Wednesday, December 29, 2010

దేనికి తగ్గవారు దానికి ఉండరూ?

పద్యమొచ్చింది
పద్య పాఠకులొచ్చారు
పద్య విమర్శకులొచ్చారు

పద్యం పోయింది
పద్య పాఠకులు పోయారు
పద్య విమర్శకులు పోయారు

గేయమొచ్చింది
గేయ పాఠకులొచ్చారు
గేయ విమర్శకులొచ్చారు

గేయం పోయింది
గేయ పాఠకులు పోయారు
గేయ విమర్శకులు పోయారు

గద్యం వచ్చింది
గద్య పాఠకులొచ్చారు
గద్య విమర్శకులు వచ్చారు

గద్యం పోయింది
గద్య పాఠకులు పోయారు
గద్య విమర్శకులు పోయారు

చోద్యమొచ్చింది
చోద్య పాఠకులొచ్చారు
చోద్య విమర్శకులొచ్చారు


చోద్యం పోయాక ఏమొస్తుందో?

తెలీక అడుగుతున్నానబ్బాయీ - దేనికి తగ్గవారు దానికి ఉండరూ?..

మాల కొండయ్య గారి పుస్తకాల / కవితల ప్రేరణతో

(Post 403)

Sunday, December 19, 2010

ఇంకోసారి సరిగ్గా గీస్తా అని చెప్పా....

నిన్న సాయంత్రం - ప్రదోషానికి శివ జేజికి చేసే రుద్రాభిషేకానికి వెళ్లా! ఎందుకు? నాన్న కూడా చదువుతాడుగా రుద్రం అందుకు!. అయితే మధ్యలో బాగా ఆకలి వేసి వెళ్లిపోదాం అని గోల చేసా. నేను అలా గోల చేస్తున్నానని ప్రసాదం ఇచ్చేదాకా ఉండకుండా, శివ జేజికి అలంకారం చేస్తుంటే వచ్చేసాం. నాన్నకు బాగా కోపం వచ్చింది - నేను ప్రసాదం తీసుకోనివ్వలేదని.

మళ్లీ ఇవాళ మా గుళ్లో పొద్దున్నే 10.30కి గణపతి జేజికి అభిషేకానికి మళ్లీ రుద్రం చదువుతారుగా. అందుకు మళ్లీ తీసుకెళ్లాడు. ఈసారి రెండు పేపర్లు తెచ్చాడు. ఎందుకో అనుకున్నా. నాన్న రుద్రం వల్లిస్తూ, నిన్నట్లాగా మళ్లీ గోల చేస్తానేమోనని ఒక పేపరు నాకిచ్చి గణపతి జేజి బొమ్మ వెయ్యమని సైగ చేసాడు. అప్పుడర్థమయ్యింది, పేపర్లు ఎందుకు తెచ్చాడో..వెంటనే వేసేసా!

బొమ్మలో....అరటిపళ్లు, దీపాలు, ఎలక, కొబ్బరికాయలు, లడ్లు, చేతిలో పువ్వు అన్నీ వేసేసా....ఇంటికొచ్చాకా కలర్ వెయ్యమంటే అది కూడా వేసేసా...అదే ఇది....ఐపోయిందని చూపిస్తే, ఇంకో పేపరిచ్చాడు - సైగ చెయ్యలా...ఏం  వెయ్యాలో అర్థం కాక అప్పుడు పావురం బొమ్మలు వేసేసా....ఇసిటి ఫామిలీ అని మా టీచర్ జేన్ చెప్తుందిగా...ఆ ఫామిలీ పేరు పెట్టేసా...
బిగ్ కిస్స్ ఇచ్చి - చాలా బాగుంది చిన్నమ్మా, కానీ గణేశ్ జేజి బొట్టు ఏమిటే అలా వేసావు అని మాత్రం అన్నాడు నాన్న...త్రిశూలం బొమ్మ వేద్దామంటే ఎలాగో వచ్చింది ఆ బొట్టు మరి....ఇంకోసారి సరిగ్గా గీస్తా అని చెప్పా....

Tuesday, December 14, 2010

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం - ఆకాశవాణి ప్రసారం

మొలక మీసపు గట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతి జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనల దగులు భృంగ గణంబు
గనుల పండువుసేయ, మనసునిండుగ బూయ
ధణధణధ్వని దిశతతి బిచ్చలింపగా

ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు


పుట్టపర్తి వారి శివతాండవ కావ్యం - అద్భుతమైన కావ్యం ఆకాశవాణి వారు ప్రసారం చేస్తే, ఆ అద్భుతాన్ని మనకందించిన వారు తెలుగుథీసిస్.కాం రంజని గారు. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో

******************************************************

శివతాండవం సంగీత రూపకం (1993)

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం గేయకావ్యానికి
రేడియో అనుసరణని వారి కుమార్తె శ్రీమతి నాగపద్మిని చేసారు.

సంగీతం: శ్రీ యెల్లా వేంకటేశ్వరరావు

పునఃప్రసారం : 12 Dec 2010  

******************************************************

ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

Sunday, December 5, 2010

ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి / వరంగల్ ఆకాశవాణి కేంద్రం ప్రసారం

1931లో జన్మించి తెలుగు సాహిత్యలోకానికి అపారమైన సేవనందించిన ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రిగారి జీవిత విశేషాల గురించి వరంగల్ ఆకాశవాణి కేంద్రం ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ వెన్నవరం ఈరారెడ్డి, మారేడుకొండ బ్రహ్మచారి గారు.

కార్యక్రమాన్ని అందించిన కేశరాజు భానుకిరణ్ గారికి ధన్యవాదాలతో...****************************************************************

ఇక రామకోటి శాస్త్రి గారి సంక్షిప్త వివరాల్లోకి వస్తే - 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్ వరంగల్లులో ప్రారంభమైనప్పుడు తెలుగు విభాగానికి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు పునాదులు వేస్తే ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు పటిష్టపరిచారు. రామకోటి శాస్త్రిగారంటే సాహిత్య అధ్యయనం, సాహిత్య సంభాషణ. గుడివాడ కాలేజీలో అధ్యాపకుడిగా కె.జి.సత్యమూర్తి, చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదనరావు మొదలైనవారికి విద్యాబోధన చేసి ఈ సాహిత్య ప్రపంచానికి ఆణిముత్యాలవంటి ఎందరో సాహితీకారులని అందించారు. ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే గారు ఆచార్యుల వారి కుమార్తె. 

*****************************************************************

ఎక్కడ వినవచ్చు  ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

Thursday, December 2, 2010

వాద్య కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్ పరిచయం / ఆకాశవాణి ప్రసారం

వాద్య కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్ పరిచయం
పరిచయకర్త : శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx - AIR)

ప్రసారం తేదీ : 02 డిసెంబరు 2010
తెలుగు థీసిస్ డాట్ కాం రంజని గారి సౌజన్యంతో.

ఆడియో అందించిన రంజని గారు ఇలా అంటారు

_______________________________________

ఒక పాట లేదా ఓ రూపకం అద్భుతంగా ఉందని మనం
చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా సంగీత దర్శకుల ప్రతిభని
కొనియాడుతాము. వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారుల గూర్చి అంతగా పట్టించుకోము...

50 సంవత్సరాలకి పైగా అనేక ఆకాశవాణి కార్యక్రమాలకి
స్టేజి కార్యక్రమాలకి వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్. ఒక రిధమ్స్  కళాకారునిగా
పత్రికలలో ఈ పేరు అప్పుడప్పుడూ కనిపించేది - జీవన
వివరాలు ఇప్పుడు ఈ పరిచయ కార్యక్రమంలో...
_______________________________________

ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

Wednesday, December 1, 2010

ఆచార్య తిరుమల రామచంద్ర - భారతి పత్రిక అనుబంధం

మహామనీషి ఆచార్య తిరుమల రామచంద్ర గారు భారతి పత్రికతో తనకున్న అనుబంధం గురించి వివరించిన ఈ వ్యాసం వారాంతం దేనికోసమో వెతుకుతుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లోనుంచి ఆణిముత్యంలా బయటపడింది.....

స్కాన్ ఫైళ్ల తేదీలు చూస్తే సంవత్సరన్నర క్రితం ఉన్నవి....బోల్డు ఆశ్చర్యపోయా నేనే - ఎలా మిస్సైపోయిందబ్బా అని!

ఇప్పుడు ప్రచురించేసా! మీరు చదువుకోవటమే మిగిలింది......ఎక్కడ?

http://www.maganti.org/newgen/index1.html

వ్యాసావళి సెక్షన్లో ...

భవదీయుడు
వంశీ

Monday, November 22, 2010

పద్మశ్రీ డా. శోభానాయుడు పరిచయ కార్యక్రమం Part 1 / Part 2 - ఆకాశవాణి ప్రసారం

శోభ... కూచిపూడి నృత్య కళకే వన్నెతెచ్చిన సురభిళాలు వెదజల్లిన నవ వసంత శోభ. నాట్యమే వేదంగా, నిజజీవన నాదంగా, పండితపామర రసజ్ఞజనామోదంగా, ప్రసన్న సుహృత్‌ ప్రసూన ప్రమోదంగా, అందగించే ఎలనాగ, పద్మశ్రీ డా|| శోభానాయుడు.

ఆమె నర్తిస్తే, కలహంసలు సిగ్గిల్లుతాయి. ఆమె రంగస్థలి మీద వర్తిస్తే, కెరలేమయూరాలు సైతం లజ్జానవతలౌ తాయి. ఆమె అభినయిస్తే, ఆమె నయగారాలలో, శంపాలతలు మెరవడానికి సంశయిస్తాయి. ఆమె కనుబొమలు కదలిస్తే పాలపుంతలు మోహరిస్తాయి. ఆమె రసార్ద్ర నయనాంచలలో ఇంద్రధనువులు కాహళిస్తాయి. ఆమె పాటలధరాల కదలికలో శరదేందు చంద్రికలు తరళిస్తాయి. ఆమెనవరస నటనా విన్యాసాలు నటరాజుకి నవరసామృభిషేకాలు. సత్యభామగా హొయలుపోతే, వంశీమోహనుడి మురళిలా చూపరుల హృదయాలు రవళిస్తాయి. శ్రీనివాసకళ్యాణంలో, శ్రీదేవిగా సాక్షాత్కరిస్తే, అశేష జనాంతరంగాలు నిరుపమ భక్తి భావంతో పరవశిస్తాయి. ఆమె సాయినాథుడిగా దర్శనమిస్తే, ప్రేక్షకుల డెందాలు అమందానందకదళితారవిందాలై విరుస్తాయి. ఆమె గౌతమబుద్ధుడిగా అవతరిస్తే, అంతరాంతరాళాలు ఆధ్యాత్మి కానుభూతిలో తరిస్తాయి. ఆదిశక్తిగా, రౌద్రభద్రకాళిలా విజృంభిస్తే, పరిసరాలు భీతావహంతో బిగిసిపోతాయి. ఆమె బీభత్స రసంప్రసరిస్తే జ్వలిత నేత్రాలలో విస్ఫురత్క ణాలు చెరుగుతున్న భావనకి గురిచేస్తాయి సభాప్రాంగ ణాలు గడగడలాడు తాయి. ఆమె భయానక రూపంగా ఆవహిస్తే, సచరాచరాలూ వులికిపడ తాయి. ఆమె శాంతవ దనంతో సమాదరిస్తే, సౌహృద పద్మాలు వికచి స్తాయి. ఆమె కరుణార్ద్రగా కరిగిపోతే, ఘనీభవించిన కరడుగట్టిన గండ శిలలాంటి హృదయాలు కూడా ద్రవి స్తాయి. ఆమె అద్భుత రసం జాల్వారిస్తే, ఆబాలగోపాలం మైనరచి పోతారు. ఆమె ఆశ్చ ర్యచకితగా నటిస్తే, నిండుపేరోలగం సంభ్రమిస్తుంది. ఆమె హాస్య రసం చిలి కిస్తే, ఎదలు పులకరి స్తాయి. ఆమె శృంగారాలు ఒలికిస్తే, సింగార భావనలు పుల్లమిస్తుంది.. ఇంతటి నటనా పాటవం కలబోసు కుని, శిష్య ప్రశిష్యగ ణాల ప్రతిభా వ్యుత్పత్తులని కలవేసుకుని, నితాం తక్రమశిక్షణతో, నిరంతర శిక్షణలో, కూచిపూడి నాట్య తపస్సే, తన యశస్సుగా భావిస్తూ, భారతీయ కూచిపూడి నాట్యకళని ఖండఖండాంతరాలకి వ్యాపింపజేస్తున్న, అవిశ్రాంత, నవరస నటయశోభామిని, పద్మశ్రీ డా|| శోభానాయుడు. 

ఆమె నృత్తగాన మాధురీ పరీవాహ శోభ. నృత్య శబ్ద విలసిత విన్యాస ప్రలోభ. నాట్యకళాప్రపూర్ణేందు షోడశోజ్జ్వలకాంతిచ్ఛటా సంభ్రమప్రభ. సంగీత, సాహిత్య, నాట్య, సురమ్య సంగమ సముచ్చయ యశోః విలాసాభ. అనర్ఘా కాంగిభినయాలవాల. సమున్నత మూర్థ్యోరోజ, హస్త, పాదాంచిత నృత్యకళాపరిపాల. నయన, నాసికాధర సురుచిర కపోల, చుబుక సంచలన హేల. దృంగంచలాంకిత విశాలఫాల ప్రఫుల్ల హావభావ పరిపాల.అత్యద్భుత వాచికాభినయరంగత్తరంగడోల. మంద, మంద్ర, వుచ్చైస్వర నిస్వనస్వన దశరూపకాభిజాల. భువనమోహన సహజ సౌందర్యాభూషణ మణిప్రవాళ. విస్ఫురద్వస్త్ర పరిధాన ప్రవిమలాలంకార సంచాల. సముజ్జలాహార్య ధారణాధుర్యారాళకుంతలవిశాల. సాత్విక శృంగారాభినయ విలోల. సహస్రానేక విశేషణ నామ తత్తుల్య తరళావిరళ సంశోభ, డా|| శోభానాయుడు

ఆమె నాట్య విన్యాసం అవిరళం, అమేయం, అలౌఖ్యం, మది మదినీదోచే ముగ్ధమోహన విన్యాసం, ఏ పాత్రతోనైనా మెప్పించగల లాలిత్యం, పద విభ్రమణంతో, కైలాస గిరులను సైతం కదిలించగల అపూర్వ నాట్య విన్యాసం, ఆమెకే సొంతం. నిరంతర నృత్య తపోనిష్ఠాగరిష్ఠతతో, నటరాజు పూజకు చివురించిన కుసుమంలా, నాట్య సుగంధ పరిమళాలు నలు నెలవురా వ్యాపింపజేస్తూ, నాట్య కళావనిలో, సంప్రదాయ సురభిళాలు వెదజల్లుతూ, శోభస్కరం చేస్తున్నారు, పద్మశ్రీ డాక్టర్‌ శోభానాయుడు.
 **********************************************************

ఈ పైదంతా నేను వ్రాసాననుకునేరు....ఆంధ్రప్రభలో వచ్చిన ఆర్టికల్ లోని సమాచారం పైదంతా.....
 

ఇహ ఇప్పుడు ఆ పరిచయ కార్యక్రమం  ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

తెలుగు థీసిస్ డాట్ కాం రంజని గారి సౌజన్యంతో....

ఈ సంకలనాలేమిటో, సంగ్రహాలేమిటో, కలగూరగంప అచ్చులేమిటో! తద్దినం తగలెయ్య!

ఈ సంకలనాలేమిటో, సంగ్రహాలేమిటో, కలగూరగంప అచ్చులేమిటో! తద్దినం తగలెయ్య!

