Wednesday, October 13, 2010

ఏంటిదీ - మూడు కాళ్ళ తాబేలు బొట్టు పెట్టుకుందా?

నాన్న - ఏలియన్ ప్రిన్సెస్స్ కథ చెప్పాడు
వాళ్ళను గీసిపారేసి చూస్తూ కూర్చున్నా ! 
 
నాన్న - పెద్ద పిల్లి బొమ్మలు రెండు వెయ్యమన్నాడు 
వాటితో పాటు చిన్న మిక్కీ, చిన్న పిల్లి కూడా వేసేసా!
పిల్లి - ఎలుక ఫ్రెండ్స్ అంటే నాన్న వినడే!
ఒకే పేజీలో వేసేసా అందుకే! రాత్రి బూచాళ్ళ కథ చెప్పాడు నాన్న
వాళ్ళ పేర్లు లంబు, జంబు, నింబు అట!
ఇల్లు కట్టేసా!
మా కారు పార్కింగులో పెట్టేసా !
ఓ ! అమ్మకు కళ్ళజోడు ఉంటే ఇలాగుంటుందన్నమాట
ఇప్పుడు కళ్ళజోడు లేదు కానీ - నేను ఊహించేసా!
ఏంటిదీ? తాబేలుకు ఎక్కడన్నా మూడు కాళ్ళుంటాయా? 
పైగా బొట్టు పెట్టావేంటి అని అడిగాడు నాన్న!


ఇంకా నేర్చుకుని బోల్డు బొమ్మలు గీసిపారేద్దామనుకుంటే, మా ఊళ్ళో నాలుగున్నరేళ్ళ వాళ్ళని డ్రాయింగ్ క్లాసుల్లో తీసుకోరని చెప్పాడు నాన్న....ప్చ్చ్....బయట ఇంకెక్కడైనా టీచర్ ఉన్నారేమో చూస్తాను అని అన్నాడు...తొందరగా దొరికితే బాగుండు..


వైష్ణవి 

10 comments:

 1. గురువుల ఆశీర్వాదం దొరికేనులే.
  ప్రస్తుతానికి నీ వయసే నీ గురువు.
  Keep it up!

  ReplyDelete
 2. Very nice. May be there are some coaching classes on internet.

  ReplyDelete
 3. వైష్ణవి,

  నీ బొమ్మలన్నీ భలే ఉన్నాయే ! మరి ,నాకు ఇచ్చేస్తావా? మా ఇంట్లో పెట్టుకుంటా .పోనీలే, బూచాళ్ళ బొమ్మలు నువ్వుంచుకో !
  *
  వైష్ణవి కి అభిమానాలు.

  ReplyDelete
 4. అందరి అభిమానాలకు ధన్యవాదాలు!

  ReplyDelete
 5. నా వరకు నాకు పిల్లలు వేసిన బొమ్మల తో పోలిస్తే ఇంకేమీ అందంగా కనిపించవు. చిన్ని చిన్ని మనసుల్లో రేగే ఊహలకు దృశ్య రూపం అస్పష్టంగా తోస్తున్నా, బుల్లి మెదడుకు ఎంతో శ్రమ ఇచ్చి వాటికి రూపాన్నివ్వాలని ప్రయత్నించడంలో ఒక బృహత్ కృషి దాగి ఉందనిపిస్తుంది. అది వారి మెదడుకు ఎంత శ్రమ కలిగిస్తుందో ఏమో! చెప్పాలనుకుని చెప్పలేకపోయిన భావాలింకా ఎన్ని దాగున్నాయో అనిపిస్తుంది మరో పక్క!

  టామూ, జెర్రీ స్నేహితులుగా ఉంటే బావుండన్న ఊహా, నాన్న చెప్పిన లంబూ జంబూలను విజువలైజ్ చేసుకోవడం, ఏలియన్లు మనుషుల కంటే భిన్నంగా ఉంటారు కాబట్టి వేరేగా పేద్ద కిరీటాలు పెట్టాలన్న యోచనా, అమ్మకి కళ్ళ జోడొస్తే ఎలా ఉంటుందన్న అందమైన ఊహా....పిల్లుల్లో ఒకటి మేలూ ఇంకోటి నైసుగా ఫిమేలూ,.! మౌసు బొమ్మయితే అసలు అద్భుతం!

  అసలు వెనక్కి తిరిగి చూస్తున్న తాబేలుని ఎవరైనా ఇంత వరకూ చిత్రించారా అని? (మరి వెనక్కి తిరక్కపోతే దాని మొహం ఎలాగుంటుందో మనకు తెలీదు కదా అన్న ఊహకు వెయ్యి నూట పదార్లు)

  వైష్ణవి సృజనాత్మకత బ్రహ్మాండంగా ఉంది! మా ఐద్రాబాదులో అయితే రెండేళ్ల పిల్లలకు కూడా పెయింటింగ్ క్లాసులు పెట్టేస్తారు. మీ వూరు చాలా వెనకపడి ఉందండీ!

  ReplyDelete
 6. @సుజాత - చెప్పాలనుకున్నా చెప్పలేనివి బోల్డు దాగున్నాయో అన్న మాట నిజం....
  ఐద్రాబాదులో రెండేళ్ళకే పెయింటింగు క్లాసులు పెట్టేస్తున్నారా? ఆశ్చర్యం!
  అయినా కాలిఫోర్నియాలో అంతే, కాలిఫోర్నియాలో అంతే!
  అభిమానానికి ధన్యవాదాలు....

  @దిలీప్... :)

  ReplyDelete
 7. :)) భలే ఉన్నాయి బొమ్మలు.
  అన్నట్లు, మీ బ్లాగు ఇంకా నడుస్తూ ఉందని ఇప్పటి దాకా తెలీదు నాకు!! :)

  ReplyDelete