Wednesday, December 23, 2009

కే.సీ.ఆర్ గారి పృచ్ఛకత్వం ! "కాఖాగాఘాకిజ కాటన్నాయాటీజ" ట

ఈనాడువారు చిదంబర "అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు" రహస్యాన్ని బట్టబయలెందుకు చెయ్యాలన్నట్టు, చేస్తే ఆఫీసు అద్దాలెక్కడ పగులతాయన్నట్టు, ఎవరో వచ్చి ఎవరి బొమికలో విరక్కొడతారన్నట్టు "రాష్ట్రంలో తక్షణం శాంతిని నెలకొల్పండి : చిదంబరం" లో అతితెలివిగా కలిపేసి చేతులు దులుపుకున్నారు. లేపోతే వారు రామోజీరావూ ఎందుకవుతారు , అది ఈనాడు ఎందుకవుతుంది?

ఈ సంప్రదింపుల ఎత్తుకోళ్ళ, దింపుకోళ్ళ పరిణామం ఆశించిందే అయినా, మళ్ళీ బందులతో, పనిలో పనిగా ప్రభుత్వ ఆస్తులతో, విద్యార్థుల - ప్రజల జీవితాలతో ఆడుకోవటానికి భూత ప్రేత పిశాచ గణాలు శివాలెత్తుతూ తయారైపోతున్నాయి. పరిస్థితి అంతా అదుపులోనే ఉందంటూ ప్రకటనలు చేస్తూ, బూచిని చూపెట్టినట్టుగా భూ.ప్రే.పి గణాలతో కుదుర్చుకున్న లోపాయకారీ ఒప్పందంలో భాగంగా (ప్రస్తుతానికి గాసిప్పు మాత్రమే - కానీ నిజమైనా అయ్యుండొచ్చు!) చంద్రహాస దరహాసంతో ఆ సుందరవదనారవిందమ్మీద ముసిముసినవ్వులు పూయిస్తూ - 144 సెక్షను విధించడమైనది అని చేతులు దులుపుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు.
(అసలుగా వెనకమాల జరుగుతున్న ఏదో పేద్ద గూడుపుఠాణీ అనిన్నీ, కాంగిరేసు ఎదుర్కుంటున్న ఇతర సంక్షోభాల నుండి దారిమళ్ళించే ఊదుడు గొట్టమనిన్నీ కూడా గాసిప్పులు మరి! )

కొద్దిగా అయినా చైతన్యం వున్నవారెవరన్నా, అలా వీలుకాకపోతే రక్షక భటులన్నా - ఈ ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారిలో ముగ్గురినో నలుగురినో తీసుకెళ్ళి, తగలబడుతున్న ఆ ఆస్తుల్లోకి తోసిపారేసి బయటకు రాకుండా కాపలా కాసి మాడిమసైపోయేటట్టు చేస్తే మిగతా భూ.ప్రే.పి మూకకు బుద్ధి వస్తుందేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూంది.

ఎవరి ఆస్తి వారికి ప్రాణం, ఎవరి ప్రాణం వారికి ప్రియం. సంయమనం కోల్పోయి, మా ఆవేదన పట్టించుకోకపోతే హింసే శరణ్యం అంటే, ఆ హింస మీ ఆస్తుల మీద ముందు చూపించుకోండి అని ఆ పరమపిత ఉద్ఘాటిస్తున్నాడు. నిన్న నిజాము హయాములో మీకు జరిగింది, ఈవేళ ఇతరుల మీద చూపిస్తున్నారనుకోవాలా కొంపదీసి ? సోదరుల ఆవేదన అర్థవంతమైనదే అనుకున్నా,రాష్ట్రంలోని అనేకంగా వున్న ఇతర వెనకబడిన ప్రాంతాల ప్రజలతో కలిసి, ఒక కార్యాచరణ రూపొందించుకునో, పని చెయ్యని నాయకులకు తన్నోపదేశమో చెయ్యాలి కానీ...ఇదేమి వైనం? ఇదేమి విపరీతపు పోకడలు?

తెలంగాణా ప్రాంతాల్లానే రాష్ట్రంలోని 60 - 70 శాతం ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదన్నమాట విస్మరించి "మూడు కాళ్ళ కుందేలు ముడ్డిలో మూతెట్టుక్కూర్చుంటే ఎట్టా?"

ఈ ముష్కర మూకల్లో విద్యార్థులుండడం మరింత శోచనీయం.

