బావుంటుంది.

    ReplyDelete
  6. స్పందించిన అందరికీ ధన్యవాదాలు.....బండి లాగటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి...త్వరలో మరిన్ని వివరాలు, కథలు....

    ReplyDelete
  7. వింటునత సేపు నేను కూడా చిన్న పిల్లనిపోయాను....

    ReplyDelete
  8. భలే ఉంది....చిన్నప్పుడు రేడియోలో విన్న నాటకంలా ఉంది.
    ఇంకా శ్రీదేవి గారి చేత బోలెడు కథలు చదివించగలరని మనవి.

    ReplyDelete
  9. చాలా బాగుంది సార్. మరిన్ని కధలకోసం ఎదురుచూస్తాం మరి.

    ReplyDelete