Saturday, October 4, 2008

అసలు ఆ పదార్ధం లేకపోతే పని జరగదా?

ఇది చదివే ముందు ఈ టపాకి ప్రేరణ (ప్రేరేపించిన?) మచ్చుకి ఇక్కడ చదవండి.. కామెంటక ముందు ఈ నా టపాలో ఉన్న ప్రతి లైన్ ని రెండు మూడు సార్లు చదువుకుని అర్థం చేసుకోమని విన్నప...ఇది డాక్టర్ దార్ల గారి మీద కోపంతో రాసింది కాదు అని విన్నవిం...

http://vrdarla.blogspot.com/2008/10/blog-post_04.html

http://vrdarla.blogspot.com/2008/10/dalit-students-union-3-10-2008.html


ప్రేరణ ఇది ఒకటి మాత్రమే కాదు- ఇలాటివి, ఇతరులవి బోలెడు ఉన్నాయి...కొంతమందికి నేను రాసిన , రాస్తున్న ఈ టపాలో అంతలా రియాక్ట్ అవ్వటానికి ఏముంది అని అనిపించవచ్చు...కానీ నా పాళీలో సిరాకి ఈ కైపు ఎక్కడానికి ఇంకా బోలెడు కారణాలు...తర్వాత వివరంగా...


ఈయన టపా గబుక్కున కళ్ల ముందు కదలాడతంతో ఈ లింకులు ఇవ్వటం జరిగింది తప్ప...వేరే ఉద్దేశం ఏమీ లేదు...

మాష్టారూ - అంతా బానే ఉంది కానీ, ప్రతి దానికి ముందు "దళిత" చేర్చటమే కొంచెం "ఇది"గా ఉన్నది..

అసలు ఆ పదార్ధం లేకపోతే పని జరగదా?

మనం చేసే పనిలో పస ఉండాలి కానీ, పెట్టుడు పేర్లలో ఏముంది?

ఆఖరికి స్టూడెంట్స్ యూనియన్లో కూడా "దళిత" పదం చేరిపోయింది అంటే బాధేసింది...మీరు మాష్టారు అయ్యుండి, ఇలాంటివి .......

బై ది బై - అసందర్భం కాకపోతే మీరు ఎంతగానో అభిమానించే ద్వా.నా.శాస్త్రి గారు మా మావయ్యే...:)...

కొద్ది రోజులు పోతే పళ్లు తోముకునే టూత్ పేష్టు, తినే అన్నానికి కూడా ఈ పెట్టుడు పేరు "బ్రాండ్ అంబాసిడర్" గా మారిపోతుందేమో....భళా ...

స్త్రీవాదం, దళితవాదం, హేతువాదం, నాస్తికవాదం, బోడిగుండు వాదం అన్నీ వదిలిపెట్టి మానవతావాదం వైపు అడుగులు పడవా మనకి ? అసలు ఈ పదాలు వాడటం ఎంత అవసరం ? ఎవరికి ఉపయోగం? పేరు - ఆ పేరు తగిలించుకున్నంత మాత్రానే సాగర మథనం జరిగి అమృతం బయటికి వచ్చిందా? వస్తే ఎంతమందికి దక్కింది ? దక్కిన వాళ్లు దేవతలై ఇతరులకి ఎన్ని వరాలు ఇచ్చారు ? ఇవి అన్నీ డాక్టర్ దార్ల గారినే అడిగాను అనుకుంటే పొరపడ్డట్టే...ఇవి ఈ వాదాలతో వేళ్లాడేవారందరికీ అని చిత్తగిం....


ఈ మధ్య ఈ అనవసరమయిన పేర్లు ఉన్న "వాదాలు" ఎక్కడ చూసినా "ఇంతింతై దళితంతై, స్త్రీవాదంతై, హేతువాదంతై, నాస్తికవాదంతై" లాగా ఆవరించి కనపడుతుంటే.....


ఎప్పుడో ఏదో జరిగింది అని ఇప్పుడు బోరు తవ్వి బావిలో పడేసి ఈ నామం చేర్చి కుమ్మిస్తా అంటే...

ఇంతే సంగతులు చిత్తగించవలెను...

7 comments:

 1. తెలిసి తెలిసి తలంటుకు రెడీ అయి పోయిన మీ ధైర్యానికి నా అభినందనలు. ఇంకా తలంటు వీరులు దిగటమే తరువాయి.

  ఇక నా అభిప్రాయం ఎమిటంటే, ఈ ఇజాలు, వాదాలు, ముందు కులాలు, వర్గాలు పెట్టుకొని తిరిగే వాళ్లందరుకూ ఎక్కడో ఆత్మనూన్యతా భావం వుండి దానిని కప్పి పుచ్చుకోవటానికి ఇవి ముందో, వెనుకో పెట్టుకోవటం అవసరం అవుతున్నయి ఎమో అని.
  ఈ కామెంట్ ద్వారా, నేను కూడ తలంటుకు రెడీ అయిపోయనేమో!

