Sunday, May 30, 2010

స్వర సుధాకరులు - ఆకాశవాణి - చిత్రాలు

శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారు తన సాహిత్యాభిమానిబ్లాగులో పెట్టిన "రేడియో కళాకారుల" చిత్రాలే కాక ఇతర ఫోటోలు కూడా పంపి నన్ను ఎంతో ఆశ్చర్యంలోనూ, ఆనందంలోనూ ముంచేసారు. వారికి బోల్డన్ని..బోల్డన్ని..బోల్డన్ని కృతజ్ఞతలు.

ఇక్కడ నొక్కండి - అక్షర చిత్రాలు

ఒకమాట మటుకు చెప్పాలె - శ్రీ అద్దంకి మన్నార్ గారి గొంతు విని మైమర్చిపోతూ ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ణి. భగవంతుడు ఇంత మంచి గాత్రం ప్రసాదించాడు - మనిషి ఎలా ఉంటారో అని! శివరామప్రసాద్ గారి పుణ్యమా అని ఆ అందగాణ్ణి చూసే భాగ్యమూ, వెబ్సైటులో పెట్టుకునే పుణ్యమూ దక్కినాయి. ధన్యోస్మి...ధన్యోస్మి...

మీరెవరి వద్దైనా ఇలాటివి ఉండి పంచుకోవాలనుకుంటే, maganti dot org at gmail dot com కు ఈమెయిలు పంపించండి....అలా పంచుకోవాలనుకున్న మహానుభావులకు ముందస్తు వందనాలు - ధన్యవాదాలు.

2 comments:

  1. వేల వేల ధన్యవాదాలు శివరామ ప్రసాద్ గారికి, మీకు కూడా! ఇన్నాళ్లకి అద్దంకి మన్నార్ గారి ఫొటో చూడగలిగాను. మిగిలిన వారి ఫొటోలు అక్కడో ఇక్కడో(ఎక్కువగా "వాణి"లో)చూశాను.సి.రామ్మోహన్ గారు ఆనంద భైరవి లో కరటకుడి తాతగా వేశారు కూడా!ఎ బి ఆనంద్ గారి పూర్తి పేరు ఎ.బ్రహ్మానంద రెడ్డి అనీ, ఆయనా.బి అనంద్ గా తన పేరు ఉంచుకున్నారనీ విన్నాను.

    అలాగే ఏకాంబరం అసలు పేరు శ్రీ వి.సత్యనారాయణ అని ఆలిండియా రేడియో మిత్రులొకరు చెప్పారు.

    ReplyDelete
  2. సుజాత గారు - ఏకాంబరం గారి పేరు తెలియచేసినందుకు ధన్యవాదాలు..

    All Credit Goes To Sri Sivarama Prasad.

    ReplyDelete