Wednesday, March 31, 2010

DLI సైటు సెర్చి మీద మీ కసి ఇలా తీర్చుకోండి!

ప్రతివాళ్ళూ డిజిటల్ లైబ్రరీ మీద పడిపోయి ఏడ్చేవాళ్ళే! సెర్చి బాలేదు, మూతి బాలేదు, ముక్కు బాలేదు అనుకుంటూ. దాని బదులు నాలా (మూసీ "నాలా" కాదు బాబూ!) ఇలా చేస్కోవచ్చుగా...

సరే ఆ నాలాల సంగతి పక్కనబెట్టి విషయం చెప్పు నాయనా -

అప్పుడెప్పుడో ఆ సైటు మొదలెట్టినదగ్గరినుంచి, కొద్ది కొద్దిగా నా కంప్యూటర్లోని నోటుపాడులోకి ఎక్కించుకున్న డి.ఎల్.ఐ తెలుగు పుస్తకాల వివరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, టెక్నికల్ నాలెడ్జీ అంతగా లేనోణ్ణే అయినా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని కుస్తీపట్టి (దేంతో?) ఆరుగంటల్లో నాకు అనుకూలంగా, సానుకూలంగా ఉండేలా తయారు చేసుకున్నా. తయారు చేసుకున్నా కదా అని ఇక్కడ పెట్టా. వీలుంటే కళ్ళద్దాలు తీసి ఓ సారి చూడండి.

ఇంకో రెండు మూడు రోజుల్లో చక్కగా HTML టేబులు రూపంలో పెట్టి ఆ పక్కనే ఆ పుస్తకాల లింకులు కూడా పోష్టు చేస్తా. ఐతే లింకులు పోష్టు చేస్తే ఆ సైటువాడు పేజీలు గట్రా "రీవాంపు" చేస్తే (పాత సినిమాల్లో వాంపు కాదు నాయనా!) మళ్ళీ నా మీద పడతారు మీరంతా....

అందాకా ఆగలేను అనుకున్నోళ్ళు, ఇక్కడ ఇంగ్లీషులో ఉన్న టైటిలు కాపీ చేసి, డి.ఎల్.ఐ లోకి వెళ్ళి అచ్చంగా అదే ముక్క పేష్టు చేసి "సెర్చ్" కొట్టండి. పుస్తకం ప్రత్యక్షం. ఐతే ఇందులో ఎన్ని తమరు చదూకోటానికి, చూడటానికి కనిపిస్తాయో, ఎన్ని పీకెయ్యబడ్డాయో - దాని సంగతి మీ మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి...ఇది సెర్చికి మాత్రమే...ఆ పుస్తకాలు ఏకంగా DOWNLOAD చేసుకోవాలంటే మన బ్లాగరుల్లో ఒకాయన అప్పుడెప్పుడో ఏదో ప్రోగ్రాము రాసినట్టు గుర్తు...దాన్ని దించుకుని ఆనందోబ్రహ్మ అవ్వొచ్చు ఇహ మీరు...లింకు ఏమిటా ? అది నాకు తెలియదు ! ఎవరో గణేశన్ అని గుర్తని "దేవరపల్లి రాజేంద్ర" చెప్పినట్టు గుర్తు మరి.. :) ఈ వెధవ గోల అంతా ఎందుకు మాకు ARCHIVE.ORG ఉందిగా అంటారా? అదే మీ త్రిశంకు స్వర్గం...అభినందనలు..

తొందరే ఆయాసః - ఓపికే నిలుబడునః .

టెక్నికల్ నాలెడ్జీ ఉన్నోళ్ళు ఇతర వివరాలు కావాలంటే కామెంటో / మెయిలో కొట్టండి. నా దగ్గరున్న నోటుపాడులు అన్నీ పంపిస్తా.వాటి మీద మీ ప్రతాపమూ, కసి చూపించుకోండి.

