Friday, April 23, 2010

హాస్యబ్రహ్మ- ఇరవై (యవ్వనం) - అరవై ( ? )

హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి యవ్వనంలోని ఫోటొ

వారిదే - 60 యేళ్ళప్పటి ఫోటో

ఎక్కడివా ? డి.ఎల్.ఐ లో నాటకాల గురించి ఏదో వెతుకుతుంటే, ఈ పుస్తకం "ఆంధ్ర నాటక పద్య పఠనం" (1957) లోది కనపడ్డది. లిమిటెడ్ ఆక్సెస్ ఉన్నది కానీ...అందులో ఉన్న వివరాలు చదువుకుని ఫోటోలు దొరకబుచ్చుకున్నా....

Tuesday, April 6, 2010

చివరి 1200 DLI పుస్తకాల లిష్టు - ఆనందో బ్రహ్మ!!

చివరి 1200 పుస్తకాల లిష్టు ఇక్కడ

ఈ టపాల పరంపరకు ఇంతటితో ముగింపు పలకడమైంది...ఇంకో 1200 పైచిలుకు పుస్తకాలు వున్నాయి కానీ, అవి నా కోసం అట్టిపెట్టుకున్న ఆణిముత్యాల లిష్టులోకెక్కేసినవి ....అందుకు ఇహ ఇక్కడ కనపడవన్నమాట....స్వార్ధం! :)

మళ్ళీ పురుగు కుట్టినప్పుడో, బొమికల తొర్రలోని బుర్రని తొలిచినప్పుడో, అనవసరంగా ఎవరైనా చిరాకు పెట్టినప్పుడో - తిరుగు దర్శన ప్రాప్తిరస్తు!

అందాకా ఆనందో బ్రహ్మ

భవదీయుడు
వంశీ

ఈ డి.ఎల్.ఐ పుస్తకాల పరంపరలోని పాత టపాలు, డైరెక్టు లింకులు ఇవీ -

Monday, April 5, 2010

మరో 2600 DLI పుస్తకాల లిష్టు

మరో 2600 పుస్తకాల లిష్టు ఇక్కడ

ఉన్నవాటిల్లో ఇది నాకు కొద్దిగా ఇష్టమైన లిష్టు......ముందు మన జనాలకు సమాచారం చేరవేసి, తర్వాత తీరిగ్గా ఈ లిష్టుల్లో వున్న వాటిల్లోనుంచి నేను విడిగా ఏరిపెట్టుకున్న - నాకు నచ్చిన రచయితలు / పుస్తకాలు , వారే / అవే ఎందుకు నచ్చాయన్న వివరాలు పోష్టు చెయ్యాలని తీర్మానించి, "ఆ విధంగా ముందుకు పోతాననీ" బల్లగుద్ది, బ్లాగు గుద్ది మరీ చెప్పటమైనది.....

అప్పటిదాకా....

భవదీయుడు
వంశీ

PS: ఈ డి.ఎల్.ఐ పుస్తకాల లిష్టుల మీద ఇంకొక్కటో రెండో పోష్టులు వస్తాయని మటుకు చెప్పగలను...

ఈ డి.ఎల్.ఐ పుస్తకాల పరంపరలోని పాత టపాలు, డైరెక్టు లింకులు ఇవీ -

మరో 1100 DLI పుస్తకాల లిష్టు

మరో 1100 పుస్తకాల లిష్టు ఇక్కడ

ఈ డి.ఎల్.ఐ పుస్తకాల పరంపరలోని పాత టపాలు, డైరెక్టు లింకులు ఇవీ -

Friday, April 2, 2010

మళ్ళీ ఓ 700 DLI పుస్తకాలు - కొత్త లిష్టు !!

మరో 700 పుస్తకాలు ఇక్కడ

ఆనందో బ్రహ్మ...!

మళ్ళీ ఓ రహస్యం చెప్పాలనిపిస్తోందండీ. ఇంతకుముందు కొంతమందితో మాట్లాడేటప్పుడు వారి వారి "ఈగో" ను తృప్తి పరచటానికి, పుస్తకాల విషయంలోనూ, రచయితల విషయంలోనూ, ఇతరుల పట్ల వారి స్వభావం తెలుసుకోవటానికున్నూ - కొద్దిగా తెలీనట్టే అమాయకంగా మాట్లాడాల్సొచ్చేది! (ఆహా - ఈ కళలు కూడా ఉన్నాయా తమరికి ?) ఐతే బోధివృక్షం కింద కూర్చున్నాక నెత్తి మీదో వెనకాలో వెలుగు చక్రం వెలగకపోయినా, ఇహ నుంచి అలాటి పని చెయ్యకూడదని, వారికి ఈ సంగతి తెలియచెయ్యాలనీ ఆ పరమపిత చెప్పాడు కాబట్టి ఆ నిశ్చల నిశ్చయం మారిందని జనాభాకు దండోరా వెయ్యటమైనది.....ఇది ఆ "కొంతమందికి" ఆఘాతం కలిగించే వార్త కాకూడదని కోరుకుంటూ....