ఇక రాజీనామాస్త్రాన్ని కె.సి.ఆర్ మహాశయులవారు పాపం చిక్కి శల్యమైన పొదిలో మిగిలిపోయిన బక్కచిక్కుళ్ళ అస్త్రాల్లోంచి తియ్యలేక తియ్యలేక తీసి "మూతాండీవం" ఎక్కుపెట్టి వినోదం తిలకించటానికి తయరైపోతున్నారని మరిన్ని వార్తలు ఈనాడువారి సౌజన్యంతో తెలిసినాయి ఇప్పుడే..సంతోషం.. ఛానళ్ళవారికి, బ్లాగుల్లో దిక్సూచి లేకుండా తిరిగే వాదులకు కావలసినంత పని, బుర్ర వున్నవాళ్ళకు ఆవేశకావేషాలతో కూడిన వినోదం...గట్రా.....గట్రా....

60 యేళ్ళనుంచి లాక్కొస్తున్న బండి ఇరుసుని కే.సి.ఆర్ మహాశయుల వారు ఇరుకున పెడదామని శాయశక్తులా ప్రయత్నించగా, వారికి మిగిలినదేమనగా హాస్పిటల్ బెడ్డులో ఎక్కించుకున్న "టి.పి.ఎస్" అనే పదార్థమో, అదేదో అంటున్నారే అది మాత్రమేననిన్నీ, ఇక్కడి డాలర్ స్టోర్లలో పిల్లవార్లను సంతోషపెట్టటానికి బహూకరించే అవార్డు ట్రోఫీ, దానితో పాటు రాసిచ్చే (గీతలున్న) తెల్లకాగితపు ప్రశంసాపత్రంలోని "తెలంగాణా గాంధీ" అన్న పదమేననిన్నీ...ఆ ప్రశంసాపత్రం ప్రజల నాలిక గీక్కోటానికి కాక, ఆయన నోరు,నాలిక గీక్కోటానికి కూడా పనికిరాదని కూడా చెప్పుకుంటున్నారు - ఏది నిజమో ఏమో - అయినా నాకెందుకు !!

సమిధలై పోయిన విద్యార్థులూ, కాబోతూన్న అమాయక తెలంగాణా ప్రజలు, ఆమాటకొస్తే ఇతర సీమాంధ్ర తెలుగు ప్రజలూ, సమస్త తెలుగు ప్రజానీకం - తమంతట తామే తమ చేతులతో కొద్దిమంది నాయకులకు తొడిగిన గండపెండేరాలు తళుకుల జిలుగులతో వెక్కిరిస్తూంటే ఆ ధగధగలకు మైమరచిపోతున్నారనీ, కుటుంబంలోనే కాక బయటి ప్రపంచానికీ ఎంత లోకువ అయిపోతున్నామన్నది పట్టించుకోకుండా, ధగధగలు మాయమయ్యాక చీకట్లో మగ్గవలసింది స్వయంగా వాళ్ళే అన్న ధ్యాస కూడా లేకుండా "అదేదో" జరుపుకుంటున్నారని,....ఇంకా బోలెడు రాయాలని వున్నా, మనసొప్పుకోవట్లేదనీ....అయ్యా అదీ సంగతీ....

ఏదేమైనా - పాపం గొర్రె జనాలు కసాయి ఎక్కడ అని ఒకసారి అడిగాక, ఆ వార్త కసాయికి వినపడ్డాకా...ఏమవుతుందీ ?

అదలా పక్కనబెడితే ఈ తతంగమంతా చూస్తూ వుంటే

అస్థివత్ బకవచ్చైవ
చల్లవత్ తెల్లకుక్కవత్
రాజతే భోజ! తే కీర్తి!
పునస్సన్యాసిదంతవత్

అనే పద్యం గుర్తుకొస్తోంది! :) ఇక్కడ భోజులవారు స్వయానా మన నాయకమ్మణ్యులేనని ఒక మదిలో మెదిలిన చిలిపి ఊహట... అయ్యా అదీ సంగతీ....

