Wednesday, June 9, 2010

"పంగనామం - బుంగనామం" - సమాధానాలు !!

1) గొడుగుని పట్టుకునే కర్రనేమంటారు ? - "కామ"

2) కర్రలేని గొడుగునేమంటారు ? - "గిడుగు" - ఐతే ఇప్పుడు ఈ ఇంటి పేరున్న మహానుభావులెవరో చెప్పండి చూద్దాం!

3) తెర్లించు అంటే నీళ్ళను మరిగించటం - మరి తొర్లించు అంటే? - సమాధానం చెప్పేసారు కాబట్టి మళ్ళీ చెప్పనఖ్ఖరలా

4) పంగనామం అంటే అందరికీ తెలుసు - మరి బుంగనామం అంటే?
తెల్ల నామానికీ, ఎర్రనామానికీ ఎడం లేకుండా ఉంటే దాన్ని బుంగనామం అంటారు

5) ఈడుముంత అంటే? - పాలు పితికే గిన్నె

6)కొట్నం - వడ్లు దంపటం

7)మండ కంచం - అంచు కట్టించిన కంచము

8)బొక్కెన పట్టుకునే ఇనప కడ్డీనేమంటారు? - వల్లిగము

6 comments:

 1. ఒక ప్రశ్నండి..ఈ పదాలు ఎందుకు వాడుకలో లేవు? కనీసం నా వరకు సగం పైన మొదటిసారి విన్నవే..ఇది తెలుసుకోవాలన్న జిజ్ఞాసే కానీ భాషాభిమానం లేక కాదు సుమా! ఎంతవరకు మన తర్వాతి తరానికి నేర్పాలి/తెలియజేయాలి అన్న దిశగా ఈ ఆలోచన.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. అయితే (పూర్తి) గొడుగుని "కామ గిడుగు" అంటారా లేక "గిడుగు కామ" అంటారా. గొడుగు పట్టుకున్న మూర్తిని "గిడుగు కామ మూర్తి" అనొచ్చా:-)

  మీ ఎనిమదవ ప్రశ్న "బొక్కెన కున్న హేండిల్‌ని ఏమంటారనా" లేక "బొక్కెన బావిలో పడిపోతే తియ్యడానికి పట్టుకునే ఇనుప కడ్డీని ఏమంటారనా"? కొంతమంది "గేలం" అని జవాబిచ్చారు, అందుకని సందేహం.

  ReplyDelete
 4. ఉషగారూ

  వాడుకలో ఎందుకు లేవు ? మీ ప్రశ్నలోనే ఉంది సమాధానం!

  ఎంతమంది పంగనామాలు పెట్టుకుంటున్నారు ఈ రోజు ? ఎంతమంది పిల్లలు పాలు పితకడం చూస్తున్నారు? ఎంతమంది బొక్కెన పట్టి బావిలో నీళ్ళు తోడుతున్నారు? ఇలాగ బోల్డు చెప్పవచ్చు...ఆశ ఉండటం సదా అభిలషణీయమే, ఆచరణలో పెట్టాలనుకోవటమూ, పిల్లలకు తెలియచెయ్యాలనుకోవటమూ ముదావహమే! శుభాభినందనలు! చిన్నప్పుడు విన్న పదాలని ఎంత విఱివిగా ఉపయోగిస్తే అంత బాగా నిలబడుతుంది "సంపద". లేనినాడు అది విషతుల్యమైన అ"మృత" స్వరూపం. అంతకన్నా ఎక్కువ ఇక్కడ కామెంటులో చెప్పలేను. వివరంగా తర్వాత ఒక టపా సిద్ధం చేస్తాను.

  @ కె.కె - మీ హాస్యం బాగుంది. అది అలా పక్కన బెడితే గిడుగు రామ్మూర్తి పంతులు గారు అని రాసి ఉంటే ఇంకా బాగుండేది.. :) నా ఎనిమిదవ ప్రశ్న - పడిపోయిన బొక్కెన పట్టుకునే "గాలం" కాదు.. :)

  ReplyDelete
 5. వంశీగారు, ధన్యవాదాలు. మీ టపా కోసం చూస్తానిక. ఇవాళ ఉదయం మా పెరట్లో ఓ పది వరకు వచ్చిన పిచ్చుకలని చూస్తూ వచ్చిన ఆలోచనే ఆ ప్రశ్న. అక్కడ అంతరించిపోయా/తున్నా/యట. ఒక్క శీతాకాలం తప్ప నాకు కనపడని రోజు ఉండదు ఇక్కడ.

  ReplyDelete
 6. వంశీ గారు, "మండ కంచం = అంచు కట్టించిన కంచము" అన్నదానికీ ఈ సామెతకీ సంబంధం ఉందో లేదో కానీ "అన్నీ ఉన్నాయి, అంచుకు తొగరే లేదు" అన్నది కుదురులేని వాళ్ళని ఉద్దేశించి వాడతారు మా ఇళ్ళలో.. వివరణ అడిగితే "అంచుని వంచి పట్టుకోవటానికి అనువుగా చేయకపొతే పళ్ళెం ఎలా ఉంటుందో, అలాగే కుదురులేని వాళ్ళూను అని చెప్పారు. [ఈ వ్యాఖ్య తొలగించినా ఫర్వాలేదు]

  ReplyDelete