Friday, October 3, 2008

సక్కగా బొట్టెట్టి, పంచె ఎగ్గట్టి ఇందూ సోదరులకు ఇందులెప్పుడయినా ఇస్తిరా?

రంజాన్ - ముసల్మానుల పయిత్రమైన నెల - "ఈద్" ఒక గొప్ప .....

తమ్మి పోరలకు ఇందువుల ఇఫ్తార్ విందు బహు పసందు..

అయితే - మనోళ్లంతా - ఇందూ అన్నలంతా - బభ్రాజమానాలాంటోళ్లంతా, చీపు మినిష్టరు, జవ జవలాడే గవర్నరు అయ్యోరితో సహా ముసల్మాను టోపీలెట్టుకుని, మసీదుల్లో ప్రార్థనలు జేసి మన ముసల్"మాను" సోదరులకు ఇందులిస్తే, షబ్బీరు అలీ అయ్యోరు, ఒవైసీ అయ్యోరు, మిగిలినోళ్లు, సోదర మత పెద్దలు దసరా పండక్కి - సక్కగా బొట్టెట్టి, పంచె ఎగ్గట్టి ఇందూ సోదరులకు ఇందులెప్పుడయినా ఇస్తిరా?


ఇఫ్తార్ ఇందు భుక్తాయాసం తీరేప్పటికి మన దసరా అయిపోద్ది కాబోలు...

నవ్వు ...నవ్వు..నాపసేను ఇరగకాసిద్దిలే...

4 comments:

  1. ఇలా మన ముస్లిము సోదరులు మన ఇందూ సోదరులకి విందులిప్పించడం లేదు గాన ఇందూసోదరుల మనోభావాలు దెబ్బతిన్నయ్యని మనవి చేసుకుంటున్నా నధ్యక్షా! :)

    ReplyDelete
  2. మనోళ్లకు ఇందులు ఇవ్వడం అలవాటు లేదుకదా. కానీముస్లీములు ఎంతోమంది వినాయక నిమజ్జనం అప్పుడు దారిలో మంచినీరు వగైరాలు అందిస్తారు. హిందువులతో కలిసి వినాయకుడీకి నీరాజనాలు అర్పిస్తారు. శాంతిభద్రతలు కాపాడ్డంలో కూడా హెల్ప్ చేస్తారు. ఈ రాజకీయనాయకులే అనవసరంగా హిందూముస్లీముల మధ్య చిచ్చు పెట్టేది..

    ReplyDelete
  3. పాయింటేగానీ, నిజానికి జ్యోతిగారు చెప్పినట్లు ముస్లింలు వినాయకచవితి రోజున నవరాత్రి పండాలున్నచోటా వారివారి "మొగల్లాలలో" పాల్గొంటూనే ఉంటారు. ఇఫ్తార్ విందు మనకి మీడియా డైరెక్టుగా ఈ రాజకీయనాయకులవల్ల తీసుకొస్తారు కాబట్టి అలా అనిపించడం సబబే! సాధారణ మనుషుల గురించి న్యూస్ ఎప్పుడొస్తుందో?!?

    ReplyDelete