Friday, August 1, 2008

తెలుగు సినీ జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంతకాలం ఆయన చిరంజీవే!

సినీజగత్తును తన మాటల మాయాజాలంతో అచ్చెరువొందించిన మాంత్రికుడు శ్రీ పింగళి నాగేంద్రరావు. ఒకటా రెండా - పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు లాంటి చిత్రరాజాలకు తన మాటలతో ప్రాణం పోసిన రచయిత.

జీవితమంతా బ్రహ్మచారిగా గడిపి, సాహిత్యానికి, ఆ సినీకళామతల్లికి తన సర్వం అర్పించిన మహానుభావుడు. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం భౌతికంగా దేహం చాలించినా, తెలుగు సినీ జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంతకాలం ఆయన చిరంజీవే....

ఆయనకు శతకోటి నీరాజనాలు అర్పిస్తూ ఈ శనివారం ఉదయం 10 - 10.30 (PST) సమయంలో "వాయిస్ ఆఫ్ శాక్రమెంటో" రేడియోలో ప్రసారమవుతున్న కార్యక్రమం "ఆపాత మధురాలు" విని ఆనందించండి ..

http://www.radio.maganti.org/

లిసన్ లైవ్ లింకు నొక్కితే ప్రత్యక్ష ప్రసారం, ఆర్కైవ్స్ లింకు నొక్కితే పాత ప్రసారాలు...

వంశీ

4 comments:

  1. Just listened to Samudrala Sr. broadcast. A minor comment: I think that he was from Pedapulivarru in Repalle Taluk. It was also the village of Ghantasala's in-laws.

    ReplyDelete
  2. అవునండి,సముద్రాల,ఘంటసాల శ్రీమతి సావిత్రి గారిది.సినీదర్శకుడు కాశీనాధుని విశ్వనాధ్ ఈ ముగ్గురుదీ పెదపులివర్రు గ్రామమే.

    ReplyDelete
  3. స్వరూప్ గారు - ప్రోగ్రాము విన్నందుకు సంతోషం. అవును, వ్యాఖ్యానంలో తప్పు జరిగింది. నేను కూడా చూసుకోలేదు. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహిస్తాను.

    రాజేంద్రగారూ - ఇటువైపు వచ్చినందుకు సంతోషం

    ReplyDelete
  4. No worries. I did 9th grade in Ped(d)apulivarru during 1951-52. Ghantasala visited during that period and we followed him along the road. Even though my father was from Divi Taluk, I grew up in Repalle and Bapatla taluks. Many of the film luminaries those days were from Gudivada taluk and we followed eagerly the fortunes of our locals in films.

    ReplyDelete