Wednesday, April 9, 2008

పాటు, చేటు, కాటు, ఆటు, పోటు, కుందేలు, తోడేలు

శ్రీ వజ్ఝల చినసీతారామశాస్త్రి గారి బాలవ్యాకరణోద్యోతము చదువుతుంటే "పడ్వాదులు" అని ముక్క కనిపించింది...అదేమిటో అని చూస్తుంటే ఇక్కడికి తేలింది

పడ్వాదులు = పడు+ఆదులు

పడు, చెడు, ఆడుచు, కఱచు, పొడుచు, ఓడు మొదలయిన ధాతువులను పడ్వాదులు అంటారు.

అయితే "టు" అనే కృత్ప్రత్యయము పరమగునపుడు ఈ ధాతువులు ఆద్యక్షర శేషములై దీర్ఘమునొందునట

పడు + టు - పాటు
చెడు + టు - చేటు
ఆడుచు + టు - ఆటు
కఱచు + టు - కాటు
పొడుచు + టు - పోటు
ఓడు + టు - ఓటు

నేనింతవరకు ఈ పైవన్నీ ఒకే పదం అని అనుకుంటున్నా...బాల వ్యాకరణం కళ్ళు తెరిపించింది...అనుమానం వచ్చి పరవస్తుగారి బాల వ్యాకరణం కూడా చూసా...అందులో కూడా ఇలానే ఉన్నది...

అదే పుస్తకం ఇంకో విభాగంలో - కుందు + ఏలు - కుందేలు , తోడు + ఏలు - తోడేలు అని అలాగే పొటేలు, తాబేలు మొదలయినవి "ఏలు" సహాయంతో జంతుపక్షి వాచకాలుగా ఏర్పడినాయి అని వివరణ ఉన్నది

2 comments:

  1. @వంశీ, బాగున్నాయి వివరాలు. అక్షరాలు పెద్దవయ్యేటప్పటికి హాయిగా ఉంది చదువుకోటానికి.

    ReplyDelete
  2. "ఓడు + టు - ఓటు"

    ఓహో ఆ రోజుల్లోనే ఓట్లున్నాయన్నమాట!

    ReplyDelete