Monday, September 8, 2008

ఇక ప్రశ్నలోకి వస్తే!
ఎప్పుడో సుమారు ఇరవై రెండేళ్ళ క్రితం మా తెలుగు టీచరు శ్రీమతి కరుణమ్మగారి క్లాసులో నేను రాసుకున్న నోట్సు, నిన్న ఆదివారం పాత పుస్తకాలు సద్దుతుంటే కనపడింది. ఒక్కసారిగా అలా కూర్చుండిపోయాను. ఎందుకా? అది నాకే తెలుసు. అది ప్రస్తుత విషయానికి, ఈ టపాకీ సంబంధించినది కాదనుకోండి.


ఇక ప్రశ్నలోకి వస్తే శ్రీనాథుడు వ్రాసిన వీరరసాతిరేక పద్యంలోని 1, 3 లైన్లు - భట్టుమూర్తి రాసిన అబ్జముఖీలో 1, 2 లైన్లు ఒకేలాగున ముగియటం యాదృచ్ఛికమా ? లేక పాషాణ పద్యాలు ఇలాగే ఉండాలా ? అలాగే ఉండేటట్టు అయితే మిగతా మూడిటి ప్రాస, యతి అలానే కలుస్తాయా అని సందేహం?. అసలు ఈ పాషాణ పద్యాల గురించి ఎవరికయినా తెలిస్తే కొద్దిగా వివరించగలరు

4 comments:

 1. వరుసగా ముత్యాలు పేర్చినట్లు మీ చేతి వ్రాత చాలా బాగుంది. మీరు వ్రాసే చేతి వ్రాతను ఉపయోగించి "మాగంటి" ఫాంట్స్ అని విడుదల చెయ్యవచ్చు :)

  ReplyDelete
 2. వంశీగారు,
  మీ బ్లాగుని చాలా రోజులనుంచి చదువుతున్నాను. తెలుగు భాష, సాహిత్యాల గురించి మంచిమంచి విషయాలు పరిచయం చేస్తున్నారు.
  ఈ పద్యాల విషయానికి వస్తే, శ్రీనాథుని పద్యానికి నకలే (మర్యాదగా చెప్పాలంటే "స్ఫూర్తితో" రాసింది) రాయల పద్యం అనిపిస్తోంది. అందుకే వాటిలో అంత పోలిక.

  ReplyDelete
 3. కామేశ్వరరావు గారు ధన్యవాదాలు..:). మర్యాద ఏముందిలెండి, అది ఒక రకమయిన నకలే. పోతే వీటినే పంచపాషాణాలు అని ఎందుకు అన్నారు అని ఒక అనుమానం. ఇలాంటివి మరిన్ని లేకా? లీలగానే అయినా - ఇలాంటివి ఇంకా ఉన్నాయి అని మా కరుణమ్మ టీచర్ గారు చెప్పిన గుర్తు నాకు, ఒకవేళ ఉంటే - అన్నిటిలోకి వీటికే త్యాగరాజులవారి ఘనరాగ పంచరత్నాల లాగా విశేషమేమమన్నా ఉన్నదేమో మరి!

  ReplyDelete