ఆయనెవరో పృచ్ఛకుడు అతితెలివి ప్రదర్శించి

"కాఖాగాఘాకిజ కాటన్నాయాటీజ" అని సమస్య ఇస్తే

అవధాని శ్రీ చిదంబర శాస్త్రిగారు

"చాఛాజాఝాచి జ చంచన్నాయా ఛీజ
తాథాదాధా తిజ తాతన్నాయా థూజ
పాఫాబాభా పిజ పాపన్నాయా పీజ
" అని ఆపారట

ఆ పృచ్ఛకుడు బిత్తరపోయి - దీని అర్థమేమిటి అని అడిగితే

మీ సమస్యకర్థముంటే మాపూరణకూ అర్థమున్నట్టే అన్నారట శాస్త్రిగారు...అలా వున్నది...మన కే.సీ.ఆర్ గారి పృచ్ఛకత్వం

13 comments:

 1. >> "మీ సమస్యకర్థముంటే మాపూరణకూ అర్థమున్నట్టే అన్నారట శాస్త్రిగారు"

  కెవ్వ్ :-)

  ReplyDelete
 2. మీ బ్రాహ్మణీయ వాక్చాతుర్యనికి దండాలు .తెలంగాణ వాల్ల ఆవేదనను అంతా చులకనగా చూస్తున్న మీ మేధా సంపత్తికి ఎలా ధన్య వాదాలు తెలుపలా అని ఆలోచిస్తున్నాము.ఉండవల్లి గారు చాలా స్పస్తంగా చెప్పారు. సమస్య అంతా హైద్రాబాద్ అని.
  దాని పైన చర్చించి అందరికీ ఆమోదనీయమైన చర్య తీసుకుంటే సరిపోయే దానికి ఒకిరిణి ఒకరు నిందించుకోవడం దేనికి.మాకయితే తెలంగాణ రాష్ట్రం కావాలనే ఉంది.

  ReplyDelete
 3. @మాకయితే తెలంగాణ రాష్ట్రం కావాలనే ఉంది.,

  మాకయతే సెపరెట్ హైదరాబాద్ స్టెట్ కావాలనే ఉంది? అందుకు బంగారమ్మ యాగం ఎమయినా చెయమంటారా? మన ముక్కు kcr చేసినట్లు?

  ReplyDelete
 4. @వీరగోని
  "'సమస్య అంతా హైద్రాబాద్ అని.
  దాని పైన చర్చించి అందరికీ ఆమోదనీయమైన చర్య తీసుకుంటే సరిపోయే దానికి ...""
  హైదరాబాదు మాది దాని సంగతెత్తితే ఏవేవో కోసేస్తామనబట్టే కదా ఈ సమస్య.. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రదర్శించి ఉంటే ఈసమస్య ఇక్కడి దాకా వచ్చేదేకాదుకదా..

  ReplyDelete
 5. "మూడు కాళ్ళ కుందేలు ముడ్డిలో మూతెట్టుక్కూర్చుంటే ఎట్టా?"
  >>>>>>>>>>>>>>>>
  అవును ఆ ముడ్డిలో ముక్కు పెట్టి ... ఆ వాసనకు అలవాటు పడి పూనకం వచ్చినట్టు "నిన్ను వదల తెలంగాణా " అంటూ మొరుగుతూ కూచుంటే ఎట్టా ?

  ReplyDelete
 6. అబ్రకదబ్ర - :)

  వీరగొని (గోని) - అయ్యా మీరు కులమో, ఆ పరమైన సంగతో - ఎందుకు ఎత్తారో అర్థం కాకపోయినా - అసందర్భం కాబట్టిన్నూ, ఈ టపా ఆంతర్యానికి సంబంధించింది కాకపోవటం మూలానూ - బ్రాహ్మణీయ వాక్యం పక్కనబెడితే - వాక్చాతుర్యం అనేది నాకుందని నేననుకోలేదు ఎన్నడూ. మీకు కనపడినందుకు ఒక రకంగా సంతోషమే. ఆ సంగతి తెలియజేసినందుకు ముందుగా ధన్యవాదాలు. తెలంగాణా వాళ్ళను చులకనగా చూసానా! ఎక్కడా? ...యాభై ఏళ్ళకు పైగా ఆ హైదరాబాదు మహానగరంతో మా జీవితాల్ని ముడివేసుకుని వున్నాము.. (జీవితాలు మటుకేనండోయి - ఆస్తులు కాదు - వాటి గురించి మాట్లాడుదామన్నా అవి లేనూ లేవు!) ఆంధ్రం ఎంత చక్కగా మాట్లాడగలనో, తెలంగాణం కూడ అంతే చక్కగా మాట్లాడగలను! నా స్నేహితుల్లో ముప్పాతిక శాతం తెలంగాణీయులే...ప్రాణస్నేహితుడితో సహా! :) మీరనుకుంటున్నట్టు, తెలంగాణా వారంతా అమాయకులూ కాదు, ఆంధ్రావాళ్ళంతా మేధావులూ కాదూ. అలాగనుకుంటే - మీ నిందించుకోవటం పదానికి పరిమితమైతే - అలగా జనాలు కూడా, ఇటేపు అటేపు చాలా మందే వున్నారు.... అయినా మీకున్న కొద్దిపాటి విచక్షణా జ్ఞానమన్నా ఇతరులకు లేకపోయింది. వుండవల్లి ఆయన ఏమి చెప్పాడో నాకు తెలియదు కానీ, జరుగుతున్నది మటుకు జనాల కళ్ళకు పొరలు కమ్మించటం మటుకే! నష్టపోయేదీ తెలంగాణా ప్రజలూ, సీమాంధ్ర ప్రజలూ వెరసి మొత్తం తెలుగు ప్రజలూనూ.

