Monday, May 10, 2010

హలా అంటున్న గజ్జెలకోడి !!!

పింగళిగారి వర్ధంతి సందర్భంగా సాక్షి టి.వి అర్పించిన నీరాజనాలు ఇప్పుడు - "ఇక్కడ" - "పింగళి" వారి వెబ్సైటులో దృశ్యమాలిక సెక్షన్లో చూడవచ్చు. ఈ వీడియోలో పింగళివారి గురించి వేటూరి వారి వజ్రాల మా(మూ)టలూ తప్పక వినాల్సిందే!

వెబ్సైటులో పెట్టుకోడానికి అనుమతిచ్చిన సాక్షి టి.వి వారికి, సాయం చేసిన మిత్రులు, సాక్షి టి.వి. (ఐ.టి. హెడ్) శ్రీ మదన్ మోహన్ రెడ్డి గారికి, ఆ కార్యక్రమం సాక్షి టి.వి లో ప్రసారమైంది అన్న విషయాన్ని తెలియచేసిన మిత్రులు దేవరపల్లి రాజేంద్రగారికి బోల్డన్ని కృతజ్ఞతలు

పింగళి వారి ఇతర విశేషాలు, ప్రత్యేకించి చుట్టరికాలూ ఎవరికన్నా తెలిస్తే maganti dot org at gmail dot com కు ఈమెయిలు కొట్టండి. సాయానికి ముందస్తు ధన్యవాదాలు

తెలుగువారికి వీరతాళ్ళు వేసి, అస్మదీయులకు తస్మదీయులకు హాంఫట్ ను ఒకేరకంగా నేర్పించి, సాహసం శాయరా డింభకా అని ముందుకు తోసి, హలా అంటున్న గజ్జెలకోడిని మహాజనానికి మరదలు పిల్లను చేసేసి, గింబళి మీద లాహిరిలాహిరిలో ఓలలాడించిన అపర సరస్వతీ పుత్రుడు, మాటల మాంత్రికుడు శ్రీ శ్రీ శ్రీ పింగళి నాగేంద్రరావు గారికి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ

భవదీయుడు
వంశీ

5 comments:

 1. పింగళి నిజంగా మాటల మాంత్రికుడే.
  ఈ సందర్భంగా ఆయన గురించి ఎక్కడో (బహుశా ప్రముఖుల హాస్యం అనే పుస్తకంలో అయుండొచ్చు) చదివిన ఒక జోకు. ఒకసారి పింగళి వారు చక్రపాణితో మాట్లాడ్డానికి విజయ స్టూడియోకి వెళ్ళినప్పుడు చక్కన్న గారు మన స్టూడియోలో కొత్తగా కేంటీను తెరిచాము చూశారా అనడిగారు. ఈయన లేదండీ, చూళ్ళేదే అన్నారు. ఇంతలోనే సదరు కేంటీను మేనేజరు ఖాతాపుస్తకం తీసుకొచ్చాడు చక్కన్న గారి పర్యవేక్షణ కోసం. ఆయన ఖాతా పుస్తకం తెరిచి చూస్తే పింగళి వారి ఖాతా కింద నాలుగు ప్లేట్ల ఇడ్లీలు, మూడు ప్లేట్ల గారెలు రాసి ఉన్నాయి. చక్కన్న గారు ఆ ఖాతాని పింగళి వారికి చూపిస్తే .. ఆయన ఆ మేనేజెరు కేసి తిరిగి, ఏమోయ్, పేరున్న కవిని కదా, నా ఖాతాలో మరీ ఇలాంటి నాసిరకపు తినుబండారాలా రాసేది. నా స్థాయికి తగ్గట్టు రసగుల్లా, బాసుందీ ఇలాంటి ఖరీదైన వస్తువులు రాయించు! అన్నారు.

  ReplyDelete
 2. Some more links here:
  http://gaddeswarup.blogspot.com/2010/04/wordsmiths-of-telugu-films.html
  'హలా' ఈమధ్యే విన్నాను (మా మనమరాలికి జలకాటలలో వినిపించుతూ. 56 లోనే బతటిప్రంతాలకి పొవటం మూలాన ఇలాంటి చాలా సరిగ్గా తెలియవు). దానినిగురించిచెప్పగలరా?

  ReplyDelete
 3. పింగళి గారి గురించి ఎంత చెప్పిన తక్కువే
  కొత్తపాళీ గారు చెప్పిన ఉదంతం శ్రీ రమణగారి "హాస్యజ్యోతిలో" ఉంది.

  "పింగళిగారి వర్ధంతి సందర్భంగా సాక్షి టి.వి అర్పించిన నీరాజనాలు"....
  ఎక్కడ ఉన్నాయో నాకర్థం కాలేదండీ, పింగళి గారి సైటులో కూడా వెతికాను, ఎలా వినాలో ఇంకోసారు చెప్పారూ?

  ReplyDelete
 4. కొత్తపాళీగారూ - :)

  @జె.బి, స్వరూప్ గారూ - ధన్యవాద్

  స్వరూప్ గారూ , హలా అనేది ఆయన పుట్టించిన మాటో - ఆయన మార్పు చేసిన పాత మాటో - అచ్చంగా మన పాత మాటో నాకు తెలియదు. క్షమించాలి.

  @సౌమ్య - దృశ్యమాలిక సెక్షన్లో వీడియోస్ లో ఉన్న ఒకే ఒక్క వీడియో - సాక్షి టి.వి వారి వీడియో..

  ReplyDelete