Sunday, June 14, 2009

ఉలవ చారులో బొమికేసినట్టే !

ఏక వ్యాఖ్య తవికలు

ఇది అందరినీ ఉద్దేశించిందే అని మీరు అనుకుంటే ఉలవ చారులో బొమికేసినట్టే...అలాటి ఉద్దేశం లేదని, ఇలాటి ఉద్దేశం కూడా లేదని సభాముఖంగా మనవి చేసుకుందామన్నా అహం అడ్డువస్తోందేమో అని ఊరుకుంటే తంపెడు పూలు తట్ట మీదికెక్కి కొక్కిరాయి లాగా కూసినాయట...అదండీ ఇప్పుడు మరి విపరీతార్ధాలతో కూడిన ఏక వ్యాఖ్య తవికలు చూద్దామని ఎన్నో రోజుల నుండి తపన పడుతున్న నిన్నటి నాగన్న నెమ్మదిగా నాకలోకానికి పయనించెనట...నానీలంటే మనసుకు ఎంత గిలిగింతలు పుడతాయో, నానూలు అంతే గట్టిగా అల్లుకుపోయి, నీనూనె నెత్తిన రాసుకున్నంత ఇదిగా మొదలై, సలసల కాగుతున్న నానూనె నీ మీద కుమ్మరించ....

ఇక తాంబూలాలు స్వీకరించమని ప్రార్థన..బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ ఏక్ నిరంజన వ్యాఖ్యలకి విచ్చేసి భోజన తాంబూలాదులు స్వీకరించవలె అని ప్రార్థన...తాంబూలంలో వక్కలు సున్నము ఇవ్వబడవు, ఉత్త ఆకు నమలుకొండి....ఇక భోజనంలో తెల్లని అన్నం ఒక్కటే పెట్టబడును, ఎవరి కూరలు, పప్పులు వాళ్ళే తెచ్చుకోవలెను...

ఎన్ని కూరలో, ఎన్ని పచ్చళ్ళో - ఈ చిన్ని పళ్ళెంలో

తన్నే దాకా, ఎక్కడుందో - బురదలో పంది

అదో చదరంగం, పెట్టాను దానికి - రెండు కిటికీలు

చేతిలో చెంబు, ఊర్లో చెరువు - ఆహా ఏమి సుఖం

అదో ఎర్రని ముక్కు, చీదితే బర్రున - వచ్చింది గంపెడంత

తెల్లని అన్నం, తెగ తిన్నాను - వచ్చింది పొట్ట

డాబా మీద పడుకుని, సూర్యుణ్ణి చూస్తుంటే - కళ్ళు పోయినాయి

బావిలో చేద, జర్రున లాగితే - బోలెడు నీళ్ళు

తెల్లని జుబ్బా, నల్లని పైజమా - ఆహా ఏమి వేషం

రాలిన పూలు, రాలిన ఆకులు - ఒకే చెట్టునుండి

ఏమిటీ లోకం, ఇదేనా మూలం - అదేరా జీవితం

అవి బండలు, ఇవి కొండలు - ఏవి వేప మండలు?

అక్కడ మనిషి, ఇక్కడ జంతువు - ఇదేనా ప్రపంచం

అదో లోయ, అందులో మేనా - ఎదీ పెళ్ళికూతురు

అదొక కంప, దానికింద ఉన్నదొక - బంక

అదిగో పువ్వు, ముడిస్తే సిగ్గు - విచ్చితే నిగ్గు

ఇంతకు ముందు ఎక్కడయినా చదివినట్టు అనిపిస్తే భవదీయుడి దోషం లేదని, ఉన్నా అది చదివిన వారి తిలాపాపమవుతుందని, అయితే గోదానం చేసుకోవాలని....

పనికొచ్చే పనులు....మ్మ్మ్...మ్మ్మ్మ్...

ఎవరికి ?

ఏమిటీ ?

ఎందుకు ?

చెప్పొచ్చావులే పెద్ద....

నీ నుండి ఇలాటివి అస్సలు....

పోనీలెండి పాపం....

ఎవరి కాంట్రవర్సీలు వాళ్ళే సృష్టించుకోవాలి అన్న పెద్దల మాట చద్ది మూట

ఆహా ఏం చెప్పావయ్యా....

10 comments:

 1. ముల్లుని ముల్లుతోనే తియ్యాలి. చెయ్యన్నా చిత్రవధ చెయ్యి.... కూడలి మొత్తం ఎటుచూసినా ఇదే గోలయిపోయింది.

