Wednesday, May 19, 2010

కావాలనుకున్నోళ్ళు చూస్కోండి!

Hindu Literature Or, the Anicient Books Of India By Elizabeth A Reed

1891 లో రాసిన ఈ పుస్తకం అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం సాన్ ఫ్రాన్సిస్కో పియర్ 39 కి వెళ్ళినప్పుడు ఎంబార్కడేరో, పావెల్ స్ట్రీట్ ఇంటర్సెక్షను దగ్గర ఒక మూలకున్న పుస్తకాల కొట్లో 4 డాలర్ల 75 సెంట్లెట్టి కొన్నా. అప్పుడు చదివా, బానే ఉంది. ఓ రెండు వారాల క్రితం మళ్ళీ బయటకు తీసా. ఓ 300 పేజీలు చదివాక - ఇవ్వాళ్ళ అసలు ఈ ఎలిజబెత్ రీడ్ కథా కమామీషు ఏమిటి అని గూగిలించా.

ఢామ్మని ఒక మాంచి పుస్తకాల సైటు దొరికింది. కావాలనుకున్నోళ్ళు చూస్కోండి

ఫర్ గాట్టెన్ బుక్స్

ఈ పైన చెప్పిన పుస్తకం కూడా ఇక్కడున్నది - మంచి కాపీ కాదు కానీ - ఫరవాలా - డైరెక్టు లింకు ఇక్కడ

Hindu Literature, Or the Anicient Books Of India

ఈ ఎలిజబెత్ రీడ్ గురించి పెద్దగా వివరాలు దొరకలేదు కానీ వికిపీడియాలో ఉన్న వివరాలను బట్టి ఈవిడే ఆవిడ అనుకుంటున్నా.. :)

ఎలిజబెత్ రీడ్

ఇప్పటికింతే....పుస్తకంలో విశేషాలు అక్కడ చదూకోండి. రాసే ఓపిక లేదు

ఈ కింద పుస్తకాలు కూడా కనపడ్డాయి ఆ సైట్లో -

Hymns of Samaveda

The Laws of Manu

The Garuda Purana

Songs of Kabir

A Vedic Reader For Students

Great Systems Of Yoga

Black Marigolds

Hindu Mysticism



అలానే ఇంకో మంచి సైటు - చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ - మళ్ళీ

సేక్రెడ్ టెక్స్ట్స్

వీళ్ళు సి.డిలు కూడా అమ్ముతారు - రెండేళ్ళ క్రితం ఒకటి కొన్నా - రెఫరెన్సు కోసం బాగుంది. సేక్రెడ్ టెక్స్ట్స్ లో ఉన్నవీ ఫర్ గాట్టెన్ బుక్స్ లో ఉన్నవీ - మన హిందూ దేశానికి సంబంధించి - చాలా మటుకు ఒకటే. ఐతే ఇతర పుస్తకాలు ఫర్ గాట్టెన్ బుక్స్ లో కొన్ని మాంచివి కనపడ్డాయి ...అదన్న మాట సంగతి...

మనోళ్ళు కూడా ఎవరన్నా తెలుగులో ఇలాటిదొకటి సేత్తే బాగుంటది.. ! అంటే సేక్రెడ్ టెక్స్ట్స్ లాటిది...ఆర్కైవ్ ఉంది - డి.ఎల్.ఐ ఉంది అని సెప్పొద్దు... :)



Update to the post -

క్లారిటీ కోసం - "ఇలాటి సైటు తెలుగులో కూడా" అంటే - మనోళ్ళు ఆ దుర్మార్గాన్ని ఖండిస్తోనో, ఆ పుస్తకాల్లోని అవకతవకల్ని ఎత్తిచూపుతోనో, నిజమైన నిజాలని రాసిన పుస్తకాల సైటు అన్న మాట.....అలాటి పుస్తకాలు మనకు తక్కువే, చాలా తక్కువే వున్నా....అదో సంతోషం..

