Thursday, September 25, 2008

ముసలమ్మ కాలుజారిన పక్షమున ఎన్ని పిల్లిమంత్రములు వేసిన నీళ్లలో పడును?

చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు పరీక్షాపత్రాల పద్ధతిని తన ప్రహసనాల్లో గొప్పగా వివరించారు. మచ్చుకు ఒక రెండు

ఆకాశ విశ్వవిద్యాలయం : ఇంద్రవారము, 37వ డిశంబరు 19673 సంవత్సరము. కాలము అసుర సంధ్యవేళ గం 7-5ని మొదలు 7-6ని వఱకు

విషయం - గణితము:

1. చెన్నపట్టణమున గొల్లవాడొకడు ఇంటింటికి ఆవును దూడను తీసుకుని వచ్చి పిదకదలచి పాలు చేపుదల నిమిత్తము ప్రతి ఇంటి వద్ద దూడను ఒకసారి తల్లితో కలిపి వెంటనే యీవల కీడ్చుచు వచ్చును. అతడా విధముగా ప్రతిదినము 12 ఇళ్ళకూ పాలిచ్చుచూ వచ్చును. (ఎ) ఒక్కొక్క ఇంటివద్ద నొక్క చుక్క పాలు దూడ త్రాగిన పక్షమున వారమున కెన్ని చుక్కల పాలు దూడ త్రాగును? (బి) నూరు చుక్కలు ఒక గిద్దెడుగా లెక్క చూచుకున్న పక్షమున దూడ కడుపులో సోలెడు పాలు పడునప్పటి కెంతకాలము పట్టుతుంది?

2. రాజమహేంద్రవరములో గోదావరి ఒడ్డున వేసిన గట్టుమీద మెట్లమీదుగా గోదావరిలోకి డెబ్బది సంవత్సరముల ముసలమ్మ దిగితే కాలుజారిన పక్షమున ఎన్ని పిల్లిమంత్రములు వేసిన నీళ్లలో పడును?

ఇలా బోలెడు ఉన్నాయి ఆ ప్రహసనాల్లో ....

2 comments:

  1. హహ్హహ్హ
    అసెంబ్లీరౌడీ సినిమాలో మోహన్‌బాబును అనంత్ ఇంటర్వూ చేసే సన్నివేశం గుర్తొస్తూవుంది.

    ReplyDelete
  2. పిల్లిమంత్రములంటే పిల్లిమొగ్గలనా?

    బొల్లోజు బాబా

    ReplyDelete