సమయం దొరికితే చాలు ఈ మధ్యన ప్రతి సాహిత్య సంఘం, వాటితో పాటు కొద్ది మంది మనుషులు  - పెద్ద సంఘం, చిన్న సంఘం, పెద్ద మనిషి, చిన్న మనిషి  తేడాల్లేకుండా గుత్తగుంపేసి బతుకమ్మలోలా కాకపోయినా ఏదో రకంగా చప్పట్లు కొట్టుకుంటూ, కొట్టించుకుంటూ, చెవిలోకి కాకుండా తమ బుఱ్ఱల్లోకి చేరిన జోఱీగల వ్రాతలు నెత్తినెట్టుకోని, మాకు నచ్చినవి అచ్చేస్తాం. ఆ అచ్చుపోతలకు, ఎత్తిపోతలకు బాబూ మీ డబ్బులివ్వండి. మా డబ్బులడక్కండి. మా సంఘానికి బొక్కెట్టే ఆలోచనకో రూపం ఇచ్చాం. అదెవ్వడికీ తెలీదు. మీ డబ్బులు ఆడెవడో పబ్లిషరు కాకుండా మా బంధువుల్లోని పబ్లిషరుకే ధారపోసి, సాయం జేసి, ఆతర్వాత పనీ పాట లేకుండా మీరుంటారని మీకు ఆహ్వానం పంపించి ఇకిలిస్తాం. మీ సకిలింపుతో మా పనికిమాలిన ఆహ్వానాన్ని మన్నించి పొద్దుపోని మా సభకొస్తే మీరిచ్చిన డబ్బుతో మీకు కొద్దిగా మేత వేస్తాం. మేత మెక్కి, కుడితి తాగి మీ మొహాన తగలేసిన పుస్తక ప్రతులు తీసుకెళ్లి పాత పేపర్లోడికి అమ్ముకోండి. ఈ మధ్య అమెరికా బాంకులోళ్లు ఖర్చు చేసిన మీ డబ్బుల్లో ఐదు శాతం తిరిగిస్తాం. ఖర్చు చెయ్యండి బాబులూ అంటున్నట్టు, ఈ సంగ్రహసంకలనాలకు మీరిచ్చిన డబ్బుల్లో రెండు శాతం మా ఏజంటు ఆ పాతపేపర్లోడి దగ్గరనుంచి వెనక్కు తెచ్చుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇకిలింపులకి ఇప్పట్నుండే సిద్ధమైపోండి. ఈ సంవత్సరం రాజపోషకులు కాబట్టి, వచ్చేసంవత్సరం మహరాజ పోషకులో వీలైతే సార్వభౌమ పోషకులో అవ్వండి. మీకో కత్తి ప్రదానం చేయిస్తాం. అదుచ్చుకుని గాడిదెక్కి మెళ్లో మేమిచ్చిన బిళ్లేసుకుని మీ ఊళ్లో జరిగే ప్రతి సభకు పోండి. మీ ప్రతిష్ట ఇనుమడింపచేసుకోండి. కొద్దిరోజుల్లో బిచ్చగాడైపోండి.

అలా పోయే ముందు ఓ మాట - సభలకు ప్రచారం కలిపించే బాధ్యత మటుకు మాదే. నిప్పులు రాజేసైనా సరే, తెలంగాణా సంగతి ఎత్తైనా సరే, సినిమాల లెవెల్లో హైపులు కల్పించే తద్దినాలు మా దగ్గరున్నాయి. మీరు కూడా పిండాలు పెట్టానుకుంటే, మా దగ్గరకొచ్చి మాఱుమాట లేకుండా సకిలించండి. కావలసిన నువ్వులు, బియ్యం, బియ్యపన్నం తినడానికి కాకులు సప్ప్లై చేస్తాం.

ఫలశ్రుతి:
సంకలనాస్సమస్తా స్సుఖినోభవంతు
సంపాదకస్సమస్తా స్సుఖినోభవంతు
సాహిత్యసభాస్సమస్తా స్సుఖినోభవంతు
ధనసాయాస్సమస్తా ద్దరిద్రోభవంతు

దిక్కుమాలిన కామెంట్లు పెట్టేముందు బ్లాగులో అల్లదిగో , పైన, కుడిపక్కనున్న నిర్దాక్షిణ్య సంగతి చదవండి. తర్వాత ఏడవొద్దు.

Saturday, November 20, 2010

గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస!!

భావకవిత్వం గిట్టని చెళ్ళపిళ్ళ -

"మున్ పటి రూల్సుకు కట్టుపడమ"ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి "అభినవ సరస్వతి" పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.

"భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి - అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.

ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. "కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ"ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.

ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. "కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే" మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. "జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు"నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస."

ద్వా.నా.శాస్త్రిగారి సాహిత్య కబుర్లు పుస్తకం నుంచి....

Friday, November 19, 2010

యామినీ పూర్ణతిలక నాటకం / డాక్టర్ R. అనంతపద్మనాభరావు గారి స్వచ్ఛమైన, వీనులవిందైన తెలుగు / ఆకాశవాణి ప్రసారం

శ్రీ శేషం రామానుజాచార్య విరచిత నాటకం - యామినీ పూర్ణతిలక

ఆకాశవాణి ప్రసారం.......ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం, శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి పాత్రల పోషణ అద్భుతం......డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో ( lokabhiramam.blogspot.com )

ఎక్కడ? ఇక్కడ

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు

అలాగే ఆకాశవాణి డైరెక్టరు డాక్టర్ రేవూరి అనంతపద్మనాభరావు గారి శ్రోతలతో ముఖాముఖి - కూడా అదే పేజీలో.....తెలుగు థీసిస్ డాట్ కాం రంజని గారి సౌజన్యంతో....

డాక్టర్ R. అనంతపద్మనాభరావు గారి ఇంటర్వ్యూ పేజీలో ఇచ్చిన యూట్యూబు వీడియో లంకెలు తప్పక చూడండి....

అంత స్వచ్ఛంగా వీనులవిందుగా తెలుగు మాట్టాడేవాళ్లు కరువైపోటల్లా?

He says in one of the video - "స్వామిని నువ్వెంతసేపు చూసావన్నది ముఖ్యం కాదు నాయనా, స్వామి నిన్ను ఎంతసేపు చూసాడన్నది ముఖ్యం" -  అక్కడెక్కడో ఏదో బ్లాగులో చదివా, మహేశ్ బాబు అనే వ్యక్తి ఈలాటి డయలాగే ఏదో వాడాడని.....బోల్డు చప్పట్లు కొట్టారనీ, కొడుతున్నారనీ....మరి డాక్టర్ గారు ఎప్పుడో వాడిన దీనికేమంటారు! :) 

I bow myself to the master! and I say - he simply is a genius!  Take time and pls listen / watch  all of his interview videos

భవదీయుడు
వంశీ

Thursday, November 18, 2010

ఆడోళ్లైతే చెమ్మచెక్క - మగోళ్లైతే వైకుంఠపాళీ ....అదిరా సంగతి!! నా బకెట్ లిష్టు కూడా ఇచ్చా!!

ఒక గొప్ప నటుడు నటించిన సినిమా చూస్తే ఓ గొప్ప అనుభూతి మిగులుతుందనుకుందాం. మరి ఇద్దరు గొప్పనటులు నటించిన సినిమా చూస్తే ఏం మిగులుతుంది? అందులోనూ అభిమాన నటులనుకో - ఆడోళ్లైతే ముగ్గేసుకుని చెమ్మచెక్క ఆడుకోటం, మగోళ్లైతే వైకుంఠపాళీ ఆడుకోటమేగా? అదీ లెఖ్ఖ! ఆ వైకుంఠపాళీ ఆడుకోని ఆనందించాను బకెట్ లిస్ట్ అనే సినిమా చూసి నిన్న రాత్రి. ....

జేమ్స్ ఎర్ల్ జోన్స్, రాబర్ట్ డెనీరో, జాక్ నికొల్సన్, మోర్గన్ ఫ్రీమన్, ఆంథోనీ హాప్కిన్స్, జీన్ హాక్ మాన్, టాం హాంక్స్, యూల్ బ్రిన్నర్,  ఛార్ల్టన్ హెస్టన్, మార్టిన్ స్కోర్సేసి.....

ఆగిపోండక్కడే....వీళ్లంతా లేరు ఆ సినిమాలో....వీళ్లంతా నా అభిమాన "తారా, దర్శక, కళాకార" గణంలోని కొంతమంది....

ఈ గణంలోని ఇద్దరు వీరభద్రులు - జాక్ నికొల్సన్, మోర్గన్ ఫ్రీమన్ నటించిన సినిమా ఈ బకెట్ లిస్ట్. 2007లో విడుదలైందనుకుంటా!..

కథేమిటయ్యా అంటే, జాక్ నికొల్సన్ పేరు ఎడ్వర్డు, 70 ఏళ్లు, బోల్డంత డబ్బు, బోల్డన్ని విడాకులు, ప్రెయివేట్ రూముల్లేని హాస్పిటలు, హాస్పిటలు ఉన్నందుకు ఎడ్వర్డుకు కాన్సరు. ఇహ మోర్గన్ ఫ్రీమన్ పేరు కార్టర్, దాదాపు 70 ఏళ్లు, కొంచెం బీదవాడు, కాన్సరు. సరే ఇద్దరికీ కాన్సరుంది కాబట్టి, ఇద్దరూ జాక్ నికొల్సన్ గారి ప్రయివేట్ రూముల్లేని హాస్పిటల్లో ఒకే రూములో పక్క పక్కనే బెడ్లేసుకోని బజ్జుంటారు. ఆ పక్క పక్కనే బజ్జోటం జాక్ గారికి ఇష్టముండదు. కానీ తప్పదు. మోర్గన్ ఫ్రీమన్ బకెట్ తన్నేలోపు చెయ్యాల్సిన పనులు ఓ లిష్టు కింద రాసుకుంటాడు. అది చూసి జాక్ గారు కూడా లిష్టు వాత పెట్టుకోని, మోర్గన్ లిష్టుని పూర్తిచేసి ఆ తర్వాత మోర్గన్ కి వాతలెట్టుకుంటూ ప్రపంచమంతా తిప్పుకోని తీసుకొస్తాడు. స్థూలంగా అదీ కథ. రాబ్ రైనియెర్ దర్శకుడు. జస్టిన్ జాక్ హాం కథా రచయిత....

ఐతే వీరభద్రులు ఆడుకున్న వైకుంఠపాళీలో పాములెక్కువైనాయి కానీ చాలా డైలాగులు మటుకు కాలకూట విషంతో కాటేసినంత పని చేసినాయి...అంటే ఏదో అనుకునేరు, వెధవ బుఱ్ఱల్ని తగలెయ్య - తలకు అంత తొందరగా ఎక్కదూ చావదు - కాలకూట విషం అంతలా సఱ్ఱున ఎక్కిపోతాయన్న సంగతి తెలిస్తే ఇహ నా జన్మ ధన్యమే.


ఆ బకెటు చూసాక, దాన్ని అక్కడ పెట్టి నా బకెట్ లో కొచ్చి లిస్టు రాసుకుంటే తేలిన ఇరవై మగ్గుల్లో ఎనిమిది మగ్గులు  ఇవిరా చిదంబరం -

ఎనిమిదే ఎందుకు ? అన్నీ నీ దగ్గరే పెట్టుకోవచ్చుగా? ఇస్తే మొత్తం ఇవ్వు, లేదా మొత్తంగా మానెయ్యి...అంతే కానీ ఈ త్రిశంకు ఎందుకు మాకు?

నీకింత తెలివి ఎక్కడినుంచి వచ్చిందిరోయి? అది సరే కానీ, నీ త్రిశంకు సంగతి తర్వాత చూస్తా...

ఇప్పటికిది చదువుకో

అ) చిలకమర్తి వారి "ప్రహసనములు" టైపులో, టైపులో ఏమిటి? అచ్చు అలాటిదే - ఎన్ని పెన్నులు విఱిగిపోయినా, ఎంత సిరా కారిపోయినా, ఎన్ని కాయితాలు చిత్తైపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఓ 700 పేజీలు కాకుంటే ఓ 1000 పేజీల లెవెల్లో ఓ పేద్ద రచన చెయ్యాలనీ, ఎవడి నెత్తికీ మసి అంటకుండా నేనే 50,000 కాపీలు పబ్లిష్ చేసుకోవాలనీ, ఎవడు చదవకపోయినా అన్ని లైబ్రరీలకూ ఉచితంగా ఐదారు కాపీలు పందేరం చెయ్యాలనీ. ఆయా లైబ్రరీలు కూడా వద్దంటే శిలాశాసనం కింద చెక్కించి ఎల్.బి.స్టేడియంలో తలో మూల పాతించాలనీ...ఇలా బోల్డు.... ఈ కలలో నాలుగు పేజీలు అప్పుడెప్పుడో ఉపోద్ఘాతంగా వ్రాసుకున్నా...లింకులు ఇక్కడ....ఇది ఊరకే శాంపిలు! అసలు రచన, దీనికి గానీ ఈ ఇతివృత్తానికి గానీ సంబంధం లేని రచన - ఓ 20 పేజీలు డ్రాఫ్టులో ఉన్నది....ఇంకో ఎనభై పేజీలయ్యాక పార్ట్లు పార్ట్లుగా వదులుతా......

సణుగుడు మేళమా ?

సణుగుడు మేళం - సరిచేసిన రెండోభాగం 

సణుగుడు మేళం - మూడో భాగం

ఆ) అబ్దుల్ కలాం గారితో కలిసి మా ఇంట్లో భోజనం చెయ్యాలని....ఇది నిజంగా జరిగేదెలా? ఎలా? ఎలా?

ఇ)తాతయ్యా - తక తయ్యా కాకపోయినా అలాటిదేదో అంటూ కథకళి టైపులో ఓ పదివేల మంది జనాల సమక్షంలో వీరనృత్యం చెయ్యాలని మనసులో ఉన్నది. అలాగని పోతరాజు లెక్క గాదనుకో ఓ పోరగా! పదివేల మందే? చాలా నాయనా? ఇప్పటికి మా బుఱ్ఱల మీదికెక్కి ఆడుతున్నావు చాలదా అంటావా? నీ జాతకంలో "అది" రాసుంటే ఆడటమేమి ఖర్మరా సుపుత్రా ! బుఱ్ఱ రామకీర్తన పాడేస్తా, ఆ కీర్తన సుస్వర సహితంగా వ్రాసిస్తా, చెవిలో సీసం పోసినట్టు వెచ్చగా నీకే వినిపిస్తా, ఆ తర్వాత తమరి ఆనందాతిరేక ముఖారవిందాన్ని లోకులకు చూపిస్తా! 

ఈ)చిలకమర్తి - పానుగంటి - వేలూరి - శ్రీపాద చతుష్టయానికీ, వేదం వేంకటరాయ శాస్త్రి, విశ్వనాథ, విద్వాన్ విశ్వం, తెన్నేటి సూరి గార్ల వీరాభిమానినవ్వటం మూలాన, వారి పుస్తకాల ప్రతులన్నీ శాసనాల్లాగా రాళ్ల మీద చెక్కించి, హాలీవుడ్డు సైనులా హార్స్లీ కొండల మీద ఆ ఎత్తులో నిలబెట్టి కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా వారి వ్రాతలు "నాగబు" లా వెలుగు రేకలు విరజిమ్మేలా చేయాలన్న బృహత్ ప్రణాలిక ఎప్పటికి సఫలం అవుతుందో?