  ReplyDelete
 2. హ హ హ
  "ఇంతింతై దళితంతై, స్త్రీవాదంతై, హేతువాదంతై, నాస్తికవాదంతై"
  ఇది చాలా బావుంది :)
  మాష్టారూ, కరక్టే మానవ వాదం ఉండాలి .. అదొచ్చే లోపల ఇతర వాదాలు ఉన్నా వచ్చిన ముప్పేం లేదు. ఈ వాదాలన్నిటివల్లా కాస్తో కూస్తో మంచే జరిగిందనే నా నమ్మకం.

  ReplyDelete
 3. నిన్ననే నేను యానానికి చెందిన ప్రముఖ కవి, రచయిత శ్రీ దాట్ల దేవదానం గారిని కలిసాను. వారన్న మాటలు
  "దళిత వాదం/ఇస్లాం వాదాం/స్త్రీవాదాలనేవి పాఠకులలో ఆయా దృక్పధాలపట్ల పట్ల బెంట్ ఆఫ్ మైండ్ ని కలిగించినయ్. ఆ విధంగా అవి విజయం సాధించాయనే చెప్పుకోవచ్చు" అని

  పై మాటలలోని వాస్తవం నాకు నచ్చింది.

  ఒకప్పుడు గుర్రం జాషువా గారి సమయంలో " రివ్వున బాకు కుమ్మినట్లయిన్ " అనే పరిస్థితి ఈ నాడు ఏ దళితకవికీ లేదనే అనుకోవచ్చు.

  ఒక నాడు ఎన్నో అద్బుతమైన రచనలు చేసిన స్త్రీ రచయిత్రులు లు (70 లలో) చాలా రకాలుగా ఎకసెక్కాలకు గురయ్యారు. కానీ ఈ నాడు ఆ పరిస్థితి లేదు.

  "నేను పుట్టక ముండే నా పేరు దేశద్రోహుల జాబితాలో చేరిపోయింది " అంటూ మొదలైన ముస్లిం వాదం ఈ నాడు ఒక ముస్లిం పట్ల (కనీసం సాహిత్యపరంగా) ఒక సానుభూతి కోణాన్ని, ఒక బెంట్ ఆఫ్ మైండ్ ని కలిగించాయనటంలో సందేహం లేదు.

  ఆవిధంగా ఆయా వాదాలు అవి ఆవిష్కరించిన విషయాలు (పరిణామక్రమంలో కొన్ని వికృత రూపాలుండవచ్చు- కానీ హంస వలే పాలను నీరుని విడదీసి తీసుకోవల్సిన భాధ్యత పాఠకులదే) సమాజానికి మంచే చేసాయనే నేను భావి్స్తాను.

  కానీ అదిమాత్రమే సాహిత్యమనీ మిగిలినదంతా అనవసరమని నేను భావించను.

  అలా భావించటాన్ని నిరసిస్తాను కూడా.

  కృష్ణ గారికి మీ ప్రికన్సీవ్డ్ అభిప్రాయాలకు :-|

  కొత్త పాళీ గారు
  మీ అభిప్రాయాలు హుందా గా ఉన్నాయి.

  బొల్లోజు బాబా

  ReplyDelete
 4. దళిత,స్త్రీవాదాలు reactionary వాదాలు. ఇప్పటివరకూ అప్రతిహతంగా సాగిన అగ్రకుల,అతిబల (పురుష)ధోరణిలో కొట్టుకుపోయిన సామాజిక,ఆర్థిక,సాహిత్య ధోరణులకు సమాధానంగా పుట్టినవాదాలు. అందుకే బాబాగారు చెప్పినట్లు ఈ వాదాలు కొంత "ఆయా దృక్పధాలపట్ల పట్ల బెంట్ ఆఫ్ మైండ్ ని కలిగించినయ్".

  వీటిల్లోనూ కొంత అతివాదం చేసేవారున్నారు. అది కాదనలేని సత్యం.హిందూఅతివాదం,ముస్లిం ఉగ్రవాదంలాగానే ఇందులోనూ అతివాద,ఉగ్రవాదులున్నారు. అంతమాత్రానా మొత్తంగా వీటిని నిరసించడం,అర్థరహితమని నిర్ణయించెయ్యడం ప్రోత్సాహకరం కాదు.

  @కృష్ణ: ఏ ఆత్మన్యూనతా భావం ఉందని అగ్రకులనామాలు పేర్లపక్కన సెలెబ్రేట్ చెయ్యబడతాయి? ఏ ఆత్మన్యూనతా భావం ఉందని రాజకీయాలల అగ్రకులసమీకరణాలు కూడబడతాయి? ఏ ఆత్మన్యూనతా భావం ఉందని,యూనివర్సిటీలో చేరగానే,"వీడు మావోడ్రా!" అనే పదజాలం వెల్లివిరుస్తుంది?

