Saturday, June 14, 2008

ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం మీ కోసం

ఆ పాత మధురాలు! రేడియో కార్యక్రమం

ప్రతి శనివారం శాక్రమెంటో 88.7 కేబుల్ ఎఫ్.ఎంలో ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు ప్రసారమయ్యే అచ్చతెనుగు రేడియో కార్యక్రమం మీ కోసం

http://www.radio.maganti.org/

June 14న ప్రసారమయ్యే మొట్ట మొదటి కార్యక్రమం ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు (IST - Indian Timings - Night 10.30 PM to 11.30 PM)కొనసాగే ఒక ప్రత్యేక కార్యక్రమం. తరువాతి శనివారం నుండి, "ఆపాత మధురాలు" ఉదయం 10 గంటల నుండి 10.30 వరకు (IST - Indian Timings - Night 10.30 PM to 11.00 PM)Regular Schedule లో ప్రసారం అవుతుంది .

ప్రత్యక్ష ప్రసారం వినలేకపోయినవారు Archives లింకు క్లిక్కు చేసి, పాత ప్రసారాలన్నిటినీ వినవచ్చు.

ప్రతివారం ఒక చిత్రరాజానికో, ఒక రంగస్థల నటుడికో, ఒక జానపద కళాకారుడికో, ఒక రచయితకో, ఒక సంగీతకారుడికో,ఒక మేకప్ మాన్ కో, ఒక ఆర్టు డైరెక్టరుకో, అద్భుతమయిన ప్రతిభ కలిగి ఉండి కూడా, కళాపోషకులు లేక మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన ఎందరో మహానుభావులకు నీరాజనాలు అర్పిస్తున్న ఈ రేడియో కార్యక్రమం, తెలుగు గడ్డపై జన్మించి కళకే జీవితాన్ని అంకితం చేసి, అవిశ్రాంత కళాపిపాసతో ఆణిముత్యాల్లాంటి కళాఖండాలను సృష్టించి, మన జీవితాలను మనస్సులను స్పృశించి, వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించమని మనకు వదిలి వెళ్ళిన ఆ కళామతల్లి ముద్దుబిడ్డలకు అంకితం

ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి నమఃస్సుమాంజలులు

మాగంటి వంశీ మోహన్ , మాగంటి శ్రీదేవి

3 comments:

  1. అభినందనలు. చాలా మంచి కార్యక్రమం. ఇది ఓర్పు, పట్టుదల తో కూడుకున్న వ్యవహారం. కాలిఫోర్నియా లో చాలా మంది తెలుగు వాళ్ళు వున్నారు కాబట్టి ఇది తప్పకుండా వీజయవంతం కావాలి. మీరు అందులో సఫలీకృతులు అవాలని కోరుకుంటున్నాను.

    -- విహారి
    http://blog.vihaari.net

    ReplyDelete
  2. మీరు అమెరికాలో ఏ ప్రాంత సమయమో చెప్పనే లేదు. పసిఫిక్ టైమా? ఈస్టర్న్ టైములో 10:00 లకు ఏమీ రాలేదు.

    ReplyDelete