Wednesday, June 2, 2010

జమీందారీ వ్యవస్థ గర్హింపదగిందే - అయినా!!!

ఆంధ్రదేశం చాలా కాలం రాజాశ్రయాన, జమిందారీ ఆశ్రయాన మూడుపూవులు ఆరుకాయలుగా వర్ధిల్లింది.

ఆంధ్ర సంస్థానాలు - సాహిత్యపోషణ అనే రచనలో ఆచార్య తూమాటి దొణప్పగారేమంటారంటే - "జమీందారీ వ్యవస్థ గర్హింపదగిందే అయినా, ఆయా జమీందారులు ఉన్నత సంప్రదాయాలను పోషిస్తూ - సాహిత్య సంస్కృతులకు పరిరక్షకులుగా చేసిన సేవ మాత్రం విస్మరింపరానిది." అలాటి సంస్థానాధీశుల చిత్రాలను తెలియనివారికి పరిచయం చేయటం పనిగా పెట్టుకుని ఈ భాగం ప్రారంభించాను -

సంస్థానాధీశుల వివరాలు

ఓం ప్రథమంగా "అమ్మమ్మగారి ఊరు" - మా చల్లపల్లి (దేవరకోట) సంస్థానాధీశులు శ్రీ శివరామప్రసాద్ బహద్దర్ గారి చిత్రం పొందుపరచాను.

మీ వద్ద ఇతర సంస్థానాధీశుల వివరాలు, చిత్రాలు ఉంటే తప్పక పంపించ ప్రార్థన

4 comments:

 1. "నానారాజ చరిత్రము" అనుకుంటాను పుస్తకం పేరు. నానారాజ సందర్శనము (తి.వెం. కవుల రచన) మాత్రం కాదు!! సుమారు నాలుగైదు వందల పేజీల పుస్తకం. 1930ల్లో ప్రచురితం. దానిలో పూర్తిగా తెలుగు సంస్థానాలు, జమిందారీల వివరాలు, అప్పటి జమిందార్ల ఫోటోలు (చాలా మంచి క్వాలిటీలో) వుంటాయి.

  ఒక రెండు వారాల్లో ఇంటికి చేరినప్పుడు పుస్తకం టైటిల్ కచ్చితంగా చెప్పగలను. Scans కావాలంటే నాకు బోలెడు టైము కావాలి :).

  పోతే, దోణప్ప గారి పుస్తకపు బాణీలోనే, విజయలక్ష్మిగారు తెలుగు కమిందారీలు - సంగీత పోషణ అన్న పుస్తకం రాసారు (Ph.D thesis). DLI లో కూడా వుందా పుస్తకం. అలాగే ఆవిడ M.Phil thesis కూడా వుందక్కడ. ఆ పుస్తకం ఆధారంగా "హాసం" పత్రికలో తనికెళ్ళ భరణి చాలా వారాలు వ్యాసాలు రాసారు.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 2. శ్రీనివాస్‌గారు మాట్లాడుతున్నది దీనిగురించేనేమో?
  నానారాజన్యచరిత్రము
  http://www.archive.org/details/nanarajanyacarit00virasher
  ----
  మరో పుస్తకం
  ఆవటపల్లి నారాయణరావుగారు 1940లో ప్రచురించిన "విశాలాంధ్రము."
  ఇందులో ఎక్కువభాగం సంస్థానాధీశులు, రావుబహద్దరులు.

  పీఠిక నుంచి -- "ఇది తారీఖులకున్నూ, జీవితవివరాలకున్నూ సంబధిచిన జీవితచరిత్రల పుస్తకంకాదు. ప్రముఖుల దేశహితైక జీవనాన్ని వివరిచడానికిన్నీ, వారి చిత్తరువు గీయడానికిన్నీ ప్రయత్నం చేయబడింది. ఈలాటి వుద్దేశంతో ఆంధ్రంలో వ్రాయబడ్డ పుస్తకాల్లో యిదే మొదటిదని నా అభిప్రాయము." --

  నావద్దనున్న స్కానర్‌ పనిచేయటంలేదు - మరెక్కడైనా స్కాన్‌చేసి త్వరలో పంపిస్తాను.

  --
  వాడపల్లి శేషతల్పశాయి.

  ReplyDelete
 3. శాయిగారు: అవును, ఆ పుస్తకమే! archive.org లో వున్నట్లు తెలియదు. నాలుగేళ్ళ క్రితం మనిద్దరం కోటీలోని పుస్తక దుకాణాల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒక పాత పుస్తకాల షాపులో కొన్నాను :-).

  అవటపల్లి నారాయణరావు పుస్తకం కూడా వుండాలి. కానీ తెనాలిలో వుందది.

  ఇప్పుడే digital పుస్తకం చూస్తున్నాను. ఫోటోలు బాగా scan కాలేదు. పుస్తకం 1918లో ప్రచురితమైనా ముద్రణ బాగా వుంది.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 4. శ్రీనివాస్ గారూ, శాయి గారూ - పుస్తకాలకు, వివరాలకు వేల ధన్యవాదాలు

  ReplyDelete