  ఇది ఒక ఐడెంటిటీకోసం జరుగుతున్న పోరాటం. ఒకరు తమ సురక్షితమైన సామాజిక స్థానాన్ని స్థిరం చేసుకోవడానికి పోరాడుతుంటే, మరొకరు ఇప్పటివరకూ తమ ఉనికినే గర్హించిన సమాజంలో, తమ ఉనికిని కోసం పోరాడుతున్నారు. ఇందులో ఎవరిది ఆత్మన్యూనత! ఎరిది అహంకారం!! అది ఖచ్చితంగా మీరు ఉన్న స్థానాన్ని బట్టి ఉంటుంది.

  @వంశీ: మీరు HCU తో చిరపరిచుతుల్లా ఉన్నారు. సుకూన్ లో జరిగిన "భారతీయ సంస్కృతి" ప్రహసనాన్ని మీ నోట వినాలని కోరికగా ఉంది.

  ReplyDelete
 5. మహేష్ గారు,
  "ఇవి ముందో, వెనుకో పెట్టుకోవటం అవసరం అవుతున్నయి ఎమో అని." నేను అన్నది, కులాలు, మతాలు పెట్టుకొని తిరిగే అందరిగురించి, వీటిని పెట్టుకోవటం లో, అగ్ర కులాలో, మిగతా కులాలో అన్న తేడా ఉన్నది అని నేను అనుకోవటం లేదు, మరి మీకు ఎందుకు అనిపించిందో!!

  బొల్లోజు బాబా గారు,

  ప్రికన్సీవ్డ్ అభిప్రాయాలకు, ఎవరమూ అతీతులం కాదనే నా అభిప్రాయం. మీరయినా నేను అయినా.

  ReplyDelete
 6. @కృష్ణ: న్యూనతాభావం కుల మత ఇజాలను వెనకాముందూ పెట్టుకోవడానికి కారణంకాదు. అదొక immediately relatable identity కల్పించడానికి.లేక వారు కోరుకుంటున్న కొత్త గుర్తింపుకు ప్రాతిపదిక కల్పించడానికి. అది చెబుదామనే నేను అగ్రకుల ఉదాహరణ తీసుకున్నాను.

  మీ ఉద్దేశం దళితులనో,మైనారిటీలనో లేక మహిళలో న్యూనతాభావంతో ఈ ఇజాల్ని ఎంచుకున్నారన్న పాయింట్ అంత సబబుకాదు అని చెప్పడం మాత్రమే నా ప్రయత్నం.

  ReplyDelete
 7. @ కృష్ణ.. :)..

  @కొత్తపాళీ గారు - :)..

  @బాబా గారూ - :).."బెంట్ ఆఫ్ మైండ్" బాగుంది..ఆ "బెంటు" ఒక పెద్ద "డెంటు" లా మారి బుఱ్ఱకు "బైండు" అయిపోకముందే "బెండు" లా తేల్చాలి అనే ఈ ప్రయత్నం..ఏ వాదమయినా పుట్టటానికి అనేకనేక కారణాలు ఉంటాయి. అది ఒప్పుకుంటాను. కానీ అలా ఒక మంచి ఉద్దేశానికి పుట్టిన వాదాలు వితండవాదాల కింద మారిపోతున్నాయి అని నా అభిప్రాయం......అలా మారిపోతున్నదానికి ఊతం ఇచ్చేవారు, అనుభవంలేని కుఱ్ఱకారు చెడుదారి పట్టకుండా చూసే గౌరవనీయ ఉపాధ్యాయులు, అమితమయిన మేధోసంపత్తి కలవాళ్లు అవ్వకూడదు అని కోరుకోవటమే ఈ టపా ఉద్దేశం.. ఇంకా చెప్పాల్సింది చాలా ఉన్నది...మళ్ళీ తరువాత తీరిగ్గా రాస్తాను...ఇటువైపు వచ్చినందుకు ధన్యవాదాలు...


  @కత్తి మహేశ్ - నా హెచ్.సి.యూ అనుబంధం (ప్రత్యక్ష అనుబంధం కాదుకానీ పరోక్ష అనుబంధం)సుమారు పదిహేడేళ్ల క్రితం మొదలయింది.నా తమ్ముడు ఎం.ఫిల్, పీ.హెచ్.డి అక్కడ చెయ్యటంతో...ఇక మీ విశ్లేషణకు నా సమాధానాలు, అనుమానాలు మళ్లీ తీరిగ్గా రాస్తాను...

  ReplyDelete