ఈ టపాల పరంపరతో జనాలకు ఉపయోగపడే వార్త అలా పక్కనబెట్టి, ఎవరికన్నా వ్యంగ్యమూ, కొద్దిమంది మీద కోపమూ కనపడితే దానికి తగ్గ కారణాలున్నవి అని నిర్భయంగానూ - సభాముఖంగానూ దండోరా వేస్తున్నాను.

మళ్ళీ వచ్చే వారం కలుద్దాం...

అందాకా శలవు

భవదీయుడు
వంశీ

#POST UPDATED - April 3rd 2010#

Thursday, April 1, 2010

ఇదిగో - మరో 1800 DLI పుస్తకాలు - కొత్త లిష్టు

గంగూ - ఇదిగో, మరో 1800 పుస్తకాలు ఇక్కడ

అయ్యా నిన్నో, మొన్నో 900 ఇచ్చారు, ఈవేళ 1800 పుస్తకాలే ఏకంగా! హాచ్చెర్యంగా ఉందే!!

గంగూ - అదేగా మరి కిటుకు - ఏదన్నా మొదలు పెట్టనే కూడదు, మొదలెడితే ఆగకూడదు

అయ్యా మరి ఇన్ని పుస్తకాలు నిజంగానే ఉన్నాయా?

గంగూ - మంచి ప్రశ్న. డి.ఎల్.ఐ. లో ఉన్నాయి....కానీ మనం తయారు చేసిన ఈ పుస్తకాల లిష్టుల్లో కన్ను కప్పి డూపులైపోయినవి కొద్ది శాతం, అంటే చాలా కొద్ది శాతం ఉన్నాయి. ఎంత శాతమా ? సుమారు 5 శాతం అనుకుంటున్నాను, ప్రస్తుతానికి. అయితే అది సద్దుకునే బాధ్యత వాడుకునేవారిదే.

ఎలాగెలాగా ? డూపులున్నాయా? ఎలాగెలాగా మళ్ళీ చెప్పయ్యా

గంగూ - చెప్పేది కాదులేరా. వారు చూసుకుంటారు.లిష్టులు ఇవ్వటం వరకే మన పని.

అయ్యా మరి నిన్న ఇచ్చిన 900 పుస్తకాల మీద రాతలు కోతలు, ఇతర విశేషాలు ఏమన్నా జరిగినయ్యా?

గంగూ - రాతలు కోతలు పక్కనెడితే ఒకట్రెండు విశేషాలు జరిగినాయిరోయి. అవేమిటా ? మచ్చుకు ఒకటి చెబుతా విను - కొంతమంది అతితెలివి జనాభా, అంటే నిన్న చెప్పిన "శూరశిఖామణులు" అన్నమాట - నాకు టెక్నికల్ నాలెడ్జీ అంతగా లేదు అని ఆ టపాలో చెప్పానని, పేరెంట్ ఫోల్డర్ని తెగ యాక్సెస్ చేసారు, ఇతర నోటుపాడులు / డాక్యుమెంటులు అవీ అక్కడ పెట్టానేమోనని. పాపం వాళ్ళకేం తెలుసు? "అంతగా" లేదన్నాను కానీ బభ్రాజమానాన్ని అనలేదుగా? అదిరా నిన్న జరిగినవాటిల్లో ఒక సంగతి.

అయ్యా మరి మీరు దాదాపు పదిహేనేళ్ళ నుంచి ఈ పొలంలో అంటే ఈ కంప్యూటర్ "ఫీల్డు"లో వ్యవసాయం చేస్తున్నారని అమ్మగారు - ఓ ఇదిగా చెపుతుంటారు! మరి మీకు టెక్నికల్ "నాలెడ్జీ" లేదని ఎందుకు చెప్పారు ?

గంగూ - అదే మరి! మరి అదీ లెఖ్ఖ! ఇహ అడిగింది చాలు గానీ పోయి మళ్ళీ రేపో ఎల్లుండో రా, కొత్త లిష్టు కోసం!

సరే దొరా! వస్తా! అవునుగానీ దొరా ఇక్కడా అన్నారు గానీ లింకు ఇవ్వలేదే

గంగూ - నువ్వు అడుగుతావా లేదా అనే ఇంతసేపు ఆగా - ఇదిగో ఇక్కడ

సరే సరే వెళ్ళు! ఆలస్యమవుతోంది