Friday, April 23, 2010

హాస్యబ్రహ్మ- ఇరవై (యవ్వనం) - అరవై ( ? )

హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి యవ్వనంలోని ఫోటొ

వారిదే - 60 యేళ్ళప్పటి ఫోటో

ఎక్కడివా ? డి.ఎల్.ఐ లో నాటకాల గురించి ఏదో వెతుకుతుంటే, ఈ పుస్తకం "ఆంధ్ర నాటక పద్య పఠనం" (1957) లోది కనపడ్డది. లిమిటెడ్ ఆక్సెస్ ఉన్నది కానీ...అందులో ఉన్న వివరాలు చదువుకుని ఫోటోలు దొరకబుచ్చుకున్నా....

3 comments:

 1. అసలు అంశానికి సంబంధం లేని ప్రశ్న సాహసమేనేమో, కాని మీరు "అరవై (?)" అని ప్రశ్నార్థకంగా వదలటంతో ఎప్పటినుండో, ఆగిన ఆలోచన. అరవై తర్వాత, మనిషి/మనసుకి తిరిగి శైశవదశ వస్తుందని చదివానండి. (అంతకుమించి గుర్తుకు రావటం లేదు). నేను దగ్గరగా గమనించిన అమ్మమ్మ, నానమ్మ, నాన్నగారిని బట్టి నిజమేననిపించింది. కాకపోతే, కవులు, రచయితలు, కళాకారుల మీద ఆ రకమైన ప్రభావముందా. నేను అంతగా చదవలేదు కానీ, ఒకరి రచనలని క్రమంగా చదివినవారు, "ఈ రకమైన పరిణామం వారి మానసికావస్థ, రచనలు, స్పందన వంటి వాటి మీద ఎటువంటి ప్రభావం చూపివుండొచ్చు?" అన్నదాని మీద వ్యాఖ్యానిస్తారాని పెట్టానిది.

  ReplyDelete
 2. :) బాగుంది! ఈయన గురించి వినడమూ - ఇంట్లో ఈయన హాస్య రచనల పుస్తకాలు మూణ్ణాలుగు చూసినా, ఎప్పటి భాషో మనకి అర్థం కాదులే అని భయపడి వదిలేయడమూ - తప్ప, ఈయనెలా ఉంటారో ఎప్పుడూ చూడలేదు. థాంక్స్.

  ReplyDelete
 3. @ఉష గారూ

  ఆశ్చర్యం...పరమానందం...నా ప్రశ్నార్ధకాన్ని అలా చటుక్కున పట్టేసారే! ఆంజనేయుడికి తన బలమెంతో తెలీనట్టు, మీలో ఒక నిజమైన పాఠకురాలున్నారు...వారిని బయటకు తియ్యండి...సాన పట్టండి...చాలా మందికి ఉపయోగం!

  మీఅన్న శైశవ దశతో ఏకీభవించినా - క్ఌప్తంగా మనిషి వేరు, మనిషిలో ఉన్న రచయిత వేరు, ఆ రచయిత లోకం వేరు. అంతఃపురంలోని ఆ మరో మనిషికి పైన జఱిగే మార్పుతో సంబంధం లేదు. కలం పట్టేసుకున్నాకో, భావావేశం వచ్చేసాకో - చుట్టుపక్కలలోకం, పాత అనుభవాలు కొద్దిగా దోహదం చేస్తాయేమో కానీ రచనల మీద ప్రథమ ప్రభావం అంతఃపురానిదే. అక్కడ జరిగే మంతనాలు వినటం, పట్టుకోవటం చాలా కష్టం. ఆ భావావేశమేగా మానసికావస్థ అంటారేమో! :) ఇతరులెవరన్నా చర్చలో పాలుపంచుకుంటే తీరిగ్గా చర్చించవచ్చు...కామెంటుకు ధన్యవాదాలు


  @ ఎస్ - చదివితేగా అర్థమవుతాయో కాదో తెలిసేది...ప్రయత్నం ప్రయత్నేన మష్తిష్క మర్దనమని ఒక నానుడి ఉన్నది...ఆయన రూపం చూసారు కాబట్టి, ఇహ ప్రయత్నం మొదలెట్టండి...శుభం...

  ReplyDelete