Thursday, May 7, 2009

ఈ సినిమా "మనిషి" ఎవరో !! చిక్కు ప్రశ్నా - లేక అక్కు ప్రశ్నా ?


"మళ్ళీ వచ్చావా ?"

"ఆ వచ్చాను సోదరా/రీ"

ఈ పై బొమ్మలోని సినిమా "మనిషి" ఎవరో చెప్పినవాళ్ళకి కిరీటాలు, హారాలు, మణిహారాలు... చాల్లేవయ్యా ఇది కూడా తెలీదా అంటే మరో ప్రశ్న - పేరు తెలిసింది సరే, మరి చిత్రం పేరు చెప్పుకో సోదరా/రీ - మనిషి పేరుతో సహా చిత్రం పేరు చెప్పినవాళ్ళకి - పైవన్నీ కాక సువర్ణ మణిమయ రత్నఖచిత సింహాసనం బహూకరించబడుతుంది. (కలయా, నిజమా!)

"ఏ భాషలో చిత్రం ఇది ? "

"తెలుగులోదే సోదరా/రీ "

"నీకెక్కడ దొరికింది ఇది ?"

""అబ్బో ఇంకా 88 వున్నాయి నాదగ్గర సోదరా/రీ - నెమ్మదిగా ఒకోటీ...."

చివరాఖరికి సమాధానం తెలిసీ చెప్పలేకపోతేనో, చెప్పకపోతేనో - "మీకు ఈ క్రింది ఔషధం ప్రసాదించబడుతుంది సోదరా/రీ"

8 comments:

  1. పునఃస్వాగతం!! :)

    ReplyDelete
  2. ఎవరో తెలియదు కానీ, అమ్మాయికి మీసాలు పెట్టారు :)

    ReplyDelete
  3. >> పైవన్నీ కాక సువర్ణ మణిమయ రత్నఖచిత సింహాసనం బహూకరించబడుతుంది. (కలయా, నిజమా!)

    సినిమా సెట్టింగ్ సింహాసనాలకు ఇంత విలువైన సమాధానం చెప్పరు.:)

    ReplyDelete
  4. Welcome back Sir!
    Saavitri anukunTA. lEdanTE SObhan babu or AkkinEni.
    IndulO edi correct aina naku choclate pampanDi. [:)]

    ReplyDelete
  5. యోగి గారు - ధన్యవాద్. ఆ "ఆడ"మనిషి మీరు అనుకున్నట్టు మీసాలు పెట్టిన అమ్మాయే.. :) .. అర్ధ సింహాసన సమాధానం కొత్తపాళి గారు చెప్పారు చూడండి

    భాస్కరరామిరెడ్డి గారూ - అందుకే బ్రాకెట్లో (కలయా, నిజమా!) అని వున్నది. సినిమా సెట్టింగుల సింహాసనం కాదది. ఉతూత్తి నిజమయిన సింహాసనమే. కాబట్టి కల కావాలో, నిజం కావాలో, విలువైన సమాధానం కావాలో మీసాలెట్టిన ఆడ మనిషిని అడగండి.. :)

    అరుణ గారు - ధన్యవాద్.. కానీ మీరు కోరుకుంది పందెపు బహుమతుల్లో లేదు కాబట్టి, ఆపైన అన్నీ తప్పు చెప్పారు కాబట్టీ - మీకు "ఔషధం" మాత్రమే పంపించగలను...ఇంతే సంగతులు చిత్తగించవలెను.

    కొత్తపాళీ గారు - కిరీటాలు, హారాలు, మణిహారాలు మాత్రమే బహూకరించడమయినది.

    సరే మిగిలిన సింహాసన భాగం ఇదీ - "చిత్రం - AVM studios వారి "జీవితం" ..విడుదల, నటులు, సాంకేతిక వివరాలు వచ్చే టపాలో (ఆ టపా ఎప్పుడు బాబూ ? - ఏమో మళ్ళీ నాలుగు నెల్లకో, నాలుగు రోజులకో!) ...

    ReplyDelete
  6. వైజయంతిమాల అని మా సూరిగాడు సెప్పాడు. :):) పిల్లాట
    వేల్కం బ్యాఖ్..అనగా పున:స్వాగతం. టెంపరవరీగా...

    ReplyDelete
  7. నేను చెపుదామని వస్తే అవుల్రడీ ఎవరో చెప్పేసారు. ఇది అన్యాయం.
    నాకూ వాటా ఇవ్వాలి. హి హి

    :-)

    ReplyDelete