Thursday, April 1, 2010

ఇదిగో - మరో 1800 DLI పుస్తకాలు - కొత్త లిష్టు

గంగూ - ఇదిగో, మరో 1800 పుస్తకాలు ఇక్కడ

అయ్యా నిన్నో, మొన్నో 900 ఇచ్చారు, ఈవేళ 1800 పుస్తకాలే ఏకంగా! హాచ్చెర్యంగా ఉందే!!

గంగూ - అదేగా మరి కిటుకు - ఏదన్నా మొదలు పెట్టనే కూడదు, మొదలెడితే ఆగకూడదు

అయ్యా మరి ఇన్ని పుస్తకాలు నిజంగానే ఉన్నాయా?

గంగూ - మంచి ప్రశ్న. డి.ఎల్.ఐ. లో ఉన్నాయి....కానీ మనం తయారు చేసిన ఈ పుస్తకాల లిష్టుల్లో కన్ను కప్పి డూపులైపోయినవి కొద్ది శాతం, అంటే చాలా కొద్ది శాతం ఉన్నాయి. ఎంత శాతమా ? సుమారు 5 శాతం అనుకుంటున్నాను, ప్రస్తుతానికి. అయితే అది సద్దుకునే బాధ్యత వాడుకునేవారిదే.

ఎలాగెలాగా ? డూపులున్నాయా? ఎలాగెలాగా మళ్ళీ చెప్పయ్యా

గంగూ - చెప్పేది కాదులేరా. వారు చూసుకుంటారు.లిష్టులు ఇవ్వటం వరకే మన పని.

అయ్యా మరి నిన్న ఇచ్చిన 900 పుస్తకాల మీద రాతలు కోతలు, ఇతర విశేషాలు ఏమన్నా జరిగినయ్యా?

గంగూ - రాతలు కోతలు పక్కనెడితే ఒకట్రెండు విశేషాలు జరిగినాయిరోయి. అవేమిటా ? మచ్చుకు ఒకటి చెబుతా విను - కొంతమంది అతితెలివి జనాభా, అంటే నిన్న చెప్పిన "శూరశిఖామణులు" అన్నమాట - నాకు టెక్నికల్ నాలెడ్జీ అంతగా లేదు అని ఆ టపాలో చెప్పానని, పేరెంట్ ఫోల్డర్ని తెగ యాక్సెస్ చేసారు, ఇతర నోటుపాడులు / డాక్యుమెంటులు అవీ అక్కడ పెట్టానేమోనని. పాపం వాళ్ళకేం తెలుసు? "అంతగా" లేదన్నాను కానీ బభ్రాజమానాన్ని అనలేదుగా? అదిరా నిన్న జరిగినవాటిల్లో ఒక సంగతి.

అయ్యా మరి మీరు దాదాపు పదిహేనేళ్ళ నుంచి ఈ పొలంలో అంటే ఈ కంప్యూటర్ "ఫీల్డు"లో వ్యవసాయం చేస్తున్నారని అమ్మగారు - ఓ ఇదిగా చెపుతుంటారు! మరి మీకు టెక్నికల్ "నాలెడ్జీ" లేదని ఎందుకు చెప్పారు ?

గంగూ - అదే మరి! మరి అదీ లెఖ్ఖ! ఇహ అడిగింది చాలు గానీ పోయి మళ్ళీ రేపో ఎల్లుండో రా, కొత్త లిష్టు కోసం!

సరే దొరా! వస్తా! అవునుగానీ దొరా ఇక్కడా అన్నారు గానీ లింకు ఇవ్వలేదే

గంగూ - నువ్వు అడుగుతావా లేదా అనే ఇంతసేపు ఆగా - ఇదిగో ఇక్కడ

సరే సరే వెళ్ళు! ఆలస్యమవుతోంది

6 comments:

 1. WOW! This post is god-sent for me. :)

  నాకీ సైటు గురించి ఈ మధ్యనే తెలిసింది. నాలుగైదు రోజుల్నించీ తెగ కుస్తీ పడుతున్నాను. ఇక ఉండబట్టలేక అందర్నీ అడగటం కూడా మొదలుపెట్టాను. మీరిచ్చిన జాబితానే కాదు, దీనికి ముందు టపాలో రమణగారు ఇచ్చిన లింకు కూడా చాలా సాయపడుతోంది. కృతజ్ఞతలు!

  ReplyDelete
 2. కానీ ఈ టపాకు "స్పాయిలర్ అలెర్ట్" పెట్టాలి. వెతుకులాటలో వుండే ఉత్సుకత అంతా చెడగొట్టేసారు. :P ఎన్నున్నాయో తెలియనంత సేపూ ఎన్నో వున్నాయనుకుంటాం, తెలిసిపోయాకా ఓ హద్దు వచ్చేస్తుంది.

  ReplyDelete
 3. బాబా గారు.. ధన్యవాద్

  మెహెర్ - :) Agreed!!

  ReplyDelete
 4. Wow! Thanks!!
  అసలు నేనింకా లిస్టు దిగుమతి చేసి చూడ్డం మొదలుపెట్టలేదు కానీ, మీ ఓపిక్కి ధన్యవాదాలు...

  ReplyDelete
 5. ఎక్కడ ఉన్నయండీ పుస్తకాలు? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?

  ReplyDelete