Sunday, October 3, 2010

కాలయంత్రం (1982 ఆకాశవాణి నాటకం) - హెచ్.జి.వెల్స్ "టైం మెషీన్" స్ఫూర్తి

ఆంగ్ల రచయిత హెచ్.జి.వెల్స్ "టైం మెషీన్" స్ఫూర్తితో శ్రీ కె.చిరంజీవి గారు వ్రాసిన నాటకం ఇది. ఇరవైదేళ్ళ తర్వాత మనుషులు సమాజం ఎలా ఉండబోతున్నాయో ఊహిస్తూ వ్రాసిన నాటకం.

ఆకాశవాణి వారు 1982 లో తొలిసారిగా ప్రసారం చేసారు.
పునః ప్రసారం: అక్టోబరు 3, 2010

ఈ నాటకంలోని పాత్రలు ధరించింది వీరే:
సర్వశ్రీ
ఎన్.రవీంద్రారెడ్డి
డి.హనుమంతరావు
కె.హనుమంతరావు
పి.నారాయణ
డాక్టర్ పి.రామారావు
డాక్టర్ సి.నరసింహ
రత్నాసాగర్
శారదా శ్రీనివాసన్
కె. చిరంజీవి
వాణి రెడ్డి

సంగీతం: ఎం.చిత్తరంజన్, ఎన్.ఎల్.సుభాష్, మనోజ్ కుమార్

సాంకేతిక సహకారం: నజీర్ అహ్మద్, విశ్వనాథం, వి.ఎస్ వాసన్

(1961 - 1993) కాలంలో ఆకాశవాణి హైదరాబాదు నాటక విభాగ కళాకారుడిగా పనిచేసిన శ్రీ కె చిరంజీవి గారు రాసిన ఆ నాటకం ఇదిగో మీ కోసం.

శ్రీ రంజని గారి (తెలుగుథీసిస్.కాం) సౌజన్యంతో.
ఈ ఆడియోను అందించిన ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ నాటకం చూడవచ్చు, వినవచ్చు....

భవదీయుడు
వంశీ

2 comments:

  1. కె.చిరంజీవి - భాగ్యనగరం నాటకం లో హీరో పాత్ర వినిపించిన ఆయనే కదా? లేదంటే ఈయన మరొక కె.చిరంజీవా? ఇందాకే, మా అమ్మ్మమ్మ వయసు ఆవిడతో మాట్లాడుతూ ఉంటే - చెప్పిన సంగతి...ఆ కాలం లో ఆవిడ బీయస్సీ చదువుతూ ఉన్నప్పుడు - వారికి ఒక వ్యాస రచన పోటీ లో ఇచ్చిన వస్తువు - 'సినిమాల వల్ల నాటకాలకి ముప్పూ అని. ఈవిడ ఒక్కరే అట క్లాసు మొత్తం లో దాన్ని వ్యతిరేకించింది. అందరూ ముప్పు అని ఫిక్సైపోయారేమో! :) అదే నిజమైందా?

    ReplyDelete
  2. భాగ్యనగరం వారు నార్ల వారు......బాలసాహిత్యం, సినిమా పాటలు అవీ ....అలా..అలా...."పిల్లల కధలు" - విశాలాంధ్ర వారి ప్రచురణ ఓ మంచి పుస్తకం....

    కాలయంత్రం వారు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నాటకాలకు ఓ రకంగా పట్టుకొమ్మ.... మరి ఇద్దరూ వేరు వేరు, ఉద్దండులు...

    ReplyDelete