Sunday, September 26, 2010

రావు బాలసరస్వతి - రంగనాయకమ్మఇష్టా గోష్టి

"వేదికపై నాటకం రసవత్తరంగా జరుగుతోంది. ఒక ప్రధాన పాత్రధారి రామనాధశాస్త్రిగారు ఆ సందర్భాన పాడవలసిన పాటను ప్రారంభించారు. ఇంతలో ఆహుతుల్లోంచి 4ఏళ్లపాప ఆ పాట నాకునూ వచ్చు నేను పాడతాను అంటూ గట్టిగా అరిచింది. పెద్దలు ఎవ్వరూ చెపినా వినదే! నేనూ పాడతానంటూ మారం చేసింది. చివరికి రామనాధశాస్త్రిగారు ముచ్చటపడి ఆ పాపను స్టేజిపైకి పిలిచి ఆ పాటను ఆమెచేతే పాడించారు. ప్రేక్షకులంతా కరతాళధ్వనులు చేశారు. అభినందనలు అందించారు. ఆశీర్వదించారు.మరో రెండేళ్లకే ఆ అమ్మాయి ఒకేసారి 2సోలో రికార్డులు పాడిన పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. ఇదంతా 1934నాటి మాట. ఆ అమ్మాయి సంగీతవనంలో మొదటిసారిగా 'లలిత సంగీతమనే పుష్పాన్ని పూయించిన తోటమాలి. ఇప్పుడు ఆ స్వరకేళికి 80ఏండ్లు. కానీ రావు బాలసరస్వతీదేవి పేరు దక్కిన ఖ్యాతి నిలిచేను వెయ్యేళ్లు." - "వార్త" పత్రికలో రావు బాలసరస్వతి గారి మీద ప్రచురించిన వ్యాసంలోని మాటలివి.

పాటలు అనే పదార్ధం ఇష్టం ఉన్నవారెవరికైనా ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదనే ఇంతవరకూ అనుకుంటున్నాను. అలాగే మనకున్న రచయిత్రుల్లో రంగనాయకమ్మ గారి గురించీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి గానకోకిల రావు బాలసరస్వతి గారు - రచయిత్రి రంగనాయకమ్మ గారు ఇష్టా గోష్టి కార్యక్రమంలో పాల్గొంటే ఏలా ఉంటుంది ? ఆ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 1992 లో. అదే కార్యక్రమాన్ని ఈ నెల 25వ తారీకున పునః ప్రసారమూ చేసింది.

ఆ పునఃప్రసార అవకాశాన్ని ఒడిసిపట్టుకుని "రంజని" గారు ఆ ఆడియోను రికార్డు చేసి వెబ్సైటులో పబ్లిష్ చెయ్యమని పంపించారు. అందుకు రంజనిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో...

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ కార్యక్రమం చూడవచ్చు, వినవచ్చు....

ఆనందో బ్రహ్మ

మళ్ళీ బ్లాగు దర్శన ప్రాప్తిరస్తు, పునఃప్రాప్తిరస్తు
సందర్శకులకు సందడీ పుణ్య ప్రాప్తిరస్తు

భవదీయుడు
వంశీ

4 comments:

 1. బాలసరస్వతి గారితో రంగనాయకమ్మ గారి ఇష్టాగోష్ఠి ఆడియో విన్నాను. చాలా బాగుంది. ధన్యవాదాలండీ!

  ఈ అద్భుత గాయని పాటలకు దూరమవ్వటం గురించిన ప్రస్తావన ఊహించినట్టే వచ్చింది. రంగనాయకమ్మ గారు ఆమె పాటను చందమామ వెన్నెలతో పోల్చి, పాడటం ఎందుకు ఆపేశారని చక్కగా అడిగారు. కుటుంబం అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ‘నాకంత ధైర్యం లేకపోయింది’ అని చెప్పిన బాలసరస్వతి గారి నిస్సహాయతకు విచారమనిపించింది.

  ఈ సందర్భంగా ఆమె కొన్ని పాటల పల్లవులు పాడి వినిపించటం కూడా బావుంది!

  ReplyDelete
 2. ఈ కార్యక్రమాన్ని అందించినందుకు రంజని గారికీ, మీకూ కృతజ్ఞతలు.
  రంగనాయకమ్మ గారు ఏ ప్రశ్నలకి సమాధానాలు రాబట్ట దల్చుకున్నారో, బాలసరస్వతి గారి మొహమాటాన్ని బహుశా దాటుకుని ఆ సమాధానాలు రప్పించే ప్రయత్నం చేసినట్టున్నారు. సదుద్దేశమేనేమో, సమయాభావం వల్ల కూడా అలా చెయ్య వలసి వచ్చిందేమో. కానీ, బాల సరస్వతి గారిని పూర్తి చెయ్యనివ్వకుండా ప్రశ్నను రెట్టించడం ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే, ఎంతో సున్నితంగా తన నిస్సహాయతను తెలియ బర్చారు బాల సరస్వతి గారు. ఆమెను "మీరు ఇలా చేయవలసినది" అనకుండా, ఇటువంటి బలహీనతలను అధిగమించాలి అని సార్వజనీనకంగా (సరైన పదమేనా?) సూచించి ఉంటే బావుండేదేమో అనిపించింది.

  ReplyDelete
 3. I ONLY ENJOYED THE VOICE AND REPLY OF SMT. BALASARASWATI BUT NOT THE INTERVIEWER WHO IS TRYING TO HECTOR THE GREAT LEGEND WITHOUT REALISING HER GREATNESS OR MAY BE PRESUMING SHE HERSELF IS GREATER THAN THE INTERVIEWEE.

  ReplyDelete
 4. I ONLY ENJOYED THE VOICE AND REPLY OF SMT. BALASARASWATI BUT NOT THE INTERVIEWER WHO IS TRYING TO HECTOR THE GREAT LEGEND WITHOUT REALISING HER GREATNESS OR MAY BE PRESUMING SHE HERSELF IS GREATER THAN THE INTERVIEWEE.

  ReplyDelete