ఐతే ఇక్కడ ఒక సంగతి చెప్పాలె...ఎందుకా? ఎందుకంటే గుర్తుకొచ్చింది కాబట్టి! ఆమధ్య అంటే ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల క్రితం, వికిపీడియా నిర్వాహకుడు ఒకాయన, పేర్లు, వివరాలు ఎందుకులెండి కానీ - నాకు ఒక వికారమైన ఈమెయిలో / కామెంటో కొట్టాడు. నేను స్పందించలా. మళ్ళీ ఈమెయిలు /కామెంటు వచ్చినాయి. ఈసారి మర్యాదగా నేను స్పందించా. దానికాయన జవాబు - "మాగంటిగారూ మీ సైటులోని వివరాలు బాగున్నాయని చెప్పాను. అన్నీ తీసుకెళ్ళి వికిపీడియాలో పెడతాననీ చెప్పాను. మీకు అభ్యంతరం ఉండకూడదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా, వాటిలో బోల్డు శాతం కాపీరైటు లేనివే కాబట్టి నిరభ్యంతరంగా నేను తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. మీరు అనుమతిస్తే మంచిది. పేరు ఉంటుంది. లేకపోయినా మంచిదే. ఏమవుతుందో నేను చెప్పనఖ్ఖరలా" అని రాసాడు. అలాటి ఈమెయిలే మనకున్న మరో అద్భుత భాండాగారం లాటి వెబ్సైటు వారికి పంపించాడు అని ప్రియమిత్రులైన ఆ వెబ్సైటు నిర్వాహకులు చెప్పారు నాకు. ఒకవేళ అలాటి "సత్కార్యాలు" ఈ ఫైలుకు మీరు చేసుకోవాలని అనిపిస్తే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు....నా ఉద్దేశం అర్థమయ్యిందనే అనుకుంటున్నా.

ఇదెందుకు చెప్పానంటే DLI వాడు అలా గందరగోళంగా పెట్టటమే మంచిది..లేకుంటే మన శూరశిఖామణులు విలువలు, వలువలు లేకుండా రెచ్చిపోతారన్న మాట - "ఇనుము ఇనుము అయినంత" నిజం

సరే ఈ ఫైలుతో నేను కుస్తీ పడ్డ విధానం ఇదీ...ఇహ కొద్దిసేపు ఆంగ్లమున వాగెదను -

Open Microsoft Excel

Import External Data

Delimit the external data

Sort the data by title

Use a formula to identify duplicate rows
(Though it took a while for me to figure out I used a CRUDE Formula - If(A2=A1, "*", "") to identify the duplicate rows)

Manually deelete the duplicate rows
(As I was not able to sort it again because of the formula I used I guess!)

Add A Filter

Save it as the file you want


చివరిగా నా దగ్గర మొత్తం 15 దాకా నోటుపాడులు వున్నవి...అందులోని కొన్ని ..చాలా కొన్ని అంటే.. 900 పుస్తకాల వివరాలు ఇక్కడ చూడొచ్చు..ఎవరికైనా సాయం చెయ్యాలి అనే "సదుద్దేశం" ఉంటే వివరాలు పంపండి. ఆ నోటుపాడులు పంపుతా

3 comments:

 1. మాగంటిగారూ మంచి లింకు ఇచ్చారు. ARCHIVE.ORG తెలుసుకానీ డి.ఎల్.ఐ చూడటము ఇదే మొదటిసారి. అయినా పుస్తకాలన్నీ ఆ వెబ్సైట్ లో వుంటే వేరే కాపీ అవసరంలేదేమో కదండి. (ఆపుస్తకం మరీ మరీ అందరూ వాడతారు అనుకుంటే తప్ప). మీ పోస్టు నాకు అర్థమయినట్టే వుంది కానీ అర్థం కాలేదు. ఇంతకీ మీరు డి.ఎల్.ఐ కి సెర్చ్ ఇంటర్ ఫేస్ వ్రాద్దామని చూస్తున్నారా? ( లేదా అలాంటి సెర్చ్ ఇంటర్ ఫేస్ ఒకటి వుంటే బాగుంటుందని సూచిస్తున్నారా? )

  ReplyDelete
 2. @భాస్కర రామి రెడ్డి గారూ - ఈ టపా డి.ఎల్.ఐ లో సెర్చి బాలేదనీ, ఆ సైటులో ఏదన్నా వెతుక్కోవడమన్న పని శూలపోటు కన్నా దాఋణమనీ, అది బాలేదనీ, ఇది బాలేదనీ, హిపోక్రసీకి బలైపోయిందనీ, బోల్డు పుస్తకాలు నాశనమైపోయాయనీ (నాశనమైపోయింది నిజమే అవ్వొచ్చుగాక!) అని తెగ గొణుక్కునే వారికి ఉద్దేశించబడింది... ఏదీ లేని చోట ఆముదం చెట్టు ఒక్కటే పెరిగినప్పుడున్నూ, లభ్యమవుతున్నప్పుడున్నూ, ఆ ఆముదమే తాగాల్సి వచ్చినప్పుడున్నూ ఊరికే గొణుక్కోకుండా ఆ ఆముదాన్ని ఎలా వొంటికి పట్టించుకోవచ్చో తెలియచెప్పటానికి చేసిన ప్రయత్నం మాత్రమే అని సభాముఖంగా తెలియచేసుకోవటమైనది. నోటికొచ్చింది మాట్టాడకుండా ఏమి చెయ్యొచ్చో ఆలోచించి తోచిందేదో చేస్తే, స్వకార్యానికి ఉపయోగపడినా, పదిమందికి ఉపయోగపడినా ఆనందం.

