Wednesday, March 19, 2008

హైదరాబాదు వస్తే నీకూ - అన్నీ కలిపీ పెడతాను

ఈ పాట అందించిన మా చిన్నమ్మ (పిన్ని) శ్రీమతి లంక లలిత గారికి ధన్యవాదాలతో...ఇది రేడియో అక్కయ్య గారి పాట అని తెలుస్తోంది..

మ్యావ్ మ్యావ్ పిల్లీ రారమ్మూ
పుస్ పుస్ పిల్లీ రారమ్మూ

గోలుకొండకు వస్తే నీకూ
పాలూ మీగడ పెడతాను
వరంగల్లుకు వస్తే నీకూ
కారప్పూసా పెడతాను

నల్లాగొండకు వస్తే నీకూ
చల్లా మజ్జిగ పోస్తానూ
ఖాజీపేటకు వస్తే నీకూ
కాజాలాడ్డూ పెడతాను

ఖమ్మమ్మెట్టుకు వస్తే నీకూ
కమ్మని బువ్వాపెడతానూ
హైదరాబాదు వస్తే నీకూ
అన్నీ కలిపీ పెడతాను

2 comments:

 1. ఎన్నాళ్ళయ్యింది మాగంటి గారూ,మా వూరి పూర్తి పేరు చూసి...ఖమ్మమ్మెట్టు....

  ధన్యవాదాలు..

  చిన్ని అప్పుతచ్చు ..అది 'ఖమ్మమ్మెట్టు '

  ఖమ్మమెట్టు కాదు...

  -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

  ReplyDelete