Tuesday, September 23, 2008

శంకరంబాడి సుందరాచారి "బొట్టు" !

"మా తెలుగు తల్లికి మల్లెపూదండ" అనే గొప్ప గీతం రాసిన శంకరంబాడి సుందరాచారి 1936 - డిసెంబరు నాటి ' వీణ ' పత్రికలో జానపదుల శైలిలో రాసిన "బొట్టు" గేయం ఇది

పరిగెత్తి నన్నంటి పట్టుకోరమ్మంటె
ఏమేమొ సేస్తావె నా మావాఁ!
ఇటుసూడు నా వొంక నా మావాఁ!
రంగిసెక్కిళ్ళంటి- రాలిపోతున్నాయి
ముద్దుసెమ్మటబొట్లు-ముత్తాలసరవంటు
అందుకొంటున్నావె-నా మావాఁ!
అందులోనేవుంది- నా మావాఁ!

4 comments:

  1. ఇప్పుడు లేదు కానీ, చిన్నప్పుడు ఈయన పేరు నాకు భలే తికమకగా ఉండేది. 'సుందరంబాడి శంకరాచారి' అనుకునేవాణ్ని.

    ReplyDelete
  2. మీ తికమకతో, నిలువు "బొట్టు" ని అడ్డ "బొట్టు" గా మ్యాజిక్ చేసి భలే మార్చేసారే, అబ్రకదబ్రగారూ.

    ReplyDelete
  3. అబ్రకదబ్ర గారు,
    సుందరాచారి గారి పేరు విషయంలో తికమక లేనివాళ్ళు చిన్నప్పుడు ఎవరూ ఉండేవారు కాదు. ఇప్పుడు ఆయనెవరో ఇప్పటి పిల్లలకు తెలీదు కనుక పాపం వాళ్ళకు ఈ గోల లేదు.

    ఒక ప్రముఖుడెవరో ఒక వేదిక మీద ఆయన పేరుని సుందరంబాడి శంకరాచారిగా సంబోధించగా మరెవరో కాదని సరి చేశారట. అప్పుడు సుందరాచారి గారు "పోనీలెండి, కనీసం 'బాడి ' ఉంచారుగదా, అంతే చాలు" అన్నార్ట!

    @K ,
    నిలువు బొట్టు, అడ్డబొట్టు...బాగుందండి!

    ReplyDelete
  4. ఆయన పేరు విషయంలో పులికంటి కృష్ణారెడ్డి గారు పదే పదే పొరబడ్డం నేనోసారి దూరదర్శన్‌లో చూసాను. నా బ్లాగులో రాసానా సంగతి.

    ReplyDelete