Wednesday, September 29, 2010

ఆకాశవాణి - శారదా శ్రీనివాసన్‌ గారి పరిచయ కార్యక్రమం




మహానటి సావిత్రి కళ్లలో నవరసాల్ని ఒలికిస్తే ఈమె తన గళంలో పలికిస్తారు. ఆమె చిత్రజగత్తు నేలిన అభినేత్రి అయితే ఈమె ఆకాశవాణి వాచకాభినేత్రి. 1960-90ల మధ్య కాలంలో రేడియో నాటకం విన్నవారు ఆమె వాచకాన్ని, అలలలలుగా వినబడే ఆ నవ్వుని మరిచిపోవడం అసంభవం. పురూరవలో ఊర్వశిగా, సుప్తశిలలో అహల్యగా, కాలాతీతవ్యక్తుల్లో ఇందిరగా, భాగ్యనగరంలో భాగమతిగా, కంఠాభరణంలో సుబ్బలక్ష్మిగా ... కొన్ని వేల పాత్రలకు రేడియోలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన శారదా శ్రీనివాసన్‌గారి జ్ఞాపకాలు ఆంధ్రజ్యోతి వారు అక్షర రూపంలో పదిలపరిస్తే, స్వరంలో ఆకాశవాణి వారు 2008 వ సంవత్సరంలో పదిలపరచారు. ఆ ఆకాశవాణి పరిచయ కార్యక్రమాన్ని రికార్డు చేసి పంపించిన మిత్రులు శ్రీ రంజని (తెలుగుథీసిస్.కాం) గారికి హృదయ పూర్వక ధన్యవాదాలతో...

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ కార్యక్రమం చూడవచ్చు, వినవచ్చు....

ఆంధ్రజ్యోతి వారన్నారు, వార్తన్నారు, వ్యాసమన్నారు మరి - అదెక్కడ ఉందా? పరిచయ కార్యక్రమం మొదటి భాగం పేజీలో !

భవదీయుడు
వంశీ

3 comments:

  1. చాలా లింకుల్లో ఆడియో అస్సలంటే అస్సలు వినిపించడం లేదు.మరీ అన్నన్ని పంచభక్ష్యపరవాన్నాలు ఎదురుగా పెట్టి, మరీ తినకూడదంటే ఎలా బాబూ? ఎదో ఒకటి చేసి మాకు వినే భాగ్యం కలిగించు. సైటు ఓపెన్ అవుతోంది.వాటిమీద నొక్కితే అది కూడా ఓపెన్ అవుతోంది. కానీ ప్లే మీద నొక్కినా ఏమీ అవడం లేదు. బాబ్బాబు తొందరగా ఈ సమస్యకి సమాధానం చెప్పి పుణ్యం కట్టుకోండి.

    భమిడిపాటి ఫణిబాబు.

    ReplyDelete
  2. ఫణిబాబు గారూ

    మీకు ఎందుకు ప్లే కవడంలేదో కారణం తెలీదు...కనెక్షన్ స్పీడు గొడవ అయ్యుండొచ్చు అని ఊహ! ఇతరులకు కూడా మీలానే ఆడియో ప్లే కాకపోతే అప్పుడు చూస్తాను...నాకైతే బానే ప్లే అవుతున్నాయి అన్నీ....కాకుంటే కొన్ని ఫైళ్ళు సైజులో చాలా పెద్దవి...అందుకు మీరు ఒక నిముషం దాకా వేచి ఉండాల్సి వస్తుంది....బఫర్ అయ్యాక ప్లే అవ్వాలి మరి...

    ReplyDelete
  3. THE FILES ARE PLAYING OK FOR ME TOO. AS RIGHTLY POINTED OUT BY VAMSI, SOME FILES DUE TO SHEER SIZE ARE TAKING SOME TIME TO BUFFER.

    PHANIBABU GARROO CLICK THE AUDIO LINK AND WAIT FOR SOMETIME WITHOUT DOING ANYTHING ELSE IN THE PC. AFTER A FEW MINUTES THE AUDIO STARTS PLAYING. JUST CHECK THE CONNECTION SPEED OF YOUR INTERNET.

    ReplyDelete