Wednesday, July 2, 2008

1940 - 50 ప్రాంతాల్లో "ఆంధ్ర తారల" తీరులు

ఆంధ్ర తారల తీరులు గురించి శ్రీ జీ.వీ.పున్నయ్య అనే ఆయన, ఏదో సినిమా పత్రికలో 1940 - 50 ప్రాంతాల్లో రాసిన రాతలు ఇవి అని మా నాన్నగారి పాత డైరీలో ఉంది...ఇతర వివరాలు తీరిగ్గా కనుక్కోవాలి...అందాకా....


నేనే రాణిని
నేనే వాణిని
నేనే ప్రొడ్యూసర్
నేనే డైరెక్టర్
నేనే క్రిటిక్కు
నేనే సర్వము
నేనే యనెడు
ఎన్న రాణిగల్
ఎంగ యిరుకుదు?
బఱ్ఱె తోలుదౌ
కిఱ్ఱు పాదుకల
పల్లెజనములే
పట్టిరికరమున
కన్నమ్మా !అల్లసానికవి
అంకసీమన
అల్లార్ముద్దుగ
నాలాపించి -
ముక్కు తిమ్మన
ముద్దు పల్కుల -
ఆది కవీంద్రుల
అమరవాగ్ఝరిచె
హారతులందిన
తెలుగు భాషనే
తీసి కట్టని
ధనమాసించి
తమిళపటంబుల
తై తక్క లాడగ
తగునా కన్నమ్మా"ఎన్నసామి?
రొంబ సంబర,"
త్యాగరాజుదా
తమిళవాడుదా?
తెలుగు వాడుదా?
తెలియ జెప్పుమీ
తెల్లముగాను
అరవలనోట
ఆంధ్రంబుంచిన
అపరాధమయా
నాగ అయ్యరా?
పోతన యందున
పుణ్యమూర్తివై
తెలుగుమాతలౌ
తియ్యనిదుగ్దము
కంఠము వరకు
గడగడ ద్రావి
తక్కెడ యందున
తమిళ పటంబుల
నొక్కట నన్నిటి
అరవ సాంబరు
ఆరగింపగ
గూడకట్టురా
ముళ్ళనుబోలీ
ఓహో పోతివ
దొంగకృష్ణునిగ?నొనరగ నునిచీ
పోతన నొక్కెడ
పొలుపుగ నుంచీ
తూయించుమనీ
తులా భారమున
తెలుగు తమిళముల
తీరులు తెలియుబంగరు మాలా!
బాగున్నావా?
మాలపిల్లలో
మధురభాషివై
మళ్ళీ పెళ్ళిలో
మదనుని రేపి
బాలనాగు నడ
వాసన్ బందిలొ
అల్లాడెడు నీ
అవస్థగాంచియు
అనదలవోలె
అంగలార్చెడు
ఆంధ్రులమమ్మాదేవతయందున
దేదీప్యమ్ముగ
తేజరిల్లిన
దిట్ట కుమారీ
డంకన్ టాండన్
దర్శక బాబులు
దద్దమ్మనుగా
దిద్ది చూపిరి
తవమణి దేవి
ధగద్ధగిత
నగ్న చిందుల
వాల్మీకి యందున
వహ్వారే వహ్వారె!బొందితో స్వర్గము
బొందెడి స్వర్గము
పుడమి జనులకు
పొలుపుగ జూపే
పూవుల వల్లీ !
ఇందు బాలకా
నందము గూర్పగ
బొంద బాలుని
డెందము గుందగ
అందము దక్కి
చిందులు వేయుచు
అరవ పటంబుల
నాడు చుంటివా?
ఆంధ్రమె మరచీ
ధనమాసించి
తమిళము నేర్చి
చచ్చు పటంబుల
జొచ్చి నటించుట
తెలుగు తారలకు
తెగులీ నాటను -
అభిమానంబిది
అగ్గిని గలియ
నున్నానొక్కటె
యూడిన నొకటేతెలుగు తారలను
తీరని వంతల
గురిగా వించి
కులికే తమిళుల
కొలువాసించి -
తల్లి రొమ్మునే
తన్నే నటకులు
ఆంధ్రావనిలో
నసంఖ్యాకులుఆంధ్రమాతనే
యాదరించిన
నమరత్వంబది
యబ్బుట నిజము

5 comments:

 1. హ హ్హ హ్హ
  Kudos to your father.
  అదే తెలుగు కళామ తల్లి ఈనాడు బొంబాయి భామల బొడ్లలో ఇరుక్కుని, ఉత్తరాది విలన్ల భౄముకుటిలో చిక్కుబడి, ఉత్తుత్తి నారాయణుని గొంతులో విలవిలలాడుతూ ..

  ReplyDelete
 2. కొత్తపాళి గారన్నట్లు, అప్పటికీ ఇప్పటికీ సినిమా ఒకటే, పాత్రలే మారారు...హహహ

  ReplyDelete
 3. @ కొత్తపాళీ గారూ - అచ్చంగా మీరనుకున్నదే నేనూ అనుకున్నా..ఆ 40వ దశకంలోని సినిమా పత్రిక, దాని కథా కమామీషు తెలుసుకునే ప్రయత్నంలో కొద్ది పాటి పురోగతి కనపడేటట్టే ఉన్నది...త్వరలో వివరాలు...

  @ మహేశ్ , S - ఇటువైపు వచ్చినందుకు థాంకులు

  ReplyDelete
 4. త్యాగరాజు ముమ్మాటికి తమిళవాడుద అని అందును. తమిళ తంబిలే త్యాగరాజు ని కనక ఆదరించి,ఆరాధించి పైకి తీసికొచ్చి ఉండకపోతే, ఈపాటికి ఆయన కీర్తనలన్నీ మన తెలుగు సినిమా కవులందరూ తమ సొంత రచనలని చెప్పి వాడుకొని ఉండేవారు..కాదంటారా?

  ReplyDelete