ఉ)నడుచుకుంటూ మవుంట్ కైలాశ్ దర్శన భాగ్యం చేసుకోని, ఆతర్వాత ఈ ప్రపంచకంలో చూట్టం మిగిలిపోయిన ప్రదేశ విహరణ సొంత విమానంలో - ఏవా? ఈజిప్టు, జోర్డాన్ లోని పెట్రా, మెక్సికోలోని యూకటాన్, పెరులోని మాచు పిచు, ఆర్జెంటినాలోని ఇగువాజు జలపాతం, చిలీలోని అటకామా ఎడారి, క్రోయేషియా లోని లిట్వైస్ లేక్స్, ఇటలీలోని రోము,  టర్కీలోని ఇస్తాంబుల్, స్పెయిన్లోని సెవియె, జర్మనీలోని బెర్లిన్, బెల్జియంలోని బ్రస్సెల్స్, ఆఫ్రికా ఖండంలో మొరాకో, కెన్యా, టాంజనియా, బోట్స్వానా, ఇవి అన్నీ ఐపోయాక బ్రజిల్ లోని అమెజాన్ నదిలో ఆ చివరినుంచి ఈ చివరిదాకా ఒంటరిగా చిన్న పడవలో ప్రయాణం. ఏమిటిది? భారతదేశంలో ఏవీ లేవా? ఉన్నాయి, ఉన్నాయి - వాటి లిష్టు హైదరాబాదు నుంచి కొండవీడు దాకా ఉంది శంకరయ్య గారూ!

ఋ) చల్లపల్లిలో ఓ పేద్ద స్కూలు, 1000 బెడ్ల హాస్పిటలు - బందరులో ఓ పేద్ద స్కూలు, 2000 బెడ్ల హాస్పిటలు పెట్టెయ్యడం. ఆ నాలుగిట్లో ఫ్రీగా చదువు, ఫ్రీగా వైద్యం అందించటం.అన్నీ నా డబ్బుల్తోనే లేవయ్యా.....అడుక్కోడం, దానమివ్వండి - సాయం చెయ్యండి అనటం మా ఇంటా వంటా లేదు...

ౠ) చివరిగా చల్లపల్లిలోనో, బందరులోనో ఓ ఇరవై ఎకరాలు కొనుక్కోని సరిగ్గా మధ్యలో ఓ పాక వేస్కోని - ఓ ఎకరంలో బెల్లపు బట్టీ, ఓ ఎకరంలో కూరగాయలు, ఓ ఎకరంలో పళ్లు, అర ఎకరమంత గాడిబావి, ఓ ఎకరంలో జింకలు, ఇంకొన్ని ఎకరాల్లో కందులు, జొన్నలు, సజ్జలు, ఓ ఎకరంలో గుర్రాలు, ఓ ఎకరంలో నీ తలకాయ, చివరి ఎకరంలో ఆరడుగుల గొయ్యి, ఆ పక్కనే కట్టెలు, ఆయిలు డబ్బా....

అదిరా సంగతి.....ప్రస్తుతానికి ఈ ఎనిమిదిటితో బ్లాగు టపా సిరా అయిపోయింది.....బుద్ధి పుట్టినప్పుడు, సిరా తెచ్చుకున్నాక, మళ్లీ వస్తా....

ఎనిమిదన్నావు మధ్యలో ఊ మిస్సయ్యింది చూసావా?

ఊం.... :) :) మొత్తానికి టపా చదివావన్నమాట ఐతే!

శుభం! నీకు తిరుగులేదురా అబ్బాయి !

మఱి ఇరవైలో మిగిలినవేమున్నాయి? కొద్దిగా వివరిస్తావా?

వేదపాఠశాల స్థాపన, భాషా పరిరక్షణ, సురభి నాటక సమాజ పూర్వవైభవ స్థాపన....ఇలా....బోల్డు ఉన్నాయి స్వామీ!

Sunday, November 14, 2010

వడగళ్ళు - కృష్ణాపత్రిక - శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు

కృష్ణా పత్రికతో పరిచయం వున్నవారిని శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారెవరంటే ఇట్టే చెపుతారు. వడగళ్ళు రాసినాయనేగా అని. ఆయన 1938లో కృష్ణాపత్రిక సంపాదక వర్గంలో చేరారు. దాదాపు పధ్నాలుగు  సంవత్సరాలు పాటు హాస్యం వ్యంగ్యం జత కలిపి " వడగళ్ళు " శీర్షికతో పాఠకులకి వింతా - వినోదం పంచిన ధన్యజీవి. ఆ పైన ఎన్నో హాస్య రచనలు చేసిన రచయిత, గొప్ప సాహితీవేత్త.

ఒకటేమిటి - ఆనాటి రాజకీయాలు, అవకతవక ఉపన్యాసాలు, మారుతున్న సాంఘికాచారాలు, నవలోకం కోరుకునే మార్పులు, మతిమరుపు వ్యక్తుల విచిత్ర గాధలు, రాజకీయాలలో రగడలు, సంస్థలలో చెలరేగే దుమారాలు, కవుల కలాలు చిలికే మీగడ తరకలు, ఇలా ఎన్నో తళుకులు మెరిపించేవారు ప్రతి శనివారం విడుదల అయ్యే కృష్ణాపత్రికలోని వడగళ్ళు శీర్షికలో.

 వారి అమ్మాయి జ్ఞానప్రసూనగారు తెలుగు బ్లాగర్లలో చాలా మందికి తెలిసినవారే! శ్రీ రావూరు గారితో తాను పాల్గొన్న సభలోని ఈ చిత్రం తన పర్సనల్ ఆల్బం నుండి అందించిన శ్రీ సుధామ గారికి వేల ధన్యవాదాలతో


ప్రసంగిస్తున్నవారు శ్రీ రావూరు, కుడివైపు చివరన కూర్చున్నది శ్రీ సుధామ గారు 


వడగళ్ళు శీర్షికలోని కొన్ని వ్యాసాలు, క్రితం సంవత్సరం మొదట్లో వెబ్సైటులో ప్రచురించాను. ఆసక్తి ఉన్నవారు వ్యాసావళి సెక్షన్లో చదువుకోవచ్చు, ఆనందించవచ్చు.

భవదీయుడు
వంశీ

Saturday, November 13, 2010

రంగనాయకమ్మ గారి "స్వీట్ హోం" రేడియో నాటకంలోని కళాకారులు

రంగనాయకమ్మ గారి "స్వీట్ హోం" రేడియో నాటకంలోని కళాకారులు

నిలబడ్డవారు వరుసగా (ఎడమ వైపు నుంచి) - సర్వశ్రీ ఇలియాస్ అహ్మద్, సుధామ, డి.వెంకటరామయ్య, ఉమాపతి బాలాంజనేయ శర్మ

కూర్చున్నవారు (ఎడమ వైపు నుంచి) - శ్రీమతి ఇందిర, శ్రీమతి ఆకెళ్ల సీతాదేవి, శ్రీమతి జ్యోత్స్నా ఇలియాస్, వారి కుమారుడు సుధాకర్, డాక్టర్ పండా శమంతకమణి, శ్రీమతి ఇందిరా బెనర్జీ

పర్సనల్ ఆల్బం నుండి అపురూపమైన చిత్రాన్ని అందించిన సుధామ గారికి వేల కృతజ్ఞతలతో

Wednesday, November 10, 2010

ఉషశ్రీగారి గళంలో జాలువారిన పురాణాలు, ఐతిహాసికాలు - ఆడియోలు!

ఉషశ్రీగారి గళంలో జాలువారిన భాగవతము, రామాయణము, మహాభారతము ఆడియోలు అందించిన డాక్టర్ చెముటూరి నాగేంద్ర గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. వీరు యూనివర్సిటీ ఆఫ్ ఐయోవాలో పనిచేస్తున్నారు. 

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పురాణాలు - ఆడియో " లింకు నొక్కి వినవచ్చు

భవదీయుడు
వంశీ

Tuesday, November 9, 2010

చంకల రవికలో సొగసు దేనిది? చంకదా? రవికదా?

 
శ్రీ కవికొండల వేంకటరావుగారి గురించి తెలుగు సాహిత్యం అన్న మాట తెలిసినవాళ్లకు చెప్పాల్సిన పని లేదు.

ఆయన 1949 లో వ్రాసిన "హరివినోదము" అనే రచన నుండి సంగ్రహించిన "కంద కుక్షి" అనే భాగం ఇక్కడ చూడవచ్చు.


ఆ రచన నుంచి నా కుక్షిలో బాగా అతుక్కుపోయిన బోల్డు కందాల్లో కొన్ని కంద ముత్యాలు:


నల్లికి నెత్తురు సత్తువ
యుల్లికి వాసనలుసత్తు, వూరూరెగిరే
పుల్లాకుకు సుడి గాడుపు
లిళ్ళవెనుక సత్తువిచ్చు, నెవరెంత్రుహరీ?


పప్పున్నద యుప్పున్నద
ఇప్పొద్దున గూరగలద యేమే? యనుచున్;
ధప్పళమును వడియమ్ములు
తప్పక వేయించువాడు తగుగేస్తుండౌ.


పులికిం గ్రౌర్యము మిక్కిలి
చలిక్రౌర్యము దానిమించు జలిచే వణికె
యలనాయకు గవయని చెలి
పొలయలుకనుజెలగు క్రౌర్యము పులికె చలియౌ.
ఈ కింది ప్రశ్నలకు సమాధానమివ్వుడి -
నావి కావు, కవికొండల వారివే -


అప్పటికి వింతపోకడలు పోతున్న వేషభాషల గురించి ఆయన తన రీతిలో ప్రశ్నించిన తీరు చూడండి


చంకల రవికలో సొగసు దేనిది? చంకదా? రవికదా?
వంక కొప్పులో పొంకము వంకదా? తలదా?


 
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

చీవాట్లు కొన్నే పడాల్సి ఉన్నా అవి బోల్డు ఎందుకైపోయాయంటే?

మా కొలీగ్ కీత్ నైట్ అనే ఆయనతో రోజూ జరిగే మాటా మంతీ, పిచ్చాపాటీలో ఈవేళ "ప్లెడ్జ్ ఆఫ్ అలీజియన్స్" గురించి మాట్టాడుకున్నాం. ఈయన అమెరికన్ ఎయిర్ ఫోర్సు రెటైర్డ్ లుట్టెనెంట్ కల్నల్ (అర్థం కానివాళ్లకి - మనం లుట్టెనెంట్ ని లెఫ్టినెంట్ అని అంటాం). చిన్నప్పుడు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు, చదువుకునేప్పుడు ఎలాగుండేది అన్నీ వివరించుకొచ్చాడు. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

అందులో నా మనసుకు వేంటనే పట్టుకున్నది, నేను నా చిన్నప్పుడు ప్రతిరోజూ మా స్కూల్లో పిల్లలంతా అస్సెంబుల్ అయ్యాక చేసింది, చదివింది, పాడింది
అ) స్వామి వివేకానందుల వారి "నేషనల్ ప్లెడ్జ్"
ఆ) టాగూర్ వారి "జనగణమన"


కీత్ కూడా ప్రతిరోజూ చేసేవాడట ఈ పని...చాలా రోజులు మిలటరీ స్కూల్లో చదివినందుకు అక్కడ ఖచ్చితంగా ఇవి చదవాల్సిందే అయినా, మిలటరీలో చేరకముందు బయట స్కూల్లో కూడ చదివినప్పుడు అంటే సుమారు 1950-60ల్లో ఈ Pledge, Anthem రోజూ అమెరికన్ స్కూళ్లలో వల్లె వేయించేవారన్నమాట విన్నప్పుడు బోల్డు ఆశ్చర్యం కలిగింది నాకు.బోల్డు జ్ఞాపకాలు లేచొచ్చినాయి....

అ)సత్యవాణి టీచరుగారి పని పిల్లలంతా సరిగ్గా లైన్లో నుంచున్నారా లేదా అని చూడటం. నుంచోకపోతే చేతిలో ఉన్న బెత్తంతో చర్రున ఓక్కటేసి "ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు, లైనంటే గీత గీసినట్టు ఉండాలిరా, కట్లపాము లా కాదు. నుంచో సరిగ్గా నుంచో వెధవా!" అని ఆవిడ నోట్టో నుంచి వచ్చే మాటలు గిర్రున గింగిరాలు తిరిగేట్టు వినపడ్డాయి.

ఆ)ప్రతిరోజూ ఒక్కో విద్యార్థి చేత చదివించి, ఆ విద్యార్థి ఒక్కో లైను చదవటం - మిగిలిన పిల్లలు కోరస్ వెయ్యటం....అలా ఓ రోజు ప్లెడ్జీ నా భాగ్యం. ఆ భాగ్యాన్ని తట్టుకోలేని నేను ప్లెడ్జిలోని రెండో లైను తప్పుగా చదివి ఆ తర్వాత హెడ్మాష్టరు ముకుంద గారితో ఆవిడ ఆఫీసులో బోల్డు చీవాట్లు తిన్న సంగతి చక్రాలేసుకుంటూ ముందుకొచ్చి నిలబడింది.

అసలింతకీ ఆ తప్పు ఏమిటా? - రెండో లైనులో  I Love My Country బదులు ఆరోజు పొద్దున్నే కోదండం మావయ్య యూనిట్ టెస్టు పరీక్షల కోసం వల్లె వేయించిన Myself వ్యాసంలోని మైసెల్ఫ్ - కంట్రీకి బదులు నోట్టో నుంచి బయల్పడడం...చీవాట్లు కొన్నే పడాల్సి ఉన్నా అవి బోల్డు ఎందుకైపోయాయంటే, నేను చదవగానే నాతో పాటు ఇంకో 100 మంది మైసెల్ఫ్ అనటం మూలానన్నమాట...

ఇ) ఐతే అదే సంవత్సరం స్కూల్ వార్షికోత్సవాల సందర్భంగా వేసిన "అలెక్జాండర్" నాటికలో నేను వేసిన పురుషోత్తమ చక్రవర్తి వేషానికి ప్రథమ బహుమతి రావటం, అది ఆవిడ చేతుల మీదుగా తీసుకోడం ఓ మర్చిపోలేని అనుభూతి.

ఇంకా బోల్డు చక్రాలున్నాయి కానీ, అవి అన్నీ మీకెందుకు? నా దగ్గరే అట్టిపెట్టుకుంటా!

పిచ్చాపాటీ అయిపోయాక  కీత్ ఒక లింకు పంపించాడు...

ఇక్కడ చూడండి.....

ఇప్పటి మన దుస్థితే, వీళ్లకూ ఉందని తెలుసుకుని ఆనందపడాలో, బాధపడాలో అర్థం కాక ఊరకున్నా. దుస్థితా ? ఏమిటది అంటారా? రెడ్ స్కెల్టన్ గారి ప్రసంగంలో చివరి రెండు లైన్లు ఘాట్టిగా మళ్లీ ఓ సారి చదివి రండి...

భవదీయుడు
వంశీ

వ్యంగ్యాత్మక పైత్య ప్రకోపం అర్థమై చస్తే? - గుడ్డేనుగు అడుసు తొక్కినట్టే!

ఓ నాలుగు అర్థం కాని పదాలు గొలుసుకట్టుగా వ్రాస్తే కవి. ఓ పురాణపాత్రకు నూతనభాష్యం చెబితే పండితుడు. ఓ కొత్తవాదం పట్టుకొచ్చి నలుగురిని ఎగదోస్తే అది సాహిత్యం. ఈ ధోరణులు, వాటి కథాకమామీషూ సామాన్యుడికి అర్థం కావటం లేదు. అతడికి ’ఏదో’, ’ఎక్కడో’ లోపించిందని అనిపిస్తోంది.ఆ లోపించిన దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాడిలా...

 http://poddu.net/?q=node/767

ఎప్పుడో కిందటి వారం పడితే, ఇప్పుడా లింకిచ్చేది? అంతే బాబూ - కాలం మహిమ, తలరాత!!