RK - మీ కామెంటు చూసాక Update చేసింది ఇది.. :)

6 comments:

 1. ఇంకొన్ని లంకెలు:

  ఇక్కడ చారిత్రిక ట్రావెలాగులు చాలా ఉన్నాయి. అందులో భారతదేశాన్ని మొట్టమొదటగా దర్శించిన వివిధ పాశ్చాత్య "మేధావుల" ట్రావెలాగులు చాలా ఉన్నాయి. అవి చదివి కొత్తగా మనకు మనగురించి తెలిసేదేమీ లేదు కానీ(మనగురించి మనం ఈ సజ్జు ట్రావెలాగుల ద్వారా తెలుసుకుని, చరిత్ర గా మలచి పాఠ్యపుస్తకాల్లో చొప్పించటానికి మనవేం "మేధావులం" కాదుగా, పోలేరమ్మ తల్లి దయవలన). ఏం తెలుస్తుందయ్యా అంటే - రాసిన వాళ్ల గురించి, వారు ప్రాతినిథ్యం వహించిన సంస్కృతి గురించి!

  http://explorion.net/
  http://www.bodley.ox.ac.uk/ilej/

  ఇంకోటి - South Asia Resource Access On The Internet (The name says it all - ebooks, hournals, news about south asia)

  http://www.columbia.edu/cu/lweb/indiv/southasia/cuvl/

  Digital South Asia Library - http://dsal.uchicago.edu/books/

  భారతదేశం గురించి పందొమ్మిదో శతాబ్దపు మొదట్లో పాశ్చాత్యులు వాళ్ల పుస్తకాల్లో ఏం చదువుకున్నారో తెల్సుకోవాలనుకుంటే(కాస్తంత గుండె ధైర్యం ఉంటే), చదవండి, చదివి మనసారా నవ్వుకోండి. భరించలేని ఆవేశంలోనుంచే అసలు సిసలు కామెడీ పుట్టేది!
  http://digital.library.pitt.edu/nietz/

  For example, read this gem: http://digital.library.pitt.edu/cgi-bin/t/text/pageviewer-idx?c=nietz;cc=nietz;q1=heathen;rgn=full%20text;view=image;seq=0001;idno=00acl4424m;didno=00acl4424m

  Here is another useful link:

  http://sceti.library.upenn.edu/index.cfm

  ReplyDelete
 2. To the future Mr.nitpick.

  I was too lazy to use HTML tags to generate hyperlinks. Please do what we are all very good at, copy-paste the link to the browser. Hit go, and boom!

  ReplyDelete
 3. @RK - Knew others, but did not know about the pitt.edu digi lib...thanks for the link...

  ReplyDelete
 4. ఆర్కే గారూ, వివేకానందుడు గనక వాళ్ళదగ్గరికెళ్ళి చెప్పకుండా ఉంటే వారి పాఠ్య పుస్తకాలు ఇప్పటికీ అదే స్థాయిలో ఉండేవంటారా?

  ReplyDelete
 5. ఫాఠ్య పుస్తకాలు ఇప్పుడు అదే స్థాయి లో లేకపోయినా, ఇప్పటికీ మన గురించి అలాగే అనుకొనే కిరస్తాని మత పిచ్చోళ్లు చాలా మందే ఉన్నారు, ముఖ్యం గా దక్షిణాదిన (southern part of North America).
  కనీసం నెలకోసారి మా ఇంటితలుపు తట్టి (వాళ్లు కౌంటీ రికార్డ్స్ లో పేర్లు చూసి లిస్ట్ పెట్టుకొని వస్తున్నారు అని ఈ మద్దెనే అర్ధమయ్యింది నాకు) మిమ్ములను ఉద్దరిస్తాము, ఈ పుస్తకాలు చదవండి అంటూ భాష ఎదో అడిగి మరీ తెలుగు లో వ్రాసిన పుస్తకాలు, పైన RK లింకులు ఇచ్చిన కతలు లాంటివే ఇచ్చి పోతున్నారు. మొన్నీమద్దెనే ఇచ్చిన పుస్తకాలు గిరాటెయ్యకుండా ఉండి ఉంటే, స్కాన్ చేసి పెట్టిఉండేవాడిని.
  అప్పటికీ ఒకటి రెండు సార్లు తిట్టినంత పని చెసినా, వీళ్లు మాత్రం వదలటం లేదు, గట్టిగా చెబుతామంటె (కాలర్ పట్టుకొని బూతులు తిట్టడం లాంటివి) కాస్త మొహమాటం, మరికొంత ఉన్న ఫీల్డ్ అడ్డం వస్తున్నాయి.

  ReplyDelete
 6. I am sure that teluguthesis site must have been mentioned before. In any case, here is the link:
  http://teluguthesis.com/
  They also have twitter updates:
  http://twitter.com/teluguthesis

  ReplyDelete