Friday, September 12, 2008

చాలా మంది ఆయన పేరునిబట్టి తమిళ దేశస్థుడు అనుకుంటారు!

తొలి రోజుల్లో సినిమా పాటలకు “catchiness” సమకూర్చిన ప్రతిభ నిస్సందేహంగా C.R.సుబ్బురామన్‌దే. ఆయన దరువుల్లోనూ, స్వర ప్రస్తారంలోనూ “సాహసం” కనబడుతుంది.సంగీతం విషయంలో సుబ్బురామన్ ప్రతిభ అపూర్వం, అసామాన్యం. అకాల మరణం చెందకుండాఉంటే ఎస్‌.రాజేశ్వరరావు వంటి గొప్ప సంగీత దర్శకులకు ఆయన గట్టిపోటీగా నిలిచేవారనడంలో సందేహంలేదు. చాలా మంది ఆయన పేరునిబట్టి తమిళ దేశస్థుడు అనుకుంటారు. కానీ ఆయన తెలుగువాడే. వారి పూర్వీకులు తెలుగుదేశం నుండి తమిళదేశానికి వలస వెళ్ళారు. సుబ్బురామన్ శకం పూర్తయి యాభై సంవత్సరాలు దాటినా ఆయన సదా స్మరణీయుడే.

C.R.సుబ్బురామన్ కు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ, ఈ శనివారం ఉదయం 10 – 10.30 AM (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

2 comments:

  1. సి.ఆర్.సుబ్బురామన్ వినోదా సంస్థలో భాగస్తుడు కూడా. 'దేవదాసు' చిత్రాన్ని అతని స్మృతికి అంకితం చేశారు.

    ReplyDelete
  2. గొప్ప సంగీత దర్శకుడు. కాని ఆయన మరణం ఈనాటికి ఒక mystery.

    ReplyDelete