శిరీష్ గారు ఓ రోజు ఈమెయిలు పంపించి పొద్దు కొత్తరూపం సంతరించుకుంటోందండీ, మీ తలలో రాత ఒకటి కావాలి నాకు అని అన్నారు. "పొరపాటులో అలవాటుగా" అచ్చోసిన ఆంబోతు వ్రాతలు ఏమి పంపిస్తాంలే అని ఊరకున్నా, ఆ తర్వాత ఆకాశవాణిలో పడి పూర్తిగా మర్చేపోయా. మళ్ళీ ఓ నెలరోజుల తర్వాత, శిరీష్ గారు ఓ మేకు, దాంతో పాటు ఓ సుత్తీ తీసుకుని వచ్చి తలలో దిగేసి ఏదీ నాకివ్వాల్సిన తలరాత అని అడిగారు. బోల్డు రగతం కారిపోయి, భోషాణమెత్తి అప్పుడప్పుడు నేను వ్రాసుకునే చిత్తుకాయితాల పత్రాల్లోంచి ఒకటి తీసి చూపించా! ఇప్పటికిది చాలు అని తీసుకెళ్ళి ఇక్కడ, అనగా పొద్దులో పొడిపించారు. భోషాణం మూతేసాసా! మూడొచ్చినప్పుడు , మేకులు దిగినప్పుడు మళ్ళీ మూత ఎత్తుతా...అదండీ సంగతి... క్ఌప్తంగా మాటా మంతీ సమాప్తం.

Monday, November 8, 2010

లక్షా తొంభైఏడు వేల ఆరువందల పుట్టిన రోజులా? You mean 1,97,600 Birthdays? Jeez!

1,97,600 పుట్టినరోజులు - ఈ రోజు పొద్దున్న ఆఫీసుకు చేరటంతో నా రోజువారీ ప్రియ నేస్తం పూర్తిచేసుకుంది. ప్రతి వాహనానికి నడిచిన ప్రతి మైలూ ఒక పుట్టినరోజని నా నమ్మకం. అనగా ఏ పార్టూ గిట్టకుండానూ, సక్రమంగా పనిచేసిన్నూ, తర్వాత వచ్చే మైలు పరుగుపందానికి సిద్ధమయ్యిన్నూ, అందులో ఉన్నోడి డెత్తు డే చెయ్యకుండానూ ఇంటికి క్షేమంగా చేర్చి ఇంట్లో వాళ్లను ఆనందడోలికల్లో ఊగులాడిస్తూ ఉండటమన్నమాట.

ఎక్కడికైనా వెళ్దామంటే నేనెప్పుడూ రెడీనే అంటూ భుజాల మీదికెక్కించుకుని పరిగెత్తే స్నేహితులు ఎంతమంది? దగ్గిర దూరమైతే తాగటానికి ఓ టాంకు ఆయిలు మాత్రం కొట్టించు, దూరాభారమైతే వగరుస్తునప్పుడల్లా నువ్వే చూసుకుని నా గొంతులో ఆ తులసి తీర్థం పోస్తూ ఉండు అని చెవిలో ఓ మాట పడేసి తాళంచెవి పెట్టగానే ఆనందంతో ఓ కేక వేసి, గోల ఎక్కువైతే నేను నొచ్చుకుంటానేమో అని సాధ్యమైనంత మెత్తగా, సుతిమెత్తగా శబ్దం లేకుండా పరుగులుపెట్టే స్నేహితుణ్ని చూస్తే ఎవరికి మటుకు కావులించుకోవాలనిపించదు?

1997లో పుట్టి, పదమూడేళ్ల లేతవయసులోనే తన కన్నా ఎన్నో ఏళ్లు పెద్దవాళ్లమైన నాకు, మా ఆవిడకు బోల్డు ప్రదేశాలు చూపించి, ఆ ఆనందం చూసి తను ఆనందపడిపోయే స్నేహితుడిని ఏమనుకునేది?

షికాగోలో నేను వెచ్చగా హీటర్లేసుకుని దుప్పట్లో తొంగుంటే, బయట బట్టల్లేకుండా గజగజ వణికిపోతూ నెత్తిమీద, ఒంటి మీదా బోల్డు మంచుతో కప్పబడిపోయి, పొద్దున్నే లేచి నే బూతులు తిట్టుకుంటూ ఆ మీద పడ్డ మంచంతా శుభ్రం చేసేంతవరకూ ఆ నా తిట్లు వింటూ, ఓపిక చూపించే స్నేహితులెంతమంది? ఆపైన ఆ చలికి నేను తట్టుకోలేనేమో అని  కూర్చున్నాక హీటరేసి నా ఒళ్లు వెచ్చగా అట్టిబెట్టే స్నేహితుడికి ఎంతని ఋణపడేది?

మెక్సికోకెళ్లి సియుడాడ్ హువారెజ్ లో హెచ్ వన్ వీసా స్టాంపింగు చేయించుకొద్దామంటే ఎగిరి గంతేసి, ఆర్కన్సాస్ లోని బెంటన్ విల్ల్ నుండి ఎల్ పాసో, టెక్సాస్ వరకూ 1900 మైళ్ళ రవుండ్ ట్రిప్పు పయనానికి సై అంటూ పొద్దున్నే ఐదింటికి మొదలెట్టిన పరుగు ఆపకుండా రాత్రి తొమ్మిదిన్నరకు హోటల్లో మమ్మల్ని వదిలి అప్పుడు ఆయాసం తీర్చుకున్న స్నేహితుడికి ఏమని చెప్పేది?

లాన్సింగు, మిషిగన్ నుండి 1400 మైళ్లు (రవుండు ట్రిప్పు) సెయింట్ పాల్, మిన్నెసోటా కు తీసుకెళ్ళి  అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నాడు చివరిసారిగా చూసిన స్నేహితుడిని మళ్లీ నా ముందు అలా అనాయాసంగా నిలబెట్టిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

లింకను, వాషింగ్టను, వైటు హవుసు చూద్దామని పోరితే ఓస్ - రవుండు ట్రిప్పు 1600 మైళ్లేగా - ఇంతేనా అని ఓ నవ్వు నవ్వేసి షికాగో నుండి ఓ గంతులో ఆ మహానుభావుల్ని చూపించిన ఈ స్నేహితుడికేమిచ్చేది?

అక్కడేదో పెద్ద ఆర్చీ ఉందిట , చూపిస్తావా అని అడిగితే ఓస్ ఇంతేగా అని రవుండు ట్రిప్పు 1000 మైళ్లు అలా అలా గాలిలో తేల్చుకుంటూ లాన్సింగు నుండి బయలుదేరి సెయింటు లూయిస్ చూపించిన ఈ స్నేహితుడికేమిచ్చేది?

అక్కడెక్కడొ కొలరాడొ నది భూమిని కోసిపారేసి ఈ లోతున గోతులు తీసింది, అవి చూపిస్తావా అంటే, బెంటన్ విల్ల్ నుండి గ్రాండ్ కాన్యన్ మధ్యనున్న రవుండు ట్రిప్పు 2300 మైళ్ల దూరాన్ని అలాగ్గా అలా పరిగెత్తుకుంటూ తీసుకెళ్లి చూపించిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

అదిగో అక్కడికెళ్తే క్యూబా కనపడుతుందిరా, చూపిస్తావా అంటే ఓ యెస్సంటూ 3200 మైళ్లు రవుండు ట్రిప్పుని మీదేసుకుని షికాగో నుంచి కీ వెస్టుకు తీసుకెళ్లి ఆనందంలో ముంచేసిన ఈ స్నేహితుడికేమిచ్చేది?

చూపించిన మిగిలిన చిన్న ప్రదేశాలనొదిలేసి, ఇహ మనం ఈ చలిని తట్టుకోలేమురా, చక్కగా పోయి కాలిఫోర్నియాలో ఉందాం అనగానే, చలైనా, వేడైనా, వానైనా నీతో ఎక్కడికైనా సరే అంటూ, వెనకాల సీట్లో - డిక్కీలో కుక్కగలిగినంత కుక్కేసిన సామానుకు బాధపడకుండా, షికాగో నుండి 2200 మైళ్ల దూరంలో ఉన్న శాక్రమెంటో నగరానికి రెండు రోజుల్లో చేర్చేసిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

పాప పుట్టాక గంతులేసి లాస్ ఏంజిల్స్ తీసుకెళ్లి హాలీవుడ్డు చూపించిన ఈ స్నేహితుడికి ఏమిచ్చేది?

ఇలా చెప్పుకుంటూ పోతూ ఉన్నా ఎంతో ఋణపడిపోయిన ఈ స్నేహితుడికి న్యాయం చెయ్యలేనేమో అన్న బాధతో!

ఇన్నేళ్లలో ఒక్క ట్రాఫిక్ టికెట్టు కూడా ఇప్పించని, ఇంటికి ప్రతిరోజూ క్షేమంగా చేరుస్తూ ఉన్న ఈలాటి స్నేహితుడు దొరికినందుకు ఆ భగవంతుడికి వేల దణ్ణాలతో !Sunday, November 7, 2010

ఎప్పుడు విన్నా ఏదో తెలియని ఆనందం! :)

తనవద్దనున్న సంగీతపు ఆడియోల భాండాగారం నుంచి శ్రీ కొమరవోలు శివప్రసాద్ (ఈల శివప్రసాద్) గారి  అపురూపమైన, అరుదైన ఈ క్రింది శాస్త్రీయ సంగీతపు ఆడియోలు అందించిన ప్రియ మిత్రులు శ్రీ కారంచేడు గోపాలం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

సకలగణాధిప - ఆరభి    
ఒకపరి - ఖరహరప్రియ    
కృష్ణ నీ - యమన్ కల్యాణి    
వినరో - శుద్ధ ధన్యాసి    
వందనము - షహన    
అలైపయ్యుదె - కానడ    
పిబరే రామరసం - చక్రవాకం    
గంధము పుయ్యరుగా - పున్నాగ వరాళి    
ఉయ్యాల - నీలాంబరి

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "శాస్త్రీయ సంగీతం ఆడియో " లింకు నొక్కి వినవచ్చు


గంధము పుయ్యరుగా ఎప్పుడు విన్నా ఏదో తెలియని ఆనందం! :)  పున్నాగవరాళి తీరే అంతేమో

భవదీయుడు
వంశీ

Thursday, November 4, 2010

చూడండి...నేడే చూడండి...ఆలసించిన ఆశాభంగం !!

ఓ రెండు వారాల క్రితం కామోసు అడిగాను....అంగీకరించారు కానీ, ఏ రోజున పంపిస్తారో తెలియలా....ఈ రోజు చూస్తే.....దీపావళి రోజున కానుకగా ఈ అపురూప చిత్రాలు, వాటికి సంబంధించిన వివరాలు అందించిన ప్రముఖ కార్టూనిష్టు, రచయిత, కవి, ఆకాశవాణి ప్రముఖులు శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో


రేడియో భానుమతి:మద్రాస్ ఆకాశవాణి లో తొలి తెలుగు డ్రామా వాయిస్/1938 జూన్ 16 న ప్రసారమైన తొలితెలుగు నాటిక 'అనార్కలీ'లో ఆవిడే అనార్కలి.కృష్ణశాస్త్రి  గారు సలీం.అయ్యగారివీరభద్రరావుగారు అక్బర్./1980 లో రిటైర్ అయ్యారు.భానుమతి గారి కూతురే అనౌన్సర్ జ్యోత్స్న.(జ్యోత్స్నా ఇలియాస్)
 


జోలిపాళెం మంగమ్మ:ఢిల్లీలో తొలి మహిళా న్యూస్ రీడర్ గా ప్రసిద్దులు.రిటైరు అయ్యారు


ఎం.జి.శ్యామలా దేవి:ఆకాశవాణి హైదరాబాద్ డ్రామా ఆర్టిస్టు. మొదట విజయవాడ  ఆ తరువాత 1960 నుండీ హైదరాబాద్.ఉదయతరంగిణి లో ఆవిడ తల్లి గా సుధామ కొడుకుగా. పుట్టపర్తి గారి అమ్మాయి నాగపద్మిని కూతురుగా శుక్రవారాల్లో ప్రసారమైన కుటుంబ సంభాషణ ఆ రోజుల్లో ప్రసిద్ధం.కన్యాశుల్కం నాటకం లో బుచ్చమ్మ  గా నటించింది శ్యామల గారే
మామిళ్ళపల్లి రాజ్య లక్ష్మి:ఢిల్లీ న్యూస్ రీడర్ గా పనిచేసి రిటైరయ్యాక  మదరాసులో స్థిరపడ్డారు.

శ్రీమతి శారదా శ్రీనివాసన్: జననం:1935 ఆగస్టు 18/రేడియో హీరోయిన్ అని పేరు ఆవిడకే.1959 లో హైదరాబాద్ ఆకాశవాణి లో డ్రామా ఆర్టిస్టు గా చేరారు.చలం గారి పురూరవ నాటకానికి ప్రానం పోసింది తనే.బంగారు కలలు సినిమా కు వహీదా రెహమాన్ కు డబ్బింగ్ ఇచ్హారు. వేణుగాన విద్వాంసులు ఎన్.ఎస్.శ్రీనివాసన్ వారి భర్త రేడియోలోసంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పనిచేసారు


ఏడిద గోపాలరావు: 1966 నుండి 19996 వరకూ ఢిల్లిలో వార్తలు చదివారు.మాస్కోలో 4 సంవత్సరాలు తెలుగు వార్తలు చదివారు.మంచి నటులు.గాంధీ వేషానికి పెట్టింది పేరు
శ్రీ.కొత్తపల్లి సుబ్రహ్మణ్యం: చేరింది:1954 ఫిబ్రవరి24.1956 నుండి 13 సంవత్సరాలు డిల్లీ న్యూస్ రీడర్ గా చేసి 1966 లో హైదరాబాద్ వచ్చారు


శ్రీ అద్దంకి మన్నార్ : పుట్టింది:1934/విజయవాడలో అనౌన్సర్ గా చేరింది:1959/1977లో 2 సంవత్సరాలు మాస్కోలోతెలుగు వార్తలు చదివారు


శ్రీ డి.వెంకట్రామయ్య:హైదరాబాద్ ప్రాంతీయ విభాగం లో ప్రముఖ న్యూస్ రీడర్.1963 నవంబర్ లో మొదట అనౌన్సర్.ఫ్రముఖ కథకులు. నాటకరచయిత.2010 రావిశాస్త్రి పురస్కార గ్రహీత. పంతులమ్మ సినిమా మాటల రచయిత.వార్తా పఠనానికి పేరుపొందారు


శ్రీ.దుగ్గిరాల పూర్ణయ్య:జననం:15.4.1936.1964 లో న్యూస్ రీడర్ గా చేరారు ఢిల్లిలో.1994 ఏప్రిల్ లో రిటైరయ్యారూ

శ్రీ జి.జె.రవివర్మ:జననం:17.9.1951 1971 లో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరారు.మంచి నటుడుగా ప్రముఖులయ్యారు.1983 లో  క్రీడావిభాగం ప్రొడ్యూసర్ అయ్యారు.1995 లో పదవి వదిలేసారు .
శ్రీ కందుకూరి సూర్యనారాయణ :జననం:29 జూలై 1936.1962 లో ఢిల్లీ వార్తావిభాగం లొచేరారు.మాస్కోలోనూ చేసారు.ప్రముఖ కవి కందుకూరి రామభద్రరావు గారికి వీరు కుమారుడు.
శ్రీ.ఎం.ఎన్.శాస్త్రి.: 1950 లో అనౌన్సర్ గా చేరారు.గ్రామస్తుల కార్యక్రమం తో ప్రముఖులు.చక్కని కంఠ స్వరంతో వారు 'గాంధీ మార్గం' సమర్పించడం శ్రొతలకు కలకాలం గుర్తు.ప్రస్తుతం ప్రసారభారతి మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా సుమన్ కు మామగారు వీరు.
మల్లంపల్లి  ఉమామహేశ్వరరావు: మద్రాస్ కేంద్రం ప్రారంభించక ముందే చేరిన తొలి తెలుగు అనౌన్సర్./రేడియో తాతయ్య గా ప్రసిద్దులు. 1977 మే 31 న రిటైర్ అయ్యారు.96 సంవత్సరాలు ఇప్పుడు.

