Sunday, September 14, 2008

"జిల్లెడు మోమువాడు, చెప్పెను వీడు నాకు"




మళ్లీ నా పాత పుస్తకంలో నుంచి ఒక చిన్న మెఱుపు. పోతనామాత్యులవారు రాసిన ఈ రాముడి పద్యం కృష్ణుడి మీద రాసిన పద్యానికన్నా ముందుదే అయినా, "కృష్ణుడి"కి వచ్చిన "ఇది" "రాముడి"కి రాలేదు అని మా టీచరు చెప్పేవారు. కొసమెఱుపు ఏమిటి అంటే రాయప్రోలు వారు కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాసిన పద్యం ఈ చేతిరాత పుటలో ఉంది.



మెఱుపుల సంగతి వదిలేసి ప్రకృతి వైపరీత్యాల్లాంటివి చూడాలి అంటే - భాషలో తూఫానులు లాంటివి అన్నమాట - స్కూల్లో నా బెంచీ మిత్రుడు శ్రీనివాసుకు సాటి అప్పట్లో నాకు ఎవరూ కనపడేవారు కాదు. ఎవడయినా వాడికి నచ్చనిదేదన్నా చెపితే ఆ కృష్ణుడి మీద పద్యంలోని మూడో వరసలోనించి "జిల్లెడు మోమువాడు, చెప్పెను వీడు నాకు" అని ఎత్తుకునేవాడు.



అలాగే వాళ్ల నాన్నగారి దగ్గరినుంచి నేర్చుకున్న ఈ పద్యం వాడి నోట్లో ఎప్పుడూ ఆడుతూ ఉండేది.


"కరాగ్రే వసతే లక్ష్మీ

కర మధ్యే సరస్వతీ

కర మూలేతు గోవిందః

ప్రభాతే కర దర్శనం"

అన్నది మామూలుగా మామూలు జనాలకు తెలిసిన పద్యం అయితే,వాడు దానిని ఇలా చెప్పేవాడు


"ఖరాగ్రే వసతే లక్ష్మీ

ఖర మధ్యే సరస్వతీ

ఖర మూలేతు గోవిందః

ప్రభాతే ఖర దర్శనం"


ఒకరోజు ఇలానే మా టీచరు ముందు వాగి చచ్చేట్టు తన్నులు తిన్నాడనుకోండి - అది వేరే సంగతి...

1 comment:

  1. Wonderful! asalu padyam telisinade aina kosaru padyam chadivaka navvagaledu :)

    ReplyDelete