  తెలుగు కవిత్వం అంటే, చెంబట్టుకుని పరిగేట్టు చేస్తుండ్రు...

  ReplyDelete
 2. >>డాబా మీద పడుకుని, సూర్యుణ్ణి చూస్తుంటే - కళ్ళు పోయినాయి

  అన్నట్లు యాద్ మర్సినా, పైన నానీ మస్తుగుందన్నా :-)

  ReplyDelete
 3. యోగి, రామరాజు గార్లూ - ధన్యవాదాలు...

  అయ్యా బ్లాగువీరుల వారూ - మీకు నచ్చినందుకు సంతోషమే, కానీ ఒకరిని చిత్రవధ చెయ్యాలనో, ఏదో చెయ్యాలనో రాయలేదండీ .... నాకు విపరీతమయిన కోపం తెప్పించే వాటిలో - ఒకే వాక్యంలో ప్రపంచాన్ని చూపించటం అన్నది ఒకటి - బోలెడంత పద సంపద ఉండగా, మాట్టాడుకోలేని మూగవాళ్ళలాగా ఒక్కొక్క వాక్యాలేమి ఖర్మం అండీ....అలా కోపం తెప్పించే లిష్టు బోలెడంత కాకపోయినా, చాంతాడంత ఉన్నది....మీరు తంపులు పెడదామనే ఉద్దేశంతో ఉన్నట్టయితే మటుకు, ఆ పప్పులు ఉడకవనీ, ఆ పైన నాకున్న సంబంధాలు చెడగొట్టుకునే పరిస్థితి ఎన్నటికీ రాదనీ, వారు కూడా "స్పోర్టివ్" గా తీసుకుంటారనీ నాకు తెలుసు కాబట్టీ, మీ ప్రయత్నాలు మరెక్కడయినా చేసుకోండి...

  ఇంకో మాటండోయి...మీకు నచ్చింది - నానీ కాదండీ, నానూనె అని తెలియచేస్కోవటమయినది

  ReplyDelete
 4. " డాబా మీద పడుకుని, సూర్యుణ్ణి చూస్తుంటే - కళ్ళు పోయినాయి "
  కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్!!!

  మీ పోస్టు చూస్తుంటే నానీలకు పోటీగా నేను కనిపెట్టిన "బర్గర కపిత్వం" ఫాలో అయిపోయి బరబరా నాలుగు బర్గరాలు రాసేయాలనిపిస్తోంది ;)

  ReplyDelete
 5. తాంబూలాలు ఇచ్చి తన్నుకోవద్దు అని చెప్పటం నీకే చెల్లిందన్నా..
  నిజమే అన్నా నువ్వెవర్నీ ఉద్ధేశించి రాయలేదు, ఇది నిజం ఇది నిజం... నిప్పులాంటి నిజం, నేతిబీరకాయలో నేయి లాంటి నిజం :-)

  >>
  ఒకే తోటలో చెట్లు
  కొన్ని పొట్టి
  కొన్ని పొడుగు
  <<

  ReplyDelete
 6. ఆ రాసేదేదో 'నేను ఫలానావారిని ఉద్దేశించి రాయలేదు' అంటే ఈ అనుమానాలుండేవి కావుగా.

  ReplyDelete
 7. అబ్రకదబ్రా - మొదటి వాక్యం సరిగ్గా చదవండి మహాశయా...బ్లాగువీరులు పోటి చేసిన నియోజకవర్గంలోని ప్రజనులంతా నా వారే....అనుమానములు, భూతదయలు ఆ పరమపిత వద్ద గుర్రపుతోకతో నిలబడవలె అని సూచిస్తాయి...అటులయిన వాత, పిత్త, పక్షవాత, పక్షపాత, చండీ చాముండి విద్యలు, ఏ స్థంబయా విద్యలూ గోరోజనంతో దిద్దుకోలేముగా ...అందుకు అన్న మాట...ఇంతే సంగతులు చిత్తగించవలెను..."స్పోర్టివ్" గా తీసుకేవారికి కసుక్కున తగిలిన ఆనందము..లేనిచో వారి దురదృష్టము....ఇంతకన్నా సూటిగా చెప్పలేను...

  ReplyDelete
 8. అన్నా అబ్రకదబ్ర,

  నువ్వు మరీనన్నా. నువ్వు చెప్పినట్లు చేస్తే "రాజుగారి రెండవ భార్య శీలవతి..." అని చెప్పినట్లుంటది. ఆయనకి పోయిపోయి ఇలాంటి సలహా ఇచ్చి యినోదం సూద్దామనా :-)

  ReplyDelete