పన్యాల రంగనాధరావు:చేరింది:1943 నవంబర్/డిల్లీ న్యూస్ రీడర్/1962 లో హైదరాబాద్ ఎ.ఎన్.ఇ. గా/మరణం:1987

ఎస్.బి.శ్రీరామ మూర్తి: విజయవాడ  కేంద్రానికి పదిసార్లు అఖిల భారత స్థాయిలో తన కార్యక్రమాలతో బహుమతులు తెచ్హి పెట్టిన ఒకేఒక అనౌన్సర్ ఈయనే.1970 లో మొదట విశాఖ లో చేరారు.1972 నుండి 2002 వరకూ విజయవాడలో పనిచేసి స్వచ్చందంగా  పదవీ విరమణ చేసారు.

Tuesday, November 2, 2010

లంకాయణం నాటకం / శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తి శ్రద్ధాంజలి - ఆకాశవాణి ఆడియోలు

ఆడియోలు - తెలుగుథీసిస్.కాం రంజని గారి  సౌజన్యంతో   

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
 


లంకాయణం నాటకం - విజయవాడ కేంద్రం ప్రసారం
రచన : పురాణపండ రంగనాధ్
నిర్వహణ : వారణాసి ఉదయభాస్కరమూర్తి
పునః ప్రసారం : 31 October 2010

శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తి శ్రద్ధాంజలి
హైదరాబాదు వివిధభారతి నుండి ప్రసారం 31 March 1992

శ్రీ ఆకెళ్ల సత్యనారాయణమూర్తి ఆకాశవాణిలో 17 March 1972 నాడు విధి నిర్వహణలో చేరారు. 17 March 1992 నాడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు ..


Note: Audios are played best in Internet Explorer.Since some of the audios are more than 50 mb, it might take a little time to buffer and play. Please be patient. If the audio does not play even after buffering, please pull the audio slider bar forward and it will start to play. Let me know if you still have trouble playing them and I will take a look at the problem! Thanks and Enjoy The Great Works Of Art!


భవదీయుడు
వంశీ

Monday, November 1, 2010

గంగులుగాడి నోట్టొ చిత్రమైన జాలం, అంతర్జాలం, మాయాజాలం

చిత్రమైన జాలం, అంతర్జాలం, మాయాజాలం

ఈ ఇంటర్నెట్టు అనేది చిత్రమైనది. చాలా చిత్రమైనది. మనుషుల్లో, స్వభావాల్లో తీసుకొచ్చే మార్పులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎంత ఆసక్తికరంగా అంటే విడమర్చి చెప్పలేనంత.  పరగడుపునే ప్రత్యక్ష నారాయుడి సేవ జేసుకుని.......అలా అలా ...మాడా గారి అలో అలో దాకా వెళ్లిపోయేంత. 

సపోసు ఒక వయసైపోయిన అవ్వో, అయ్యో  ఉంది/ ఉన్నాడనుకుందాం . బోల్డు కతలు, కవితలు  రాస్తుంటుంది/రాస్తాడు  అని అనుకుందాం. పోనీ తెలుగులో రాయటం ఎలాగో తెలీదులే, సాయం చేద్దామని సపోసు లేఖిని పరిచయం చేసామనుకోండి. అలా లేఖినిని బట్టుకోని, కూడలికెళ్లిపోయి, ఆనందభరితురాలైపోయి ఆ ఆనందం ఆసక్తిగా మారాక, బొరియలు తవ్వి బ్లాగొకటి మొదలెట్టి కొద్ది రోజుల తర్వాత అనుసంధానించబడున్న ఆ బొరియల్లో కిచకిచలాడుతూ కూర్చునున్న ఇతర బ్లాగెలకల్లోనుంచి ఓ భజన గుంపు పోగేసుకున్నాక, కీచు శబ్దం కాస్తా ఘీంకారమైపోయిన్నూ, అహం బ్రహ్మస్మిగా మారిపోయిన్నూ అసలుగా ఆ లేఖినిని పరిచయం చేసినవాడిని మర్చిపోయో, మర్చిపోకపోయినా మాట్లాడితే తూలనాడేంతో మార్పు వస్తుంది. 

ఇది ఓ రకం.

రెండో రకం ఎలకలో, కప్పలో ఉన్నాయి. 

ఇయ్యిటికి అవ్వ మీద కొద్దిగా తెలివెక్కువ. ఓ పేరొందిన, పోనీ అప్పుడే ఇకసిస్తున్న, ఇప్పటికి బాఘా ఇకసించేసిన ఆన్లైను మాగజైను ఉందనుకుందాం. ఈ ఎలక ఆ మాగజైను ఓనరు ఇంటో ఇంతకుముందు బొరియలు తవ్వెట్టగా, ఆ యజమాని ఉల్లిపాయ ముక్కెట్టిన్నూ, బోనులో పెట్టేసిన్నూ ఓ తాపు తన్ని బయటకు ఈడ్చవతల పారేసాడనుకుందాం. అప్పుడు ఈ ఎలక బయటకొచ్చి, ఆ ఆన్లైను మాగజైను పైకిరాటానికి నేనే కారణమని బయట చెప్పుకునేంతవరకూ వెళ్లి, అసలు ఆ పత్రిక్కు కాప్షను నేనే పెట్టాననీ, ఆ ఇంటి యజమానికి విశ్వాసం లేదనీ ఆ ఓనర్ని తూలనాడేంత వరకూ కిచకిచలాడ్తాదండే. ఎంత కిచకిచలాడినా, ఇంకే ఇళ్లల్లో ఎక్కడన్నూ ఆహారం దొరక్క మళ్లీ ఆ పాత ఓనరు ఇంటికే కాళ్లు ఈడ్చుకుంటూ పోయి పాత బొరియల్లో కాలం గడుపుతూ ఉండాల్సొస్తుందండే.

ఇగ తదుపరి ఇసేషాలు మా గంగులుగాడి నోట్టొ ఇనండే! ఈడికి నా కాడ ఉన్న సంగతులన్నీ తెల్సండే ! అయ్య బాబోయి నాక్కూడా వీడి యాస వచ్చేస్తోందేంటిరా భగవంతుడా ! రక్ష రక్ష పాహిమాం !

ఐరనీ ఏమనగా ఆ మాగజైను ఓనరూ తక్కువోడు కాదు. ఆ వ్యక్తి ఇతర వెబ్సైట్లూ, ఫేసుబుక్కులోనూ, ట్విట్టర్లోనూ, కూడలీలో పహారా గాస్తూ, ఎక్కడ మెటీరియల్ దొరుకుతుందా, ఆ మెటీరియల్ ఇచ్చినోడి ఇవరాలు ఆయా వెబ్సైట్లలో బట్టుకోని ఆడికి ఏకంగా ఫోన్ జేసేసి, ఏవండే కష్టపడి మీ ఇవరాలు సంపాదించానండే. యాడ్నుంచి అని అడగమాకండి, ఎన్నో ఎబ్సైట్లు అయ్యీ ఎతికి ఎతికి పట్టుకున్నా, ఏ ఎబ్సైటో నాకు ఇప్పుడు గ్యాపకం లేదండే, అయితే మటుకు మీరు దయ ఉంచి మా పత్రిక మొగాన ఓ కవళం పడెయ్యండే అని దేవురిస్తాడు. ఈడి గోల పడలేక అవతలోడు సిసలు వెబ్సైటు ఓనరును దొబ్బులెట్టి, ఎటు మింగలేక ఆడి జ్ఞాపకాలన్నీ ఈ ఓనరు గాడి మాగజైను మీద కక్కుతాడు. అప్పుడు ఆడి పనీ సరీ, ఈడి పనీ సరీ, చదువరుల పనీ సరీ, అసలు సిసలు ఎబ్సైటు ఓనరు గాడి పని హరిలో రంగ హరి!

ఇగ ఇంగో రకం ఎలకలు - ఈ కుర్రకుంక ఎలకలు మొదలెట్టకముందే కొన్ని ఎలకలు గుంపు గూడి ఓ పత్రికెట్టి - ఆళ్లల్లో ఆళ్లే వ్యాసాలు రాసేసుకుని ఇవతలోడిని సున్నంలోకి ఎముకల్లేకుండా గొట్టేసి, అవునండే సున్నంలోకి ఎముకలే - గొట్టి ఇవతలోడినెవ్వుడినీ రానీకుండా మా పత్రిక్కి ఓ స్టాండర్డుందండే, మీ అభిప్రాయాలు జెప్పాలంటే ముందు మా ముసలి జక్రవర్తులకో ఇన్నపం పంపించాలా. మీరు పంపించాక రాజుగారికి  తీరికుంటే మిమ్మల్ని లోనికి రానిమ్మని జెప్తాడు..ఆరు జెప్పాక, మీ తోలు తెల్లదా, మాతో కలిసేదా కాదా తెల్సుగోటానికి ఉతికి ఆరేసి ఏధిస్తాం.అందుకు సిద్ధం కాపోతే ఇంగో రకంగా హెరాసుమెంటు జేత్తాం అని బెదిరిస్తా ఉంటారన్నమాట నిఖార్సైన నిజమని ఓ మార్జాలం, అనగా గోడమీద పిల్లి జెప్పగా ఇన్నమాట.

ఇగ ఇంగో రకం కప్ప - ఈ కప్ప ఉండే బాయిలో బోల్డు బంగారం ఉంటాదని ఇనికిడి ఒగటి, ఆపైన ఆ కప్ప బెకబెకలొగటి. బెకబెక గోలతో నిజంగానే బంగారముందేమో అన్నంత ఫీలంగు వచ్చేత్తాదన్నమాటండే! అయ్యి - ఆ బెకబెకలు నిజమా అన్నట్టు అప్పుడప్పుడు బంగారం కుండలో నుంచేనండే ఓ పూత ఇసిరేత్తా బాయిలో ఉన్న ఇతర కప్పల్జేత అరిపింపజేసి ఇసుగు పుట్టించి నువ్వే సామ్రాట్ కప్పవనిపింపజేస్తాదండే! పొరపాట్న ఏదన్నా అడిగామనుకోండే, ఇగ ఆడు తెలుసా నీకు, ఈడు తెలుసా నీకు, ఆడు రాసిన పుస్తకాలు దెల్సా నీకు, ఆళ్లంతా అంతర్జాలం గురించి నా దగ్గిర శిష్యరిగం జేసినోళ్లే...గావాలంటే అడిగిత్తా, పోటేపిత్తా అని గుంతలకిడి మాటలు మాట్టాడతాడండే!... ఐతే ఆడికి నచ్చినోళ్లకి, కాళ్ల మీద బుఱద సాపు జేసినోడికి బంగారం ఇసిరేత్తా ఉంటాడండే! జివరికి నే పొయ్యేలోగా నా బంగారమంతా ఎవుడికో ఇచ్చి పోతా అని ఓ తెగ ఇదిగా జప్తా ఉంటాడండే!  సివరాకరికి సెప్పెదేంటంటే మాటలు తప్పితే పని తక్కువండే!

ఈ మొదటి బాగం ఇక్కడితో ఆపేత్తానండే ! మళ్లా రేపో ఎల్లుండో ఇంగో రగం ఎలక్కాయల ఇసేషాలతో వత్తానండే

గంగులు


Friday, October 29, 2010

శ్రీ గుడిపూడి శ్రీహరి పరిచయ కార్యక్రమం / శ్రీ బూదరాజు రాధాకృష్ణ జ్ఞాపకాలు ప్రసంగ కార్యక్రమం

ఆడియోలు - తెలుగుథీసిస్.కాం రంజని గారి  సౌజన్యంతో   

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
 
బ్రహ్మాండమైన విశేషాలున్నాయి ఈ రెండు కార్యక్రమాల్లో

భవదీయుడు
వంశీ

Thursday, October 28, 2010

AIR Seeks Material For Website Archive! - The Hindu News - ఈ లైన్లు మటుకు పట్టి చదవండి!ఈరోజు హిందూ లో వార్త

మొత్తానికి కలలు నిజాలవుతున్నాయన్నమాట.....

వార్త అందించిన మిత్రులు పి.వెంకట రమణ గారికి బోల్డు కృతజ్ఞతలతో 

వార్తలోని ఈ లైన్లు మటుకు పట్టి చదవండి....
"
AIR is also inviting persons who have been associated with the organisation in any manner and their descendents, public and other institutions to share any material---textual, photographic, audio or even memories and anecdotes—available with them.The material will be acknowledged/returned with thanks after suitably digitising them
"

ఆశ్చర్యం కలిగిస్తుంది....ఎంతమంది వద్దనున్నవి పంచుకుంటారో అన్నది చాలా ఆసక్తికరమైన విషయమే ! ఎన్ని ఆణిముత్యాలు బయటకొస్తాయో చూడాలి.....


వంశీ 

Wednesday, October 27, 2010

ఆకాశవాణి కళాకారుల సంక్షిప్త జీవితాలు - 100 రూపాయలు మాత్రమే !!


ఆకాశవాణి కళాకారుల సంక్షిప్త జీవితాలు చక్కగా గుదిగుచ్చి రేడియో అభిమానుల అందుబాటులోకి తెచ్చిన అంబడిపూడి మురళీకృష్ణ గారు, మడిపల్లి దక్షిణామూర్తిగారు  ఎంతైనా అభినందనీయులు.

పుస్తకం: వాచస్పతి
వెల : 100 రూపాయలు
ముద్రణ: కళాజ్యోతి ప్రాసెస్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రతులకు: 402 ప్రేమ సాయి అపార్ట్మెంట్స్
శ్రీనగర్ కాలనీ, హైదరాబాదు - 73

ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చింది అన్నిటికన్నా చక్కనైన ఆయా కళాకారుల చిత్రాలు....

ఈ ప్రతిని నాకు ఎంతో అభిమానంగా అందజేసిన శ్రీ పి.వెంకట రమణ (అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్) గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో

ఇప్పుడో ప్రశ్న -

ఈ బొమ్మెవరిదో చెప్పుకోండి...అలాగే "ప్రసార ప్రముఖులు" అనే మంచి రచన ఒకటి ఉన్నది - ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ అనంత పద్మనాభరావు గారు వ్రాసింది - ఈ పుస్తకంలో బోల్డు ఆణిముత్యాల్లాంటి వివరాలు, కళాకారులు, ఆర్టిస్టులు, ఆకాశవాణి కేంద్రాలు, ఆకాశవాణి మూలస్థంభాలు, ఆకాశవాణి పుట్టుపూర్వోత్తరాలతో సహా!

వెబ్సైటులో ప్రసార ప్రముఖులు సెక్షన్లో చూడవచ్చు..

భవదీయుడు
వంశీ

Tuesday, October 26, 2010

ఆకాశవాణిలో ఎవరా దంపతులు? ఏమా కథా? - Part 1

ఆకాశవాణిలో పనిచేసిన దంపతుల ఫొటోలు పరిచయం చేయటం ఈ మొదటి భాగం ఉద్దేశం...

ఆకాశవాణిలో తొలి జంట (దంపతులు)  లేదా ప్రముఖమైన జంట - రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు అని అనవచ్చునేమో. 


శ్రీ న్యాయపతి రాఘవరావు గారు, శ్రీమతి న్యాయపతి కామేశ్వరి గార్ల గురించి ఆకాశవాణి అభిమానులకు  చెప్పాల్సిన పని లేదు...చిత్ర సౌజన్యం: balanandam.co.in

ఆ తర్వాత నాకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న జంటల్లో ముందుగా ఇలియాస్ అహ్మద్, జ్యోత్స్న గారి చిత్రాలు. అడగగానే చిత్రాలు అందించినందుకు ఇలియాస్ గారికి సహస్ర కృతజ్ఞతలు...

