Friday, September 26, 2008

ఘంటసాల మాష్టారు "ఒయ్యాల" అని పాడారా, "ఉయ్యాల" అని పాడారా?

నిన్న మాష్టార్ వేణు గారి రేడియో ప్రోగ్రాము కోసం పని చేసుకుంటున్నప్పుడు ఒక సందేహం వచ్చింది.

ఘంటసాల మాష్టారు మాంగల్యబలం చిత్రంలోని "ఆకాశవీధిలో అందాల జాబిలి" పాటలో 2.14 ని. వద్ద "ఒయ్యాల" అని పాడారా, "ఉయ్యాల" అని పాడారా? సుశీలమ్మ ఉయ్యాల అనే పాడారు. అది తెలిసిపోతోంది. మాష్టారుదే, ఎన్ని సార్లు విన్నా "ఒయ్యాల" వైపే ఒరుగుతోంది. మళ్లీ 3.18 ని. వద్ద "ఉయ్యాల" అనే వినపడుతోంది..:)...

ఈ పాట వినాలి అంటే www.oldtelugusongs.com కు వెళ్ళి అక్కడ "సెర్చ్" లో మాష్టర్ వేణు గారిని "సెలక్ట్" చేసుకుని వినండి.

1 comment:

  1. మీరు చెప్పిన రెండుచోట్లా మాస్టారి, సుశీలగార్ల ఇద్దరి గొంతులు కలిసి వినిపిస్తున్నాయి. మీకు మాస్టారు ఒక్కరే "ఒయ్యాల" అని పాడేరని ఎలా వినిపించిందో నా కర్థం కావటం లేదు. బహుశా, మీరు "ఒయ్యారి తారను జేరి ఉయ్యాల" లను కుదించి "ఒయ్యాల" అని వింటున్నారేమో? నాకు మాత్రం "ఉయ్యాల" అనే వినిపించింది.

    ReplyDelete