Sunday, August 31, 2008

ఇది మరి అద్భుత ప్రతిభా, లేక ఇంకేమన్నానా?

ఓలేటి వేంకటరామశాస్త్రి, ద్వివేది రామకృష్ణ శాస్త్రి కలిసి వేంకట రామకృష్ణ కవులయ్యారు

"ఎంత వడివడి జెప్పిన సుంతయేని
విరసమనుమాట పొడమదు వేయునేల?"


అనగల సత్తా గల ఈ జంటకవులు పిఠాపురం రాజా రావు వేంకట సూర్యారాయ మహీపతికి అర్జీ పెట్టుకున్నారు - గంటకి వంద పద్యాలు చెప్తామని. రాజాగారు నాలుగు గంటలలో శతావధానం చెయ్యాలని కోరారు. సరే అన్నారు రామకృష్ణ కవులు.


సెప్టెంబరు 13,1909 నాడు మధ్యాహ్నం 3.45 నుండి సాయంత్రం 7.50 వరకు శతావధానం చేసి మాట నిలుపుకున్నారట. రాజావారు ఎంతో ఆనందించి "అద్భుత శతావధానం" అని కీర్తించారు. ఈ శతావధానంలో 33 వృత్తాలు, 5 మత్తకోకిలలు, 2 తోవకములు, ఒక కవిరాజ విరాజితం, 33 కంద పద్యాలు, 19 గీత పద్యాలు, 4 ఆటవెలదులు, ఆర్య ఉత్సాహాలు ఒక్కొక్కటి చొప్పున చెప్పారట. వీటిని చివర్లో ధారణ కూడా చేశారట.

మరోసారి ప్రహ్లాద చరిత్రను నూరు పద్యాలలో ఒకే ఒక్క గంటలో చెప్పారట. ఇది మరి అద్భుత ప్రతిభా, లేక ఇంకేమన్నానా?

4 comments:

  1. 1899 ఏమో గదా! గమనించండి.

    ReplyDelete
  2. మన కవుల ఆవధానాలను, నెట్ లోకి జాగ్రత్తగా ఎక్కించిన సైట్ ఏమైనా ఉందా?

    ReplyDelete
  3. వంశీ: అసలు అవధానమే ఒక అద్భుతం. ఇది పరమాద్భుతమేమో!
    నువ్వుశెట్టి: అవధానాలను చూడలేదుగానీ, అవధానం గురించి రాసిన మూడు భాగాల వ్యాసాల వరసను ఈమాటలో చూసాను. చాలా బాగున్నాయవి. లింకు ఇద్దామంటే ప్రస్తుతం ఈమాట పనిచెయ్యడం లేదు. సైటు లైన్లో కొచ్చాక, "అవధానం" కోసం వెతికి చూడండి.

    ReplyDelete
  4. ఇప్పుడే వెతికి చూసాను. వ్యాసాలు చాలానే ఉన్నాయి.. ఈ లింకు చూడండి.

    ReplyDelete