  @ కృష్ణ - యాగాలు అవీ పనిచెయ్యవండి :) ఒకవేళ పనిచేస్తాయి అని మీరు భావిస్తే మటుకు పాతాళభైరవి మాంత్రికుడి వేషం వెయ్యాల్సిందే - తోటరాముడిని ఈడ్చుకుపోవాల్సిందే! :) చివరలో బలిపశువులెవరో చిత్రాన్ని చూస్తున్న ప్రపంచానికి తెలుస్తుంది.


  సత్యసాయి మాష్టారూ - నమోన్నమహ - చాలా రోజులకు కనపడ్డారు. సంతోషం ఇలాగైనా మిమ్మల్ని చూడగలిగినందుకు. కామెంటినందుకు ధన్యవాదాలు.


  అయ్యా రాజన్నగారూ - శాంతి సామరస్యాలకెంత విలువ ఇస్తానో, అవసరమైనప్పుడు మాటలపోటికీ అంతే వేగంగా తయారైపోగలను కూడా.. :) ఇటువైపు వచ్చినందుకు ధన్యవాదాలు. కానీ మీరు నేను రాసిన అసలు పూరణ మీద స్పందించకుండా, పృచ్ఛకులైపోవాలని అనుకున్నారా ఏమిటన్నది అర్థం కాలేదు!!

  ReplyDelete
 7. "ఈ ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారిలో ముగ్గురినో నలుగురినో తీసుకెళ్ళి, తగలబడుతున్న ఆ ఆస్తుల్లోకి తోసిపారేసి బయటకు రాకుండా కాపలా కాసి మాడిమసైపోయేటట్టు చేస్తే మిగతా భూ.ప్రే.పి మూకకు బుద్ధి వస్తుందేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూంది."

  మీకు అలాగ మాత్రమే అనిపిస్తోంది. నాకైతే నిన్న ఒక వార్త విన్నపుడు(కొందరు సెటిలర్స్ ఇళ్ళను తగులబెట్టే ప్రయత్నం చేసినపుడు)వాళ్ళ ఇళ్ళను తగులబెట్టి(వాళ్ళ చేతులతోనే) రెండు కాళ్ళు.చేతులు నరికేసి నాలుక కోసి ఒక మూల కూర్చోబెట్టాలని అనిపించింది. వాళ్ళేం తప్పు చేశారు?