  అసలో, కొసరో - విషయమేమిటంటే - ఈ ఎక్సెల్ షీటు ద్వారా - డి.ఎల్.ఈ లో సెర్చి కష్టమవుతుంది అనుకునేవారికి ఎక్సెల్ షీటులో సమాచారం కొద్దిగా అయినా ఉపయోగపడుతుందేమో అన్న భావంతో నా సైటులో పబ్లిష్ చేసానన్నమాట. నాకు డి.ఎల్.ఐ సైటులో ఎలా వెతుక్కోవాలో తెలుసు. నాలా అందరికీ ఆ కాలపు (పాతకాలపు) రచయితలు, రచనల పేర్లు తెలియాలి అని లేదు కదా. ఒకవేళ తెలిసినా ఆ సైటులో ఎలా వెతుక్కోవాలో తెలియకపోవచ్చు. అలాటివారికి ఉపయోగపడుతుందేమో అన్న "దురుద్దేశం"తో చేసిన పని ఇది. మీకు డి.ఎల్.ఐ సైటు కొత్త అంటున్నారు కాబట్టి, సెర్చి చేసి చూడండి. మీకు గందరగోళంగా అనిపించకపోతే సంతోషమే. నా మటుకు, అలవాటైపోవడంవల్లో ఏమో గానీ, డి.ఎల్.ఐ లో సెర్చి కష్టమని చెప్పనుగానీ, కావల్సిన పుస్తకాలు పట్టుకోవడం కష్టమని కొద్దిగా ఒప్పుకుంటాను. కానీ అన్ని లక్షల పుస్తకాలున్నప్పుడు జనాలు ఊరికే తప్పులు పట్టుకోకుండా, చెయ్యగలిగే ఉడుతా సాయం చేస్తే మంచిది అన్న మాట చెప్పడమే ఈ టపా ఉద్దేశం...అసలు డి.ఎల్.ఐ ఎందుకు అంటే ARCHIVE.ORG లో లేని పుస్తకాలు చాలా చూడొచ్చు డి.ఎల్.ఐ లో.. అదీ సంగతి...

  మీ సూచన నిజంగానే బాగుంది. ఐతే మీరు చెప్పిన "ఇంటర్ఫేసు" (సూచన కానివ్వండి, వ్రాయటం కానివ్వండి) అవీ ప్రస్తుతానికి నాకు అవసరమూ లేదు, వలసిన శక్తీ లేదు. ఎవరన్నా తయారు చెయ్యటానికి సిద్ధపడితే అంతకన్నా సంతోషకరమైన వార్తా లేదు.

  ఈ సమాధానం కూడా అర్ధమయ్యీ అర్ధం కాకుండా ఉన్నది అంటే నాకు ఒక ఈమెయిలు కొట్టండి maganti.org at gmail dot com అక్కడ మాట్లాడుకుందాం.

  ReplyDelete
 3. అవును archive.org లేని పుస్తకాలు చాలా dli ఉంటాయి. వెదకటం ఆర్చీవ్ లో కంటే dli లోనే సులువు. archive లో పదం తో లేక పూర్తి పేరుతో మాత్రమే వెదకొచ్చు. కానీ dli లో regular expressions తో వెదకొచ్చు.
  http://en.wikipedia.org/wiki/Regular_expression.
  ఉదాహరణకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వారి రచనలు వెదకాలంటే, archive లో అయితే sripada subrahmanya sastry, sripada... ప్రతిసారీ వేర్వేరుగా వెదకాలి. regular expressions తెలిసిన వాళ్ళకు వెదకటం సులువు. తెలియకపోయినా, సులభంగానే వెదకొచ్చు. ఇదే రచయిత పేరు అనేక స్పెల్లింగ్స్ తో sreepaada subramanya shastri, sriipadasubramnysasthti ఉందనుకుంటే, కేవలం subr తో వెదికినా subr match అయిన అన్ని పుస్తకాలను చూపిస్తుంది. అందులో మనకు కావలసిన పుస్తకం డౌన్లోడ్ చేసుకోవటమే.

  మీరన్నట్లుగానే పాత తరం రచయితల, పుస్తకాల పేర్లు ఇప్పటి మాలాంటి వారికి చాలా మందికి తెలియదు. ఈ ఫైల్ లోనివి ఉపయోగపడతాయి. ఇక నేను డౌన్లోడ్ చేసినవి కూడా రాసుకోవాలి.

  dli లో పుస్తకాలను డౌన్లోడ్ చేయటానికి షణ్ముఖన్ గారు టూల్ రాశారు. ఆ టూల్ ఈ క్రింది లంకెలో దొరుకుతుంది.
  http://bhuvanavijayamu.blogspot.com/2009/06/how-to-download-chandamama-other-books.html

  ReplyDelete