Monday, April 21, 2008

కౌముది పత్రిక సంపాదకుడు కిరణ్ ప్రభగారితో ముఖాముఖి

భూగోళానికి ఇవతలివైపున అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక చిన్న నగరంలో నివసిస్తూ, ఒక పూర్తిస్థాయి తెలుగు పత్రికను నడపడం అనేది చెప్పుకోదగ్గ విశేషమే. ప్రతినెలా దాదాపు 35 శీర్షికలతో , 150 పేజీల పత్రికను క్రమం తప్పకుండా తీసుకురావడం అభినందించదగ్గ విషయం. ప్రస్తుతం ఇంటర్నెట్ కే పరిమితమయిన ఈ పత్రిక అత్యంత ఉత్తమమయిన సాహితీవిలువలు కల రచనలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అందిస్తోంది అనటంలో అతిశయోక్తి లేదు. ఆ విశిష్ట పత్రిక పేరు కౌముది. ఈ విశిష్టపత్రిక స్థాపకుడు, నిర్వాహకుడు, సంపాదకుడూ అయిన కిరణ్ ప్రభ (శ్రీ పాతూరి ప్రభాకర రావు) గారితో ముఖాముఖీ కార్యక్రమంలో ముచ్చటించటానికి అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ, ఆయన అనుభవాలు, ఆలోచనలు, సూచనలు మీతో పంచుకుంటున్నాం.

http://www.maganti.org/mukhamukhiindex.html

కిరణ్ ప్రభ గారి పేరు ఉన్న లింకు మీద క్లిక్కండి

విధేయుడు
వంశీ

4 comments:

 1. Thanks for sharing this info. I have seen Mr. Kiran Prabha in some Silicon Andhra meetings. It is very good to know about his past and present work in Telugu Sahityam. It is very astonishing to know that only he and his wife run the total Koumudi telugu magazine. This is one proof to show his dedication. It is also very interesting to know that he ran the same magazine in his Andhra Universtity days by writing the magazine by own hand. Thanks once again and we really enjoyed it.

  ReplyDelete
 2. చాలా ధన్యవాదాలు వంశీ గారు.బహుశా అవిరళ కృషి అంటే ఇదే కాబోలు.మీ ఇద్దరిదీను.కౌముది పత్రికను దాదాపు మొదటి సంచికనుంచి చదువుతున్నాను.మార్చి నాటి ఈమాటలో కూడా కౌముది ప్రస్తావన ఉంది.
  నలభై ఎనిమిది నిమిషాల వీడియో చాలా విషయాలు చెప్పింది.కిరణ్ ప్రభ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం విధ్యార్ధి అని తెలిసాక చాలా ఆనందం కలిగింది.అలాగే మూడు దశాబ్దాల క్రితమే ఆయన కౌముది లిఖిత పత్రికను కాంపస్ లో నడిపారని విని నివ్వెరపోయాను.
  మీకు,కిరణ్ ప్రభ గారికి మరో సారి నా అభినందనలు.

  రాజేంద్ర

  ReplyDelete
 3. హృదయపూర్వక కృతజ్ఞతలు వంశీ గారు.. కిరణ్ ప్రభ గారితో మీ ముఖాముఖి చాలా చాలా విశ్లేషణాత్మకంగా ఉంది.. ఒక్క కౌముది పైనే కాకుండా ఆయనకు సంబంధించిన సాహితీ విషయాలన్నిటినీ స్పృశించటం ఎంతో బాగుంది.. ఆయనతో నా మొదటి సంభాషణని గుర్తుతెచ్చింది.. ఆయనతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలీదు.. సాహితీ ప్రవాహంలో తేలుతున్నట్లుంటుంది!! మా నాన్నగారు శరత్ నవల 'చరిత్రహీనులు ' ప్రభావంతో నా పేరెలా పెట్టిందీ నేను చెప్తుంటే ఆయన తన పేరు కి కారణం కూడా అదే పాత్ర అనేసరికి అదొక ఎక్సైట్ మెంట్! కిరణ్ ప్రభ గారు, కాంతి కిరణ్ గారి గురించి చెప్పాలంటే ఒక వ్యాసం రాయొచ్చు అనిపిస్తుంది నాకైతే!! ఆ దంపతులిద్దరికీ, ఇంత చక్కని ముఖాముఖుని అందించిన మీకూ నా అభినందనలు..

  ReplyDelete
 4. ఇటువైపు తొంగిచూసినవారందరికీ, వీడియో చూసి అబిప్రాయాలు వెలిబుచ్చిన అందరికీ ధన్యవాదాలు

  నమస్కారాలతో
  వంశీ

  ReplyDelete