  ReplyDelete
 8. మూర్ఖులకు మంచి మాటలు తలకెక్కవండీ. మనం మన హైదరాబాదు అంటే వారు "మా" హైదరాబాదు అంటారు. మనం మన తెలంగాణా అంటే ... కాదు, కాదు మా తెలంగాణా అంటారు. కొందరు స్వార్ధ రాజకీయనాయకులు రెచ్చగొడితే - రెచ్చిపోయే ఈ భూ.ప్రే.పి గాళ్ళకి బుధ్ధి చెప్పాల్సిన బాధ్యత నిజంగానే అందరిదీనండీ! దాన్ని సామాన్యులందరూ అంగీకరిస్తారు. తెలంగాణా వస్తే ఎంత, రాకపోతే ఎంత.... జనాల్ని చీల్చాలని ఈ నాయకులు చేసే ప్రయత్నంలో మాత్రం వీరు సఫలం అయ్యారు. ఇన్ని కొత్త రాష్ట్రాలు వచ్చాయి.... కానీ ఏ ఒక్క కొత్త రాష్ట్రానికీ అప్పటికి ఉన్న రాజధానిని ఇచ్చి వేయలేదు. ఆ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలి. హైదరాబాదులో తెలంగాణా వాళ్ళు స్వీపర్ ఉద్యోగాలు కూడా దొరకట్లెదు, అదీ, ఇదీ అంటూ మాట్లాడే వారందరికీ ఒక మనవి. అయ్యా, అలా కేవలం తెలంగాణా వారు కావడం వల్లే ఉపాధి దొరకట్లేదు అనే అసంబధ్ధమైన శుష్క వాదాలు మాని, ఒక్కసారి అలోచించి చూడండి. రియల్ ఎస్టేట్ పేరున ఎకరాలకి ఎకరాలు అమ్మి కోట్లు సంపాదించుకున్నది తెలంగాణా వారే. బూం వస్తే దానివల్ల లాభపడ్డది కేవలం తెలంగాణా వారే. దానికి సీమాంధ్ర ప్రజలు ఏమైనా వ్యాఖ్యానాలు చేస్తున్నారా? అస్సలు ఈ గొడవని రేపిన కేసీయార్ ఎంత దొంగ దీక్ష చేసాడో అందరికీ తెలిసిన విషయమే.... తెలుగు వారంతా ఒక్కటిగా ఉండకపోతే నష్టం అని అర్ధం చేసుకోలేని మూర్ఖులకి ఏమి చెప్పినా ప్రయోజనం లేదు. నిజాన్ని గ్రహించేసరికీ పరిస్థితి చేయి దాటిపోతుంది. అప్పుడు వీరంతా ఎంత గగ్గోలు పెట్టినా వృధానే. తెలంగాణా సోదర సోదరీమణులారా, నాయకుల మాటలు విని, ఇన్నాళ్ళూ కలిసి ఉన్న మన సామరస్య వాతావరణాన్ని ఇలాగే ఉంచండి. మనం అందరం తెలుగు వారం. దయచేసి ఈ ప్రపంచం అందటి ముందూ మనం కొట్టుకుంటే మన పరువే పోతుందని గ్రహించండి.

  ReplyDelete
 9. ఒక జాతిగా తెలుగువాళ్ళకింకా ఒక పరువంటూ ఏమైనా మిగిలిందా ? తెలబాన్ చర్యలతో అదంతా ఊడ్చిపెట్టుకుపోయింది. ఊరికే జీవచ్ఛవ ఆకారాలం మిగిలాం, ప్రపంచంలో అందఱూ మనల్ని చూసి నవ్వుకుంటూంటే తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక !

  ReplyDelete
 10. అవును, పరువంతా తుడిచిపెట్టుకుపోయింది. అంతే కాదు రాజకీయ నాయకుల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రజలంతా రెండుగా నిట్టనిలువుగా చీలిపోయినట్లే! సినిమా వాళ్ళు,స్నేహితులు,రాజకీయ పార్టీలు,జర్నలిస్టులు,సామాన్య ప్రజలు....అంతా రెండు వర్గాలయ్యారు!(బ్లాగర్లు కూడా అనుకోండి) ఇలాంటి ఘట్టం ఇంకెప్పుడూ చూడమేమో!

  ReplyDelete
 11. విశ్వామిత్ర - :)

  @ విశ్వనాథ్ - ధన్యవాదాలు.

  @ విరజాజి - తాడేపల్లి గారి సమాధానమే ఒక రకంగా నా సమాధానం అనుకోండి. అదే టపాలో కూడా చెప్పాను. "లోకువ" అని..

  @ తాడేపల్లి గారూ - ధన్యవాదాలు

  @ సుజాత - రెండు వర్గాలు అని అనుకోటమూ, బయటకు కనపడేదీ నిప్పు మీద నివురే. లుకలుకలు చాలానే వున్నాయి. ఇంకెన్ని బయటకు వస్తాయో చూస్తూ ఉండటమే!.

  ReplyDelete
 12. I don't agree with Sujata. I don't think this is causing any differences among Friends. Don't think people are idiots to let their personal relationships influenced by external events especially political events.
  If it were to be true, most of us shouldn't even be on takling terms with our muslim friends, which is not the case.
  93% of my friends in the past 23 years have been from Andhra region and I never had any ripples with them, certainly not over geographical reasons.

  ReplyDelete