Saturday, March 22, 2008

సాహిణమే "సాని" అయ్యిందా ?

సాహిణమే "సాని" అయ్యిందా ?


లకం"సాని", మేడ"సాని", అల్ల"సాని" , చల"సాని" - ఇలా ప్రముఖమయిన ఇంటి పేర్లు మనకి తెలిసినవే కదా...అయితే కొత్త సంగతి ఒకటి తెలిసింది..


సాహిణం అంటే జంతుసాల(అశ్వ, గజ) అని, ఈ సాహిణం అనే మాటే "సాని" అయ్యిందని ఈ మధ్య కాలిఫోర్నియాలో జరిగిన ఒకానొక సాహితీసభలో వినటం జరిగింది, ఇది నిజమేనా - లేక సానికి వేరే అర్ధం ఏమయినా ఉందా? పెద్దలు తెలుపగలరు..

చివరి చెణుకు ఏమిటి అంటే అల్లసాని వారికి రథ గజ తురగ సాలలు బోలెడు ఉండేవి అని, ఆయన తన వీరత్వాన్ని అసలు యుద్ధంలో కాకుండా, పదకవితల్లో చూపించారని వక్తగారు నొక్కి వక్కాణించారు

5 comments:

  1. ఏమో అదే నిజం అయ్యిఉండవచ్చు. నా బైసాని లొ "సాని" ఎమిటో??

    ReplyDelete
  2. లంక, మేడ, అల్ల, చలసానులు సరే, అసలు సానుల సంగతేమిటి? వాళ్లను సానులని ఎందుకన్నారో మరి!! :) అల్లసాని ఆంతరంగికంలోనే ననుకుంటా రాధాసాని ఒకర్తె వుండేది కదా!

    ReplyDelete
  3. రానారె - నాకు తెలిసి సంస్కృత శబ్దం "స్వామిని" (యజమానురాలు) - వాడుకభాషలో సామిణీగా మారి, తరువాత సానిగా మారింది అనిపిస్తుంది..ఎందుకంటే దొరసాని, ఏలికసాని, పట్టపుసాని అనేవి అధికారాన్ని సూచిస్తూంటాయి...కానీ ఒక సందేహం కూడా ఉన్నది..మంత్రసాని, ఎఱుకసాని మొదలయినవి కూడా ఉన్నాయి కదా...మఱి ఆ కాలంలో వీరంతా అంతఃపుర స్త్రీలో, లేక వారికి సేవలు చేసే వారుగాను ఉండటం వల్లో అది కూడ అధికార చిహ్నంగా ఉన్నదేమో అనిపిస్తుంది...

    ReplyDelete
  4. అయితే ఈ పై వివరణ స్త్రీలకు ఉన్న "సాని" నామాలకు మాత్రమే పరిమితమేమో అని అనుకుంటున్నాను ...ఇంటిపేర్లకు కాదేమో అని

    ReplyDelete
  5. ఔనండి. బాగా గుర్తుచేశారు. రెడ్డసాని అనేమాట కూడా వుంది - 'దొరసాని' మాదిరే దర్పాన్ని సూచించే పదమే ఇదికూడా.

    ReplyDelete