ఇలియాస్ అహ్మద్ గారు ముప్ఫై ఏళ్ళు ఆకాశవాణిలో (1972 - 2002) పనిచేసారు. తన సుమధుర కంఠంతో ఎంతో మందిని అలరించిన ఇలియాస్ గారు జ్యోత్స్న గారిని వివాహమాడారు. జ్యోత్స్న గారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో అనౌన్సరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. దంపతులిద్దరూ నవలా రచయితలన్న విషయం ఎంతమందికి తెలుసో కానీ, రచనా రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. చిత్రాలు ఇక్కడ.....
అలాగే శ్రీ అల్లంరాజు వెంకటరావు (సుధామ), శ్రీమతి ఉషారాణి (1991 నుండి ప్రోగ్రాం ఎక్సెక్యూటివ్) దంపతుల చిత్రాలు ఇక్కడ.. ప్రఖ్యాత కార్టూన్ చిత్రకారులు, రచయిత, కవి  అయినటువంటి సుధామ గారి గురించి మరింత వివరంగా వెబ్సైట్లో చదవండి ...అడగగానే చిత్రాలు అందించినందుకు సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలు...చిత్రాలు ఇక్కడ....

త్వరలో ఇతర జంటల చిత్రాలు మీ ముందుకు - ఎవరా దంపతులు? ఏమా కథా? వీరే

అ) శ్రీ.ఎన్.ఎస్.శ్రీనివాసన్ (సంగీత విభాగం ప్రొడ్యూసర్), శ్రీమతి శారదా శ్రీనివాసన్
ఆ) ఆకెళ్ల సత్యనారయణ (నటుడు - నాటక రచయిత) , శ్రీమతి ఆకెళ్ల సీత
ఇ) శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్,  శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి
ఈ) శ్రీ ఎన్.బాబూ రావు, శ్రీమతి ఝాన్సీ కె.వి.కుమారి
ఉ) శ్రీ మంత్రివాది మహేశ్వర్, శ్రీమతి వసుమతి
ఊ) శ్రీ కలగా కృష్ణమోహన్, శ్రీమతి పరిమళ
ఎ) శ్రీ రాఘవరెడ్డి, శ్రీమతి పులికంటి అమృత
ఏ)....
ఐ)....
ఒ)...
ఓ)....
ఔ) ష్...ష్...సస్పెన్సన్నమాట

డాక్టర్ అనంతపద్మనాభరావు గారు తన రచన ప్రసార ప్రముఖులు లో - "వీరిని ప్రసార ప్రేమికులనవచ్చు. ఇది ఆకాశవాణి ప్రత్యేకత" అని అంటారు...

ఇతర ప్రసార ప్రముఖుల చిత్రాలు - వెబ్సైట్లో "ప్రసార ప్రముఖులు" సెక్షన్లో చూడవచ్చు

భవదీయుడు
వంశీ

దేశప్రజలకు ఆకాశవాణి, దూరదర్శన్ ల బహిరంగలేఖఅక్టోబరు 26న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన "ఆకాశవాణి / దూరదర్శన్ ప్రోగ్రాం స్టాఫ్" ఆవేదన

జయహో ప్రసార భారతి , జయహో భారత ప్రభుత్వం!

వార్త అందించిన మిత్రులు వెంకట రమణ గారికి కృతజ్ఞతలు 

Monday, October 25, 2010

"వడ్డెర చండీదాస్ రచనలు - తత్త్వం" ఆకాశవాణి పరిచయ కార్యక్రమం

"శ్రీ వడ్డెర చండీదాస్ రచనలు - తత్త్వం"

ఈ అంశం మీద హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం లో తత్త్వశాస్త్ర ఆచార్యులుగ పనిచేస్తున్న డాక్టర్ అడ్లూరి రఘురామరాజుగారితో పరిచయ కార్యక్రమం 

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రసారం
పరిచయకర్త : శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx, AIR)
ప్రసారం తేదీ : 23 October 2010
ఆడియో - రంజని గారి (తెలుగుథీసిస్.కాం) సౌజన్యంతో   

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
 
ఏదేమైనా ఆసక్తికరమైన విషయాలున్నాయి ఈ పరిచయ కార్యక్రమంలో

భవదీయుడు
వంశీ

శ్రీ వి.ఏ.కె.రంగారావు గారితో ఇంటర్వ్యూ

ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ చల్లా కృష్ణమూర్తి గారి కుమార్తె, డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారు తన పరిశోధక గ్రంథం "ఆంధ్రదేశ సంస్థానాలు - సంగీత వాఙ్మయం" లో ఆయా సంస్థానాల సంగీతపోషణ గురించి విస్తృతంగా వివరిస్తారు. తన పరిశోధనలో భాగంగా చాలా మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు కూడా చేసారు.

ఆ ఇంటర్వ్యూ లు సంక్షిప్తంగా తన పుస్తకంలో ప్రచురించారు. ఆ ఇంటర్వ్యూలలో ఒక ఇంటర్వ్యూ - శ్రీ వి.ఏ.కె.రంగారావు గారితో ఉన్నది. ఆ ఇంటర్వ్యూ భాగం ఇక్కడ చూడవచ్చు. అడగగానే ఆ ఇంటర్వ్యూను, పుస్తకాన్ని  వెబ్సైట్లో ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు డాక్టర్ చల్లా విజయలక్ష్మి గారికి సహస్ర కృతజ్ఞతలు.

మిగిలిన ఇంటర్వ్యూలు కూడా త్వరలో పి.డి.ఎఫ్ లుగా మీ ముందుకు

పూర్తి పుస్తకం "సంస్థానములు" సెక్షన్లో చూడవచ్చు. ఈ పుస్తకంపై సర్వ హక్కులు డాక్టర్ చల్లా విజయలక్ష్మిగారికే చెందుతాయనీ, ఎవరైనా వాడుకోదలిస్తే ముందుగా వారి అనుమతి తీసుకోవాలని తెలియచేసుకుంటున్నాను.


భవదీయుడు
వంశీ

Wednesday, October 20, 2010

ముస్లిములు - ఫ్రాన్సు - మేకపోతు గాంభీర్యం ??

ముస్లిములు ఫ్రాన్సుని చాపకిందనీరులా ఆక్రమిస్తున్నారా?
ఫ్రెంచి గవర్నమెంటు తెత్తెన్నా మెమ్మెమ్మే నా?
విడుదల చేసే ప్రకటనల్లోది మేకపోతు గాంభీర్యమేనా?

చూడండి, వినండి -

http://downloads.cbn.com/cbnnewsplayer/cbnplayer.swf?aid=17933


ఈ వీడియోలో ఒకాయన అంటాడు....

We Expected Islam to Adapt to France Instead France Is Adapting to Islam

ఆలోచిస్తే... :) :)

అప్పుడెప్పుడో ముస్లిం సోదరులను కాపాడటానికి "అధ్యక్ష క్లింటను" వారు సెర్బుల మీద బాంబులేసారట. అరబ్బులను మందలు మందలు మందలుగా పదాతి దళాలలో చేర్చి యుద్ధ రంగానికి పంపించారట...


వివాదం లేపాలనుకునే వాళ్ళు వివాదాస్పదమైన కామెంట్లు తీసుకెళ్ళి మీ బ్లాగుల్లో పోసుకోండి....ఇక్కడ వ్రాయొద్దు.... ఏమిటి అర్థమయ్యిందా?

నచ్చనివి నిర్దాక్షిణ్యంగా తీసిపారెయ్యటమే! తర్వాత మొత్తుకున్నా ప్రయోజనం శూన్యం...

Tuesday, October 19, 2010

ఆ భాగ్యం కలిగించండి మహప్రభో !

మొత్తానికి 52 సంస్థానాల వివరాలు పూర్తయ్యాయి...ఎక్కడ?

ఇక్కడ....


లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "సంస్థానములు" లింకు నొక్కి ఆనందోబ్రహ్మ

కొద్దిమంది రాజావార్లను చిత్రరూపంలో దొరకపుచ్చుకోవటం నా శక్తికిమించిన పనయ్యింది...

అవి తక్క మిగిలిన సంస్థానాల పేజీలు బోసిగా కనపడవచ్చు...

ఆయా రాజావార్ల చిత్రరాజాల దర్శన భాగ్యం ఎవరన్నా కలిగిస్తే అందుకు వారికి కృతజ్ఞుడిని....

ఒకావిడ కొన్ని చిత్రాలు ఇస్తానన్నారు కానీ ఆవిడ అలా ఏరులోకి వెళ్ళి తెప్ప ఎక్కి సముద్రతీరప్రాంతానికి వెళ్ళిపోయారు...ఆవిడ ఆ తెప్ప మీద తిరిగిరావటం ఎప్పుడో...రాజావార్ల చిత్రాల దర్శన భాగ్యం ఎప్పుడో

భవదీయుడు
వంశీ

Saturday, October 16, 2010

మా ఆవిడ గొంతులో వడ్రంగి పిట్ట పొడిచింది

విజయ దశమి రోజున మా ఆవిడ - శ్రీదేవి - గొంతులో వడ్రంగి పిట్ట పొడిచింది. అవును "పొడిచింది".

ఇహ మీరు ఆ సంగతి ఇక్కడ వినాల్సిందే...

ఇంకొన్ని జంతువులు కూడా పొడిచేసినాయి కానీ, ముందు ఇది విన్నాక సంగతి చెబితే - మిగతా జంతువులేమిటో, ఆ పొడుపుడు విశేషాలేమిటో - అన్నీ మీ ముందుకు రావడానికి తయారుగా ఉన్నాయి........మీదే ఆలస్యం...

ష్ ష్....ఓ సంగతి....ఈ వడ్రంగి పిట్ట చేత నేనే పొడిపించా..కసి తీరా!

లేపోతే కర్నాటక సంగీతం నేర్చుకుని కూడా నాకు ఏ సాయంత్రంపూటైనా అలా ఓ సారి ఆహ్లాదంగా ఓ పాట పాడి వినిపించవమ్మా అంటే, మూతి ముప్ఫై వంకర్లు తిప్పుకుంటూ పోతుంది... అందుకు పెంచుకున్న కసి ఇలా తీర్చుకున్నానన్నమాట..

భవదీయుడు
వంశీ

Wednesday, October 13, 2010

ఏంటిదీ - మూడు కాళ్ళ తాబేలు బొట్టు పెట్టుకుందా?

నాన్న - ఏలియన్ ప్రిన్సెస్స్ కథ చెప్పాడు
వాళ్ళను గీసిపారేసి చూస్తూ కూర్చున్నా ! 
 
నాన్న - పెద్ద పిల్లి బొమ్మలు రెండు వెయ్యమన్నాడు 
వాటితో పాటు చిన్న మిక్కీ, చిన్న పిల్లి కూడా వేసేసా!
పిల్లి - ఎలుక ఫ్రెండ్స్ అంటే నాన్న వినడే!
ఒకే పేజీలో వేసేసా అందుకే! రాత్రి బూచాళ్ళ కథ చెప్పాడు నాన్న
వాళ్ళ పేర్లు లంబు, జంబు, నింబు అట!
ఇల్లు కట్టేసా!
మా కారు పార్కింగులో పెట్టేసా !
ఓ ! అమ్మకు కళ్ళజోడు ఉంటే ఇలాగుంటుందన్నమాట
ఇప్పుడు కళ్ళజోడు లేదు కానీ - నేను ఊహించేసా!
ఏంటిదీ? తాబేలుకు ఎక్కడన్నా మూడు కాళ్ళుంటాయా? 
పైగా బొట్టు పెట్టావేంటి అని అడిగాడు నాన్న!


ఇంకా నేర్చుకుని బోల్డు బొమ్మలు గీసిపారేద్దామనుకుంటే, మా ఊళ్ళో నాలుగున్నరేళ్ళ వాళ్ళని డ్రాయింగ్ క్లాసుల్లో తీసుకోరని చెప్పాడు నాన్న....ప్చ్చ్....బయట ఇంకెక్కడైనా టీచర్ ఉన్నారేమో చూస్తాను అని అన్నాడు...తొందరగా దొరికితే బాగుండు..


వైష్ణవి 

Saturday, October 9, 2010

ఆకాశవాణి - 80వ దశకం - ప్రత్యేక భక్తి రంజని ఆడియో

దేవీ నవరాత్రులు మొదలయ్యాయి.....అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ విషయంలోకి వచ్చేస్తే  

80వ దశకంలో ఆకాశవాణి వారు దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రసారం చేసిన ప్రత్యేక భక్తి రంజని కార్యక్రమం ఇదిగో ....

ఎక్కడ? ఇక్కడ....

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ దేవీ నవరాత్రుల ప్రత్యేక భక్తి రంజని వినవచ్చు....

ఆడియోలు అందించిన రంజని గారికి (తెలుగుథీసిస్.కాం) హృదయపూర్వక కృతజ్ఞతలతో

భవదీయుడు
వంశీ

Sunday, October 3, 2010

కాలయంత్రం (1982 ఆకాశవాణి నాటకం) - హెచ్.జి.వెల్స్ "టైం మెషీన్" స్ఫూర్తి

ఆంగ్ల రచయిత హెచ్.జి.వెల్స్ "టైం మెషీన్" స్ఫూర్తితో శ్రీ కె.చిరంజీవి గారు వ్రాసిన నాటకం ఇది. ఇరవైదేళ్ళ తర్వాత మనుషులు సమాజం ఎలా ఉండబోతున్నాయో ఊహిస్తూ వ్రాసిన నాటకం.

ఆకాశవాణి వారు 1982 లో తొలిసారిగా ప్రసారం చేసారు.
పునః ప్రసారం: అక్టోబరు 3, 2010

ఈ నాటకంలోని పాత్రలు ధరించింది వీరే:
సర్వశ్రీ
ఎన్.రవీంద్రారెడ్డి
డి.హనుమంతరావు
కె.హనుమంతరావు
పి.నారాయణ
డాక్టర్ పి.రామారావు
డాక్టర్ సి.నరసింహ
రత్నాసాగర్
శారదా శ్రీనివాసన్
కె. చిరంజీవి
వాణి రెడ్డి

సంగీతం: ఎం.చిత్తరంజన్, ఎన్.ఎల్.సుభాష్, మనోజ్ కుమార్

సాంకేతిక సహకారం: నజీర్ అహ్మద్, విశ్వనాథం, వి.ఎస్ వాసన్

(1961 - 1993) కాలంలో ఆకాశవాణి హైదరాబాదు నాటక విభాగ కళాకారుడిగా పనిచేసిన శ్రీ కె చిరంజీవి గారు రాసిన ఆ నాటకం ఇదిగో మీ కోసం.

శ్రీ రంజని గారి (తెలుగుథీసిస్.కాం) సౌజన్యంతో.
ఈ ఆడియోను అందించిన ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ నాటకం చూడవచ్చు, వినవచ్చు....

