Thursday, June 3, 2010

పుస్తకం చదవకుండా, అందులోని కథ చెప్పే ప్రయత్నం!!!

మామూలుగా అందరికీ తెలిసింది ఇది అని నా ఊహ...... :)

తోక పోయి
కత్తి వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కత్తి పోయి
కట్టె వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కట్టె పోయి
దోసె వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
దోసె పోయి
డోలు వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం


డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సంకలనం చేసిన న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) గారి రచనలు - "భోగిపళ్ళు" పుస్తక రూపంలో ఉన్నాయి...ఆ పుస్తకం తిరగేస్తూ ఉంటే ఈ పైన ఉన్నదే ఇంకో రకంగా కనపడింది...

ఆవు పోయి
గొర్రె వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
గొర్రె పోయి
కోడి వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కోడి పోయి
కుక్క వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కుక్క పోయి
డోలు వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం

ఐతే ఏమిటంటారా?

వస్తున్నా - అక్కడికే వస్తున్నా

ఇక్కడ "ఆవు పోయి ....." అని రాసినదాన్ని బట్టి, పుస్తకం చదవకుండా, కథ చెప్పే ప్రయత్నం చెయ్యండి...

అలాగే మీకు తెలిసిన మీ "లోకల్ వర్షన్" ఏదన్నా ఉంటే తెలియచెయ్యండి :)


"తోక పోయి...." దీని వెనక కథ చూడాలంటే ఇక్కడ నొక్కి, అందులో ఢాం ఢాం ఢాం అని ఉన్న లంకె మీద నొక్కండి

నాలుగేళ్ళ వైష్ణవికి కంఠతా వచ్చు, ఏవి ? "తోక పోయి" పద్యం - కథానూ.. ఇహ మీ కథ చూడటమే తరువాయి... :)

2 comments:

 1. ఢాం ఢాం ఢాం నాకు తెలిసినదాన్లో
  "ముల్లు పోయి కత్తి వచ్చే
  ఢాం ఢాం ఢాం,
  కత్తి పోయి డాలు వచ్చే
  ఢాం ఢాం ఢాం" అనొస్తుందని గుర్తు..

  మా పెద్దమావయ్య మా పిల్లమూకని "పిల్లకోత్స్" అని పిలిచేవోరు. ఆపై తన కథలన్నీ కోతికి సంబంధించినవే. అలా మేము మధ్యలో "ఊ" కొడతానికి బదులు ఆ కథ తాలూకు సన్నివేశాలని పాడేవాళ్ళం. ఉదా:"కోతి కింద జారిపడె ఢాం ఢాం ఢాం, దాని మూతి పళ్ళూ రాలిపడె ఢాం ఢాం ఢాం" అని తాటాకు టపాకాయలు పేలినట్లు చెవులు గళ్ళు పడేలా అరిచేవాళ్ళమని గుర్తు. అలాగే తను సర్జన్ కనుక ఈ కోతి ముల్లు కథలో ఆపరేషన్ సీన్ చొప్పించి మరీ చెప్పేవారు. కనుక మాకు ఆ వర్షన్ అలవాటు. అలాగే కోతులే హీరోలు, విలన్లూను మరి కొన్నిటిలో.

  మా అమ్మమ్మగారి ఊర్లో ఇళ్ళ మీదకి జంగారెడ్డి గూడెం/భద్రాచలం ప్రాంతాల అడవుల్నుంచి వచ్చిన కోతుల దండు వచ్చిపడేవి. బొబ్బాస, మావిడి పళ్ళు గట్రా రాల్చేసేవి. వాటి వెంట పడి ఇదే పాట, మాలో ఒకరి మీదకి ఓ గడోతి పడి జుట్టు పీకేదాకాను. :) ఇక పండుకోతులు మరీ తిక్కవి, గదుల్లోంచి పాటలు కట్టి వినిపించేవాళ్లం వాటికి మట్టుకు.

  "ఆవు పోయి.." ఎవరైనా అప్పుల పాలై/దానధర్మాలు శక్తికి మించి చేసి అలా ఒకటొకటి పోగొట్టుకున్నారనా? పోయేదేముంది నూటికి సున్నా వేస్తారు అంతేగా.. చెప్పేస్తే పోలా అని ఓ రాయి వేసా.

  నా బడి పిల్లలకి మీ వైష్ణవి మాట చెప్పాల్సిందేనండి. వాళ్ళూ బంగారాలే కానీ మీ చిన్నారి అంత కాదు సుమా! దిష్టి తీయించండి మరి. :)

  కోతి మాట వినేసరికి కోతిలా బుర్ర మాట వినటం లేదండి :) అన్నట్లు మీ కోతి ఆటలో నేను మీ స్కోర్ దగ్గరగా వచ్చేవరకు, నా పిల్లకోతి మిమ్మల్ని దాటేదాకా - ఆడేసాం పోయిన్నెల్లో.

  ReplyDelete
 2. ఈ కథ కోసం మీ సైట్లో వెతుకుతున్నా. మీరిచ్చిన ఈ లంకె (http://www.maganti.org/page4.html) ఇండెక్సు పేజీకి వెళ్తోంది. కొంచం సరైన లంకె ఇస్తారా?

  ReplyDelete