Wednesday, September 3, 2008

కుడిసి కుకుండ నిస్తర?

కుడిసి కుకుండ నిస్తర?

కర్నూలులో మద్దులపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ప్రధానాంధ్ర పండితులుగా పనిచేశారు. పద్యరచనలో దిట్ట. ఇంతటి పండితులు వినోద కవితలు రాయటం ఒక విశేషంకాగా - వాడుక భాషలో (గ్రామ్యభాషలో?) మన ఎన్నికల అభ్యర్థుల గురించి చురకలు వేస్తూ మంచి పద్యం రాయటం మరో విశేషం. ఆ పద్యం ఇదే -

"యిడవరు, యింటిసుట్టు వలవేత్తరు, సూత్తరు, వంకదణ్ణముల్
పెడతరు, మేలు సేస్తమని పెగ్గెలు బల్కుత రాపనైన వెం
బడి తిరిగైన సూడరిసుమంటి పెబుద్ధులు రాజ్జెమేలితే
కుడిసి కుకుండ నిస్తర? మొగుండ్లయి సూస్తనె గొంతు గోయరా?"



మామయ్య డాక్టర్ ద్వా.నా.శాస్త్రిగారి సాహిత్య కబుర్లు పుస్తకం నుండి

3 comments:

  1. బావుంది, నేను చదివినంతలో మొదటి పద్యం, జానపదభాషలో...

    ReplyDelete
  2. అవును.. నేనూ ఇలాంటిది ఎన్నడూ చదవలేదు.

    మంచి పద్యాన్ని పంచుకున్నందుకు నెనర్లు!

    ReplyDelete