భవదీయుడు
వంశీ

Thursday, September 30, 2010

ఎమ్మెస్ - కె.ఎస్ - డి.ఎస్ - బేబీ సరోజతమిళ డైరెక్టరు కె.ఎస్.సుబ్రహ్మణ్యం, ఆయన భార్య డి.ఎస్.సుబ్బలక్ష్మి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, బాలనటి బేబీ సరోజ ల చిత్రం

మిత్రులు ఆలన్ బార్ట్లే గారి సౌజన్యంతో (మార్కస్ బార్ట్లే గారి కుమారుడు)

Wednesday, September 29, 2010

ఆకాశవాణి - శారదా శ్రీనివాసన్‌ గారి పరిచయ కార్యక్రమం
మహానటి సావిత్రి కళ్లలో నవరసాల్ని ఒలికిస్తే ఈమె తన గళంలో పలికిస్తారు. ఆమె చిత్రజగత్తు నేలిన అభినేత్రి అయితే ఈమె ఆకాశవాణి వాచకాభినేత్రి. 1960-90ల మధ్య కాలంలో రేడియో నాటకం విన్నవారు ఆమె వాచకాన్ని, అలలలలుగా వినబడే ఆ నవ్వుని మరిచిపోవడం అసంభవం. పురూరవలో ఊర్వశిగా, సుప్తశిలలో అహల్యగా, కాలాతీతవ్యక్తుల్లో ఇందిరగా, భాగ్యనగరంలో భాగమతిగా, కంఠాభరణంలో సుబ్బలక్ష్మిగా ... కొన్ని వేల పాత్రలకు రేడియోలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన శారదా శ్రీనివాసన్‌గారి జ్ఞాపకాలు ఆంధ్రజ్యోతి వారు అక్షర రూపంలో పదిలపరిస్తే, స్వరంలో ఆకాశవాణి వారు 2008 వ సంవత్సరంలో పదిలపరచారు. ఆ ఆకాశవాణి పరిచయ కార్యక్రమాన్ని రికార్డు చేసి పంపించిన మిత్రులు శ్రీ రంజని (తెలుగుథీసిస్.కాం) గారికి హృదయ పూర్వక ధన్యవాదాలతో...

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ కార్యక్రమం చూడవచ్చు, వినవచ్చు....

ఆంధ్రజ్యోతి వారన్నారు, వార్తన్నారు, వ్యాసమన్నారు మరి - అదెక్కడ ఉందా? పరిచయ కార్యక్రమం మొదటి భాగం పేజీలో !

భవదీయుడు
వంశీ

Sunday, September 26, 2010

రావు బాలసరస్వతి - రంగనాయకమ్మఇష్టా గోష్టి

"వేదికపై నాటకం రసవత్తరంగా జరుగుతోంది. ఒక ప్రధాన పాత్రధారి రామనాధశాస్త్రిగారు ఆ సందర్భాన పాడవలసిన పాటను ప్రారంభించారు. ఇంతలో ఆహుతుల్లోంచి 4ఏళ్లపాప ఆ పాట నాకునూ వచ్చు నేను పాడతాను అంటూ గట్టిగా అరిచింది. పెద్దలు ఎవ్వరూ చెపినా వినదే! నేనూ పాడతానంటూ మారం చేసింది. చివరికి రామనాధశాస్త్రిగారు ముచ్చటపడి ఆ పాపను స్టేజిపైకి పిలిచి ఆ పాటను ఆమెచేతే పాడించారు. ప్రేక్షకులంతా కరతాళధ్వనులు చేశారు. అభినందనలు అందించారు. ఆశీర్వదించారు.మరో రెండేళ్లకే ఆ అమ్మాయి ఒకేసారి 2సోలో రికార్డులు పాడిన పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసింది. ఇదంతా 1934నాటి మాట. ఆ అమ్మాయి సంగీతవనంలో మొదటిసారిగా 'లలిత సంగీతమనే పుష్పాన్ని పూయించిన తోటమాలి. ఇప్పుడు ఆ స్వరకేళికి 80ఏండ్లు. కానీ రావు బాలసరస్వతీదేవి పేరు దక్కిన ఖ్యాతి నిలిచేను వెయ్యేళ్లు." - "వార్త" పత్రికలో రావు బాలసరస్వతి గారి మీద ప్రచురించిన వ్యాసంలోని మాటలివి.

పాటలు అనే పదార్ధం ఇష్టం ఉన్నవారెవరికైనా ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదనే ఇంతవరకూ అనుకుంటున్నాను. అలాగే మనకున్న రచయిత్రుల్లో రంగనాయకమ్మ గారి గురించీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరి గానకోకిల రావు బాలసరస్వతి గారు - రచయిత్రి రంగనాయకమ్మ గారు ఇష్టా గోష్టి కార్యక్రమంలో పాల్గొంటే ఏలా ఉంటుంది ? ఆ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 1992 లో. అదే కార్యక్రమాన్ని ఈ నెల 25వ తారీకున పునః ప్రసారమూ చేసింది.

ఆ పునఃప్రసార అవకాశాన్ని ఒడిసిపట్టుకుని "రంజని" గారు ఆ ఆడియోను రికార్డు చేసి వెబ్సైటులో పబ్లిష్ చెయ్యమని పంపించారు. అందుకు రంజనిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో...

లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి - ఆ సెక్షన్లో ఆ కార్యక్రమం చూడవచ్చు, వినవచ్చు....

ఆనందో బ్రహ్మ

మళ్ళీ బ్లాగు దర్శన ప్రాప్తిరస్తు, పునఃప్రాప్తిరస్తు
సందర్శకులకు సందడీ పుణ్య ప్రాప్తిరస్తు

భవదీయుడు
వంశీ

Sunday, June 27, 2010

అవి బాలేవన్నాడు.... ప్చ్చ్..ప్చ్చ్..

నా సంతకం పెట్టేసి "మైలీ" బొమ్మ వేసానోచ్! అన్నిటికన్నా ముందు, తల పెన్సిల్తో వేస్తే సరిగ్గా కనపడలేదే! అందుకు - నాన్న తెచ్చిన కొత్త పెన్నులు తీసి గాట్టిగా నొక్కి పట్టుకుని, మళ్ళీ దాని మీదే గీసేసా!

ఇవ్వాళ్ళ ఇంకో ఐదు బొమ్మలేసాను కానీ నాన్న అవి బాలేవన్నాడు. ప్చ్చ్..ప్చ్చ్....నాలుగేళ్ళకు అంతేగా మరి!!.....అందరూ దబాయించేవాళ్ళే!....అంతేగా మరి!!.

Thursday, June 24, 2010

ఆయిలు - అధ్యక్షులు

గొఱ్ఱె జనాలు ఎక్కడైనా ఒకటే అని చక్కగా చూపించారు...జాన్ స్టీవర్ట్ - Brilliant As Usual :)

ఆయిలు - అధ్యక్షులు

మాహానుభావుల్లారా, మార్తాండతేజుల్లారా, మీడియా దిగ్గజాల్లారా - రవిప్రకాశ్, రామోజీరావు మొదలైనవారు వింటున్నారా? ఇలాటివి బయటకు తియ్యండి - జనాలకు చూపిచ్చండి - ఈ జన్మలో కొద్దిగానైనా పుణ్యం కట్టుకోండి.....

Monday, June 21, 2010

1894 సంవత్సరానికే 156,000 కాపీలు అమ్ముడుపోయిన తెలుగు పుస్తకం

సీగేట్ వారి 350 జి.బి ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవు దాదాపు నిండుకోవడంతో - దాన్ని క్లీను చేస్తుంటే ఇది కనపడింది. ఫైలు డేటు చూస్తే 2007లో అని ఉంది. :) .. గుర్తు కూడా లేదు, ఎక్కడినుంచి వచ్చిందో...

విషయానికొస్తే - క్రిస్టియన్ లిటరేచర్ సొసైటి - ఎస్.పి.సి.కె ప్రెస్స్ మద్రాసు వారు 1894లో ముద్రించిన "తెలుగు పాఠముల మొదటి పుస్తకము" పుస్తకం అట్ట ఇది. 1894 సంవత్సరానికే 24th Edition, 6,000 - Total Copies 156,000 (156,000 సరిగ్గా చూడండి)..
ఈ పుస్తకం దేనికి సంబంధించిందో తెలీదు కానీ, ఔత్సాహికులు - ఇదే ఇదే తెలుగులో మొదటి పుస్తకం అని అరుస్తూండగా విన్నాను. నిజమెంతో తెలియదు. వేపేరి ప్రెస్సూ, పుట్టుపూర్వోత్తరాల సంగతులూ తెలుసు కానీ ఈ పుస్తకం గురించి ఇతర వివరాలు తెలిసినవాళ్ళు పంచుకోవచ్చు.

యాదృచ్ఛికంగా ఇది మూడొందల యాభయ్యో పోష్టు :)

Wednesday, June 9, 2010

"పంగనామం - బుంగనామం" - సమాధానాలు !!

1) గొడుగుని పట్టుకునే కర్రనేమంటారు ? - "కామ"

2) కర్రలేని గొడుగునేమంటారు ? - "గిడుగు" - ఐతే ఇప్పుడు ఈ ఇంటి పేరున్న మహానుభావులెవరో చెప్పండి చూద్దాం!

3) తెర్లించు అంటే నీళ్ళను మరిగించటం - మరి తొర్లించు అంటే? - సమాధానం చెప్పేసారు కాబట్టి మళ్ళీ చెప్పనఖ్ఖరలా

4) పంగనామం అంటే అందరికీ తెలుసు - మరి బుంగనామం అంటే?
తెల్ల నామానికీ, ఎర్రనామానికీ ఎడం లేకుండా ఉంటే దాన్ని బుంగనామం అంటారు

5) ఈడుముంత అంటే? - పాలు పితికే గిన్నె

6)కొట్నం - వడ్లు దంపటం

7)మండ కంచం - అంచు కట్టించిన కంచము

8)బొక్కెన పట్టుకునే ఇనప కడ్డీనేమంటారు? - వల్లిగము

Tuesday, June 8, 2010

పంగనామం - బుంగనామం !!

ఇవి తెలుసా మీకు ? :) ఒకేళ తెలీకపోతే సమాధానాలు రేపు -

1) గొడుగుని పట్టుకునే కర్రనేమంటారు ?

2) కర్రలేని గొడుగునేమంటారు ?

3) తెర్లించు అంటే నీళ్ళను మరిగించటం - మరి తొర్లించు అంటే?

4) పంగనామం అంటే అందరికీ తెలుసు - మరి బుంగనామం అంటే?

5) ఈడుముంత అంటే?

6) కొట్నం అంటే?

7) మండ కంచం అంటే?

8) బొక్కెన పట్టుకునే ఇనప కడ్డీనేమంటారు?

"కుక్కటము" - "లింగ" పదాలు .....

ఈ పదాలకు "లింగ" పదాలేమిటో చెప్పండి - ఎక్కడా చూడకుండా :)

ఉదాహరణకు - "అతడు - ఆమె"

భ్రాత
భవుడు
ఖగము
జామాత
కరి
వాయసము
కుక్కటము
మత్స్యము
శరభము
పుండరీకము
పటువు
రక్తము
మార్జాలము
మర్కటము
సూకరము
కచ్ఛపము
సుతుడు

అలాగే ఈ శబ్దాలకు బహువచనమేమిటో చెప్పండి..

పైఁడి, వెండి, మొన్న, నిన్న, రేపు, మాపు, గండఁడు

అదే నోటితో ఈ శబ్దాలకు ఏకవచనం చెప్పండి...

వడ్లు, పెసలు, కురులు


"లింగాల" సమాధానాలు తెలీలేదా అయితే....ఇక్కడ చూడండి....
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

స్వస
భవాని
ఖగి
స్నుష
కరిణి
వాయసి
కుక్కటి
మత్సి
శరభి
పుండరీకి
పట్వు
రక్త
మార్జాలి
మర్కటి
సూకరి
కచ్ఛపి
సుత


ఏకవచన / బహువచనాల సంగతి తీరిగ్గా తర్వాత.. :)

Saturday, June 5, 2010

ఈ పాట గుర్తుందా ? ఈయనెవరో తెలుసా?

"సీతారాముల కల్యాణము చూతము రారండీ" - పాట గుర్తుందా ? గుర్తులేకపోతే యూట్యూబులో వెతకండి.. ఏ తెలుగోడి ఇంట్ళో అయినా సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరిగితే తప్పకుండా వినపడే పాట...పెళ్ళిళ్ళు జరిగినంతకాలం - ఎప్పటికీ వినపడే సంగీత ముత్యాల మూట (ముత్యాల మూట వినపడుతుందా?)


అలాటి ఆణిముత్యాన్ని అందించిన సంగీతం మాష్టారు ఎవరో తెలుసా ? - శ్రీ గాలిపెంచల నరసింహారావు
ఈ పాటే కాక ఇంకా బోల్డు ముత్యాలని అలాగ్గా అలా సినీ సంగీత ప్రపంచంలో దొర్లించిన ఆయన ఫోటోనే ఇది..."గానకళ" అని ఆయన రాసిన పుస్తకంలో కనపడితే కత్తిరించి ఇక్కడేసానన్నమాట..

Thursday, June 3, 2010

పుస్తకం చదవకుండా, అందులోని కథ చెప్పే ప్రయత్నం!!!

మామూలుగా అందరికీ తెలిసింది ఇది అని నా ఊహ...... :)

తోక పోయి
కత్తి వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కత్తి పోయి
కట్టె వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కట్టె పోయి
దోసె వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
దోసె పోయి
డోలు వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం


డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సంకలనం చేసిన న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) గారి రచనలు - "భోగిపళ్ళు" పుస్తక రూపంలో ఉన్నాయి...ఆ పుస్తకం తిరగేస్తూ ఉంటే ఈ పైన ఉన్నదే ఇంకో రకంగా కనపడింది...

ఆవు పోయి
గొర్రె వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
గొర్రె పోయి
కోడి వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కోడి పోయి
కుక్క వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
కుక్క పోయి
డోలు వచ్చె
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం
ఢాం ఢాం ఢాం

ఐతే ఏమిటంటారా?

వస్తున్నా - అక్కడికే వస్తున్నా

ఇక్కడ "ఆవు పోయి ....." అని రాసినదాన్ని బట్టి, పుస్తకం చదవకుండా, కథ చెప్పే ప్రయత్నం చెయ్యండి...

అలాగే మీకు తెలిసిన మీ "లోకల్ వర్షన్" ఏదన్నా ఉంటే తెలియచెయ్యండి :)


"తోక పోయి...." దీని వెనక కథ చూడాలంటే ఇక్కడ నొక్కి, అందులో ఢాం ఢాం ఢాం అని ఉన్న లంకె మీద నొక్కండి

నాలుగేళ్ళ వైష్ణవికి కంఠతా వచ్చు, ఏవి ? "తోక పోయి" పద్యం - కథానూ.. ఇహ మీ కథ చూడటమే తరువాయి... :)

Wednesday, June 2, 2010

జమీందారీ వ్యవస్థ గర్హింపదగిందే - అయినా!!!

ఆంధ్రదేశం చాలా కాలం రాజాశ్రయాన, జమిందారీ ఆశ్రయాన మూడుపూవులు ఆరుకాయలుగా వర్ధిల్లింది.

ఆంధ్ర సంస్థానాలు - సాహిత్యపోషణ అనే రచనలో ఆచార్య తూమాటి దొణప్పగారేమంటారంటే - "జమీందారీ వ్యవస్థ గర్హింపదగిందే అయినా, ఆయా జమీందారులు ఉన్నత సంప్రదాయాలను పోషిస్తూ - సాహిత్య సంస్కృతులకు పరిరక్షకులుగా చేసిన సేవ మాత్రం విస్మరింపరానిది." అలాటి సంస్థానాధీశుల చిత్రాలను తెలియనివారికి పరిచయం చేయటం పనిగా పెట్టుకుని ఈ భాగం ప్రారంభించాను -

సంస్థానాధీశుల వివరాలు

ఓం ప్రథమంగా "అమ్మమ్మగారి ఊరు" - మా చల్లపల్లి (దేవరకోట) సంస్థానాధీశులు శ్రీ శివరామప్రసాద్ బహద్దర్ గారి చిత్రం పొందుపరచాను.

మీ వద్ద ఇతర సంస్థానాధీశుల వివరాలు, చిత్రాలు ఉంటే తప్పక పంపించ ప్రార్థన

Sunday, May 30, 2010

స్వర సుధాకరులు - ఆకాశవాణి - చిత్రాలు

శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారు తన సాహిత్యాభిమానిబ్లాగులో పెట్టిన "రేడియో కళాకారుల" చిత్రాలే కాక ఇతర ఫోటోలు కూడా పంపి నన్ను ఎంతో ఆశ్చర్యంలోనూ, ఆనందంలోనూ ముంచేసారు. వారికి బోల్డన్ని..బోల్డన్ని..బోల్డన్ని కృతజ్ఞతలు.

