Saturday, September 6, 2008

ఇద్దరు ప్రముఖ కవుల "పద్యభిక్ష"

పద్యభిక్ష

1940 లో కరవు వచ్చినప్పుడు కాగడా పత్రిక (తాపీ ధర్మారావు సంపాదకులు) "పద్యభిక్ష" పెట్టమని ప్రకటన ఇచ్చింది. అక్టోబరు సంచికలో ఇద్దరు ప్రముఖ కవుల "పద్యభిక్ష" గమనించండి:

"ప్రళయ భైరవ భయద నర్తనముసేయు
క్షుభిత కంకాళమాలా విశుష్కఘోష
క్షామదేవత శతకోటి చరణ ఘాత
ములదరిద్రోదర క్షుదాగ్నులను నేడు"

- అడవి బాపిరాజు


"కట్టుబట్టలేక, కడుపుకన్నములేక
నిలువ నీడలేక నీరులేక
మనువులేక మరల మరణించగాలేక
బ్రతుకువాని బ్రదుకు బ్రతుకు అగునె?"

- భాగవతుల శంకర శాస్త్రి (ఆరుద్ర)

1 comment:

  1. బాగున్నాయి. ముఖ్యంగా ఆరుద్ర ఆటవెలది, తేలిగ్గా అర్థమౌతూ ఉంది.

    ReplyDelete