Saturday, June 5, 2010

ఈ పాట గుర్తుందా ? ఈయనెవరో తెలుసా?

"సీతారాముల కల్యాణము చూతము రారండీ" - పాట గుర్తుందా ? గుర్తులేకపోతే యూట్యూబులో వెతకండి.. ఏ తెలుగోడి ఇంట్ళో అయినా సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరిగితే తప్పకుండా వినపడే పాట...పెళ్ళిళ్ళు జరిగినంతకాలం - ఎప్పటికీ వినపడే సంగీత ముత్యాల మూట (ముత్యాల మూట వినపడుతుందా?)


అలాటి ఆణిముత్యాన్ని అందించిన సంగీతం మాష్టారు ఎవరో తెలుసా ? - శ్రీ గాలిపెంచల నరసింహారావు




ఈ పాటే కాక ఇంకా బోల్డు ముత్యాలని అలాగ్గా అలా సినీ సంగీత ప్రపంచంలో దొర్లించిన ఆయన ఫోటోనే ఇది..."గానకళ" అని ఆయన రాసిన పుస్తకంలో కనపడితే కత్తిరించి ఇక్కడేసానన్నమాట..

3 comments:

  1. ధన్యవాదములు వంశీగారూ. ఒక అద్భుతమైన పాటకు సంగీతాన్ని అందించిన గాలిపెంచల నరసింహారావుగారు ఎలా ఉంటారో అని ఇన్నాళ్ళూ ఊహకే పరిమితమైన అబిమానుల అలోచనలుకు తెరదింపి,ఫొటో ప్రచురించారు. ఆయన స్వరపరిచిన అజరామజరమైన పాట తెలుగు పాత పాటలు వెబ్ సైటులో ఉన్నది. ఈ కింది లింకు వాడి వినవచ్చు.

    http://www.oldtelugusongs.com/dec2005/SeetharamaKalyanam_1961-Suseela&Co-SeetharamulaKalyanam-SamudralaSr_Galipenchala.mp3

    ReplyDelete
  2. అలాగే గీత రచయిత సముద్రాల సీనియర్ గారి పేరు కూడా మరవకూడదు కదండి మరి. ఇటువంటి ఆణిముత్యాలు ఆయన హృదయ ఆళువలోనేగా రూపు దిద్దుకున్నది మున్ముందుగా..

    ReplyDelete
  3. ఓహ్, గాలిపెంచల గారంటే వీరేనా... గత రెండు మూడు రోజుల్లో మాగంటి రేడియో లో ఈ పేరు చాలాసార్లు విన్నాను. భానుమతి ప్రోగ్రాం లోనే 2,3 సార్లు వచ్చినట్లు ఉంది. బాగుంది! మరి ఈయన గురించి మీరు కాస్త తీరిగ్గా రాయరాదూ? :) అన్నత్లు, సదరు పుస్తకం గురించి కూడా - 'appropriate forums' వద్ద పరిచయం చేయొచ్చుకదా... ;) :P

    ReplyDelete