ఇక్కడ నొక్కండి - అక్షర చిత్రాలు

ఒకమాట మటుకు చెప్పాలె - శ్రీ అద్దంకి మన్నార్ గారి గొంతు విని మైమర్చిపోతూ ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ణి. భగవంతుడు ఇంత మంచి గాత్రం ప్రసాదించాడు - మనిషి ఎలా ఉంటారో అని! శివరామప్రసాద్ గారి పుణ్యమా అని ఆ అందగాణ్ణి చూసే భాగ్యమూ, వెబ్సైటులో పెట్టుకునే పుణ్యమూ దక్కినాయి. ధన్యోస్మి...ధన్యోస్మి...

మీరెవరి వద్దైనా ఇలాటివి ఉండి పంచుకోవాలనుకుంటే, maganti dot org at gmail dot com కు ఈమెయిలు పంపించండి....అలా పంచుకోవాలనుకున్న మహానుభావులకు ముందస్తు వందనాలు - ధన్యవాదాలు.

Wednesday, May 26, 2010

మీ కడుపు సొరంగమా? ఐతే !!!

మా రామారావు - చూస్తే చీపురుపుల్లంత, కాకుంటే నోళ్ళు గీక్కునే తాటాకంత బక్కపలచగా ఉంటాడు. కానీ భోజనానికి కూర్చుంటే ఆరు నిండు పళ్ళాలు (పెద్దిస్తరాకులంతటివి) ఉఫ్ఫున లాగిపారేస్తాడు. మహానుభావుడు. ఆ సర్వలోకరక్షకుడు "తిండేశ్వర స్వామి" వారిని సదా స్మరిస్తూ తన పూర్వాశ్రమంలో ఘోరమైన తపస్సు చేసి మేరు పర్వతంతో సహా ఏ పదార్థం భుజించినా అరాయించుకునే శక్తీ, వరమూ పొందిన మహామహిమాన్వితుడు, భక్తాగ్రేసరుడు. ఆయనతో ఒక సాయంత్రం, అదీ వారింట్లోనే వారి పక్కన నా సమయాన్ని గడిపే అవకాశం ఈ మధ్య లభించింది. నేను మాటల్లో వివరించలేని అదృష్టం చేసుకుని ఉంటేనో, నా పూర్వజన్మలో పట్టలేని సుకృతమో చేసుకుని ఉంటేనో తప్ప - అలా ఒక సాయంత్రం పూట ఆయన (రామారావు) పక్కన కూర్చునే అవకాశం వస్తుందనిన్ని. వారితో పాటు భోజనంచేసే అవకాశం నన్ను వరిస్తుందనిన్నీ కలలో కూడా అనుకోలా. ఆ అవకాశం కూడా చాలా అనూహ్యంగా నా పాల బడింది. వివరాల్లోకి ఎందుకు గానీ, ఆ అవకాశం వచ్చినందుకు, నన్ను వరించినందుకు ఎంతో తబ్బిబ్బు అయిపోయాను.

పిచ్చాపాటీ అయ్యింది. తేనీరు సేవించడం అయ్యింది. పుస్తకాల గురించీ, ఆయన "బాతు"రూము రాగాల(కూనిరాగాల) గురించీ, బ్లాక్ అండ్ వైటు సినిమాల గురించీ, నాటక రంగం గురించీ మాటలయ్యాయి. ఏడున్నర అవడంతోనూ శ్రీమతి రామారావు గారు భోజనానికి లెమ్మని చెప్పడంతోనూ ఆయన వాక్ప్రవాహానికి అడ్డుకట్ట పడి "భోజన" ప్రవాహం, ప్రహసనం మొదలయ్యింది. సముద్రానికీ, రామారావుకు అడ్డుకట్టలు వెయ్యటం/కట్టటం ఈ భూప్రపంచకంలో సాధ్యమయ్యే పనికాదని నా ప్రగాఢ నమ్మకం. ఇంతవరకూ వమ్ము కాలేదు. ఇకముందు అవుతుందన్న ఆశా లేదు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి, ఆవిడ చేతి వంట అమృతప్రాయమే. గత ఇరవైదేళ్ళుగా ఒరే అంటే ఒరే అని పిలుచుకునే చనువు గల మా రామారావు అలా భోజనప్రియుడిగా, ఎంత తింటున్నాడో కూడా తెలీకుండా విస్తళ్ళు విస్తళ్ళు లాగించి "ఉపమ" కుదరకపోయినా బాన బాణాసురుడిలాగా పెంచిన్నూ, బకాసుర వేషంలోకి పరకాయప్రవేశం చెయ్యటానికిన్నూ పూర్తి బాధ్యత ఆవిడదేననిన్నీ, ఆవిడ వంటదేననన్నీ ఘాట్టిగా నొక్కి వక్కాణించి చెప్పొచ్చు.

ఓం ప్రథమంగానూ, పనిలో పనిగానూ అసలు వడ్డించిన వంటకాలేమిటో చెప్పి తరువాత ఆయన వీరావేశంతో అవిక్రపరాక్రమంగా అలెక్జాండరును నిలువరించిన పురుషోత్తముడిలా వాడైన దంతాలతో తన "భోజన"దాడిని ఎలా విజయవంతంగా సాగించాడో వివరించటానికి / మొదలెట్టటానికి నిశ్చయమయింది కావున మీరు అలా అలా చదూకుంటూ పోండి. మొదటగా ఎనిమిది గ్లాసుల రైసుకుక్కరులో 8 గ్లాసులూ సోనామసూరి బియ్యం పోసి వండిన అన్నం, తెల్లగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతూండగా, రామారావుకు నాలుగు పెద్ద కరుళ్ళు, నేను అభ్యంతరం చెప్పగా ఒకటే పెద్ద కరుడు వేసి పక్కనే గుత్తివంకాయ కూర వడ్డించగా ఆ ఘుమఘుమలకే సగం కడుపు నిండింది. అదేమిటి ఘుమ ఘుమలు అప్పటిదాకా రాలేదా అని అడుగుతున్నారా? వారి 4000 అడుగుల ఇంట్లో వంటశాల ఓ మారుమూల ఉండడం మూలానూ, ఆ వంటశాలలో ఈవిడ వంటల మహత్యం తెలిసిన మా రామారావు చాలా బలమైన ఎగ్జాష్టు పెట్టించటం మూలానూ, మేము కూర్చున్న హాల్లో మానసికోల్లాసం కోసం మా రామయ్యగారు టార్గెట్టులో ఆరోజే కొన్న గ్లేడ్ వత్తులు/కొవ్వొత్తులు ఆరు వెలిగించడం మూలానూ కొద్దిగా వంటల ఘుమ ఘుమలు ముక్కుకు పట్టలేదనే చెప్పాలి.

సరే సరే...తరువాయి వంటకం - ఆవపెట్టిన పులిహోర, పైగా షార్టుకట్టు నిమ్మకాయ కాకుండా చింతపండు పులిహోర - ఆహా ..మ్మ్మ్..మ్మ్మ్...మ్మ్మ్...అందులోనూ పొద్దున్నే ఆవపెట్టగా, సాయంత్రానికి వచ్చే రుచితో ఇంకేది సాటి? ఆ తర్వాత వడ్డించిన వంటకమేమనగా కంది పచ్చడి, అందులోకి పోసుకోడానికి వేడి వేడి పచ్చిపులుసు - వంకాయ ఒవెనులో బ్రహ్మాండంగా కాల్చి, ఎన్నో ఉల్లిపాయలేసి, బోల్డంత ఇంగువేసి పైనుంచి వాళ్ళమ్మమ్మ వాళ్ళింట్లోనుంచి తెచ్చుకున్న రాచిప్పలోపోసి కళ్ళెదురుగా పెడితే ఎక్కడికో పరుగులెత్తాల్సొచ్చింది. ఎక్కడికి బాబూ ? మా చల్లపల్లికి బాబూ, మా అమ్మమ్మగారింటికి బాబూ...అసలు పరుగెందుకు బాబూ అనడుగుతారా?... హ్మ్మ్ ...హ్మ్మ్మ్...హ్మ్మ్....సరే పచ్చిపులుసు పోసుకుని అదేదో లోకాలకు వెళ్ళి అక్కడ విహరిస్తూండగా, "ఆ ఆవడలు ఇటు తీసుకురా వాణీ" అన్న రామారావు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డా....మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోతూ ఉండగా అనుభవించిన ఆనందం చెప్పలేనిది. కాకుంటే వెరైటిగా ఆవిడ పైనాపిలు అనగా అనాస ముక్కలు కూడా ఆ పెరుగులో నానబెట్టి ఆవడలతో పాటూ వెయ్యగా ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ తరువాత వేసిన గడ్డపెరుగులో నంచుకోటానికి "ఆంధ్రమాత" అందించిన ఆనందం ఏమని చెప్పేది.

ఇవి అన్నీ అయ్యాక, మా రామారావు ధాటికి మూడురోజులకో బాక్సు అయిపోయే మావిడి పళ్ళ బాక్సులోనుంచి మాంచి కాయలు - అనగా అటు దోరా కాక, ఇటు మగ్గిపోయినవీ కాక ఉన్న ఒక నాలుగు మావిడిపళ్ళు తీసి ముక్కలు కోసి "డిజర్టు" కింద లాగించగా, (ఆ నాలుగిట్లో నేను తిన్నది ఒక్కటే అని మనవి) - ఇహ మీరే ఊహించుకోవచ్చు..

ఈ పై వంటకాలన్నిటికీ విడివిడిగా స్టాండర్డు కరుళ్ళు నాలుగు మా రామారావుకు, ఐతే ఇప్పుడో ప్రశ్న పాఠక జనాలకు - మొత్తం రామారావు తిన్న కరుళ్ళు ఎన్ని? తప్పుడు సమాధానం చెప్పారో మీ పొట్ట నాలుగు చెక్కలయ్యి సొరంగంలో పడిపోవుగాక అని శాపం.

ఇహ అసలు సంగతికొస్తే భోజన సమయంలో రామారావుకు నాకూ జరిగిన సంభాషణ

రా: ఈ పైవాడికి బుద్ధి లేదురా

నే: ఏ పైవాడు, ఎవడికన్నా పైన పోర్షను అద్దెకిచ్చావా?

రా: ఎహె కాదురా, పైవాడంటే ఆ పైవాడు - దేవుడు

నే: ఏమిటి? ఏమయ్యింది ఇప్పుడు ఆయన మీద పడ్డావు?

రా: మనకు అసలు ఇంత చిన్న పొట్ట ఇవ్వటంలో ఉద్దేశమేమిటీ అని!

నే: ఉన్న ఒక్క చిన్నదాన్ని నింపటానికే బోల్డు కష్టాలు కదరా. ఎంతది కావాలి నీకు ?

రా: ఎహె ఊర్కో! ఎక్కువ తిందామంటే పట్టదూ చావదూ. ఓ పెద్ద సొరంగం లాటిదో, ఏడెనిమిది గదుల్లాటివో ఉంటే ఎంత బాగుండు.

నే: హహహ....హహహ...ఏమిటీ మళ్ళీ చెప్పు

రా: నీకు నవ్వులాటేరా. మాంచి పదార్థాలు తిందామంటే ఈ చిన్నదాన్లోకెట్లా ఎక్కించేది. సూదిలో దారం లాగా ఉంటే ఎట్లా. సూది బదులు గునపమైతే బాగుండేది కదరా!

నే: అలాగ సొరంగాలుంటే ఇహ రాత్రీ పగలూ లేకుండా ఎన్నైనా లోపలెయ్యొచ్చు అంటావు

రా: అంతేగా. దాంతో పాటు ఎన్ని వీశెలు తిన్నా అలా లటుక్కున అరిగిపోయేట్టు ఏదన్నా రుబ్బురోలు లాటిది కూడా మన పొట్టలో పెట్టాలి.

నే: హ్మ్మ్మ్...

రా: హ్మ్మ్మ్...ఏమిటి...హ్మ్మ్...ఏమిట్రా - అలాగే ఐదారు పేద్ద ముద్దలు ఒకేసారి అలా నోట్టో వేసుకుందుకు ఓ పేద్దనోరు కూడా ఇస్తే బాగుండేది

నే: అప్పుడు మనల్నిమనం మనుషుల జాతి అని పిల్చుకోలేమేమోరా

రా: పోనీ ఎవడిక్కావాలి. చక్కగా కావాల్సింది కడుపుకు తినలేకపోతే మనుషులైతే ఏమిటి? మురుగుకాల్వైతే ఏమిటి?

నే: ఒరే ఎక్కడికో పోతున్నావు....

రా: $%%^&

నే: ఒరే! ఆపరా బాబూ - తిననీ

రా: $%్**

నే: హహ...సరే లే!


ఇలా ఇంకా బోల్డంత సంభాషణ జరిగింది....క్లుప్తంగా మీ కళ్ళముందుంచటమూ అయ్యింది. తరువాతి భాగంలో తరువాయి సంభాషణ ...

ఇహ శలవు తీసుకుని బయలుదేరుతుండగా "లక్ష్మి" ఎదురొచ్చింది. లక్ష్మి ఎవరు? ఏమా కథా? లక్ష్మి మా రామారావు గారి ఎనిమిదేళ్ళ కుమార్తె. అసలు పేరు "భాగ్యలక్ష్మి". పేరుకు తగ్గట్టే చక్కగా ముద్దుగా మరింత బొద్దుగా అలరారే చిన్నమ్మి. నేను రెండేళ్ళ క్రితం ఓసారి "భాగ్యం ఇలా రామ్మా" అన్నానని మిస్సెస్ రామారావు ఒక ఆర్నెల్లు నాతో మాట్టాడాలా. వేరే ఉద్దేశమేదీ లేదండీ అని చెప్పినా సరే, ఉహూఁ - వినలా. తర్వాత్తరవాత ప్రతాదివారం పిల్లలకు నేను చెప్పే తెలుగు పాఠాలకు పంపిస్తూ, "భాగ్యం" భాఘా తెలుగు నేర్చుకుని పద్యాల్లోకి దిగిపోయాక ఆవిడ కోపం తగ్గిందన్నమాట. ఇంతకీ ఆవిడకు కోపం రాటానికి కారణమేమనగా - భాగ్యలక్ష్మి అన్న పేరు "వాణి" వాళ్ళ అమ్మమ్మ గారి పేరని , అలా ఎవరైనా భాగ్యం అని పిలిస్తే వాణి గారి చేతిలో రాచ్చిప్ప ప్రత్యక్షమవుతుందనీ - భాగ్యాన్ని "భాగ్యం" అని పిలిచేదాకా నాకు తెలియదు. కాకుంటే నేను "భాగ్యం" అన్నప్పుడు రాచ్చిప్పను చూడలా.

చెప్పొచ్చేదంటంటే - ఎవరికైనా అజీర్ణం చేసో, తిన్నదరక్కో (రెండూ వేరు వేరు - అందులో సందేహమేమీ లేదు) బాధలు పడుతుంటే మా రామేశ్వరులను దర్శించుకోండి. పుణ్యలోక ప్రాప్తిని పొందండి

PS: రామారావూ - ఇదిగో నువ్వడిగిన పోష్టు - మళ్ళీ ఇదంతా రాసానని నన్ను ఏకొద్దు - అడిగావూ - ఐతే నీ ఖర్మ అని ముందే చెప్పా! ఈ పోష్టు నీకే జన్మజన్మాలకూ అంకితం...పళ్ళాల, పదార్థాల ఫోటోలు పెట్టలేదు, దిష్టి కొడుతుంది అని...క్షమించు..