Tuesday, March 30, 2010

DLI సైటు సెర్చి మీద మీ కసి ఇలా తీర్చుకోండి !

ప్రతివాళ్ళూ డిజిటల్ లైబ్రరీ మీద పడిపోయి ఏడ్చేవాళ్ళే! సెర్చి బాలేదు, మూతి బాలేదు, ముక్కు బాలేదు అనుకుంటూ. దాని బదులు నాలా (మూసీ "నాలా" కాదు బాబూ!) ఇలా చేస్కోవచ్చుగా...

సరే ఆ నాలాల సంగతి పక్కనబెట్టి విషయం చెప్పు నాయనా -

అప్పుడెప్పుడో ఆ సైటు మొదలెట్టినదగ్గరినుంచి, కొద్ది కొద్దిగా నా కంప్యూటర్లోని నోటుపాడులోకి ఎక్కించుకున్న డి.ఎల్.ఐ తెలుగు పుస్తకాల వివరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, టెక్నికల్ నాలెడ్జీ అంతగా లేనోణ్ణే అయినా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని కుస్తీపట్టి (దేంతో?) ఆరుగంటల్లో నాకు అనుకూలంగా, సానుకూలంగా ఉండేలా తయారు చేసుకున్నా. తయారు చేసుకున్నా కదా అని ఇక్కడ పెట్టా. వీలుంటే కళ్ళద్దాలు తీసి ఓ సారి చూడండి.

ఇంకో రెండు మూడు రోజుల్లో చక్కగా HTML టేబులు రూపంలో పెట్టి ఆ పక్కనే ఆ పుస్తకాల లింకులు కూడా పోష్టు చేస్తా. ఐతే లింకులు పోష్టు చేస్తే ఆ సైటువాడు పేజీలు గట్రా "రీవాంపు" చేస్తే (పాత సినిమాల్లో వాంపు కాదు నాయనా!) మళ్ళీ నా మీద పడతారు మీరంతా....

అందాకా ఆగలేను అనుకున్నోళ్ళు, ఇక్కడ ఇంగ్లీషులో ఉన్న టైటిలు కాపీ చేసి, డి.ఎల్.ఐ లోకి వెళ్ళి అచ్చంగా అదే ముక్క పేష్టు చేసి "సెర్చ్" కొట్టండి. పుస్తకం ప్రత్యక్షం. ఐతే ఇందులో ఎన్ని తమరు చదూకోటానికి, చూడటానికి కనిపిస్తాయో, ఎన్ని పీకెయ్యబడ్డాయో - దాని సంగతి మీ మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోటి...ఇది సెర్చికి మాత్రమే...ఆ పుస్తకాలు ఏకంగా DOWNLOAD చేసుకోవాలంటే మన బ్లాగరుల్లో ఒకాయన అప్పుడెప్పుడో ఏదో ప్రోగ్రాము రాసినట్టు గుర్తు...దాన్ని దించుకుని ఆనందోబ్రహ్మ అవ్వొచ్చు ఇహ మీరు...లింకు ఏమిటా ? అది నాకు తెలియదు ! ఎవరో గణేశన్ అని గుర్తని "దేవరపల్లి రాజేంద్ర" చెప్పినట్టు గుర్తు మరి.. :) ఈ వెధవ గోల అంతా ఎందుకు మాకు ARCHIVE.ORG ఉందిగా అంటారా? అదే మీ త్రిశంకు స్వర్గం...అభినందనలు..

తొందరే ఆయాసః - ఓపికే నిలుబడునః .

టెక్నికల్ నాలెడ్జీ ఉన్నోళ్ళు ఇతర వివరాలు కావాలంటే కామెంటో / మెయిలో కొట్టండి. నా దగ్గరున్న నోటుపాడులు అన్నీ పంపిస్తా.వాటి మీద మీ ప్రతాపమూ, కసి చూపించుకోండి.

ఐతే ఇక్కడ ఒక సంగతి చెప్పాలె...ఎందుకా? ఎందుకంటే గుర్తుకొచ్చింది కాబట్టి! ఆమధ్య అంటే ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల క్రితం, వికిపీడియా నిర్వాహకుడు ఒకాయన, పేర్లు, వివరాలు ఎందుకులెండి కానీ - నాకు ఒక వికారమైన ఈమెయిలో / కామెంటో కొట్టాడు. నేను స్పందించలా. మళ్ళీ ఈమెయిలు /కామెంటు వచ్చినాయి. ఈసారి మర్యాదగా నేను స్పందించా. దానికాయన జవాబు - "మాగంటిగారూ మీ సైటులోని వివరాలు బాగున్నాయని చెప్పాను. అన్నీ తీసుకెళ్ళి వికిపీడియాలో పెడతాననీ చెప్పాను. మీకు అభ్యంతరం ఉండకూడదనే అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా, వాటిలో బోల్డు శాతం కాపీరైటు లేనివే కాబట్టి నిరభ్యంతరంగా నేను తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. మీరు అనుమతిస్తే మంచిది. పేరు ఉంటుంది. లేకపోయినా మంచిదే. ఏమవుతుందో నేను చెప్పనఖ్ఖరలా" అని రాసాడు. అలాటి ఈమెయిలే మనకున్న మరో అద్భుత భాండాగారం లాటి వెబ్సైటు వారికి పంపించాడు అని ప్రియమిత్రులైన ఆ వెబ్సైటు నిర్వాహకులు చెప్పారు నాకు. ఒకవేళ అలాటి "సత్కార్యాలు" ఈ ఫైలుకు మీరు చేసుకోవాలని అనిపిస్తే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు....నా ఉద్దేశం అర్థమయ్యిందనే అనుకుంటున్నా.

ఇదెందుకు చెప్పానంటే DLI వాడు అలా గందరగోళంగా పెట్టటమే మంచిది..లేకుంటే మన శూరశిఖామణులు విలువలు, వలువలు లేకుండా రెచ్చిపోతారన్న మాట - "ఇనుము ఇనుము అయినంత" నిజం

సరే ఈ ఫైలుతో నేను కుస్తీ పడ్డ విధానం ఇదీ...ఇహ కొద్దిసేపు ఆంగ్లమున వాగెదను -

Open Microsoft Excel

Import External Data

Delimit the external data

Sort the data by title

Use a formula to identify duplicate rows
(Though it took a while for me to figure out I used a CRUDE Formula - If(A2=A1, "*", "") to identify the duplicate rows)

Manually deelete the duplicate rows
(As I was not able to sort it again because of the formula I used I guess!)

Add A Filter

Save it as the file you want


చివరిగా నా దగ్గర మొత్తం 15 దాకా నోటుపాడులు వున్నవి...అందులోని కొన్ని ..చాలా కొన్ని అంటే.. 900 పుస్తకాల వివరాలు ఇక్కడ చూడొచ్చు..ఎవరికైనా సాయం చెయ్యాలి అనే "సదుద్దేశం" ఉంటే వివరాలు పంపండి. ఆ నోటుపాడులు పంపుతా

1 comment:

  1. >> ఇదెందుకు చెప్పానంటే DLI వాడు అలా గందరగోళంగా పెట్టటమే మంచిది..లేకుంటే మన శూరశిఖామణులు విలువలు, వలువలు లేకుండా రెచ్చిపోతారన్న మాట - "ఇనుము ఇనుము అయినంత" నిజం

    How true!

    ReplyDelete