Tuesday, March 18, 2008

శ్రీ అబ్దుల్ కలాం గారు పాడిన "ఎందరో మహానుభావులు"...

శ్రీ అబ్దుల్ కలాం గారు పాడిన "ఎందరో మహానుభావులు"...

http://youtube.com/watch?v=zLXiNj94rx8

(vIDiyO lO 2.04 నిముషం దగ్గరినుంచి మొదలు )

ఆయన స్వరం కలిపిన "ఎందరో మహానుభావులు" అంటే బాగుంటుందేమో... ఆ పక్కనే రెండో భాగం, మూడో భాగం కూడ ఉన్నాయి..వాటిల్లో ఆయన ఎంత శ్రధ్ధగా, లీనమయిపోయి వింటున్నారో చూడండి, ముఖ్యంగా రెండో భాగంలో

Note:

శ్రీ జి.బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన త్యాగరాజుల వారి ఇదే కృతి ఇంతవరకు మళ్ళీ నాకు దొరకలేదు...ఆయన పాడిన ఈ కృతి తెలుగుబిజ్.నెట్ లో ఇంతకుముందు దొరికేది..చాలా మంది ఇదే కృతి పాడగా విన్నా కానీ - శ్రీ జి.బి.కె గాత్రంలో విన్న తరువాత, ఇంకెవరిదీ వినబుద్ధి కాలా... హైదరాబాదులో కూడా తెలిసిన వారి ద్వారా ప్రయత్నించాను కానీ, సఫలం కాలా...ఇక తిరుపతిలో కానీ, మద్రాసులో కానీ దొరుకుతుందేమో చూడాలి

8 comments:

 1. మంచి లంకెనిచ్చినందులకు నెనరులు.

  జాన్ హిగ్గిన్స్ గారు పాడిన ఎందరో మహానుభావులు విన్నారా..

  అన్నట్టు మీ శ్రీమతిగారి గాత్రం బావుంది.

  -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

  ReplyDelete
 2. మీరు వ్యంగ్యంగా అన్నారేమో నాకర్థం కాలేదు కానీ ఒక మహానుభావుణ్ణి గుర్తు చేశారు.
  నేను నా జ్ఞాప్కాలలో భాగంగా ఎప్పూడో ప్రస్తావించేదాన్నేమో. ఇప్పటికి ఆయన గురించి:
  http://www.musicalnirvana.com/carnatic/jon_higgins.html

  ఆయన పాడిన పాట ఇక్కడ.
  http://www.musicalnirvana.com/script/music_samples.asp?artist=Jon+B+Higgins

  ReplyDelete
 3. శర్మగారూ - మీరు బాలకృష్ణప్రసాద్ గారి ఇదే పాట విని ఆ పైన మీ అభిప్రాయం చెప్పండి..నేనయితే "పాడిందే పాటరా పాచిపళ్ళ" లాగా ఆయన పాడిన ఈ పాటకు దాసోహం...ఇంకెవరిది విన్నా అంతలా నచ్చదు..ఇది మటుకు నిజం...నా శ్రీమతి గాత్రం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు..


  లలితగారూ ఇటువైపు తొంగిచూసినందుకు ధన్యవాదాలు..
  passion అనే పదానికి అర్థం, జాన్ హిగ్గిన్స్ గారి పాటల్లో ప్రస్ఫుటంగా తెలుస్తుంది.....అకాల మృత్యువు hit and run రూపంలో ఆయన్ని పొట్టన పెట్టుకుంది అని చదివినప్పుడు ఎంతో బాధ వేసింది.

  ReplyDelete
 4. లలితగారూ

  ఇంకో విషయం - నేను అబ్దుల్ కలాం గారు పాడిన విషయం చెప్పటంలో వ్యంగ్యం అయితే ఏమీ లేదు...నాకు ఆయన బాగా ఇష్టమయిన వ్యక్తి..మీ ప్రశ్న శర్మగారికి అయితే ఆయనే సమాధానం చెప్పాలి

  ReplyDelete
 5. వంశీ గారు,
  నా అనుమానం శర్మ గారి వ్యాఖ్య గురించేనండి.

  ReplyDelete
 6. అమ్మా..లలితమ్మా...

  ముందు నమస్కారం..

  నేను పోస్ట్ చేసిన వ్యాఖ్యను మరొక్కసారి చదవండి..
  ----------------------------------

  మంచి లంకెనిచ్చినందులకు నెనరులు.

  జాన్ హిగ్గిన్స్ గారు పాడిన ఎందరో మహానుభావులు విన్నారా..

  అన్నట్టు మీ శ్రీమతిగారి గాత్రం బావుంది.

  -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.
  ----------------------------------
  * అందులో జాన్ హిగ్గిన్స్ గారి గాత్రంలో ఆ కీర్తన విన్నారా? అని మాత్రమే అన్నాను..

  * దానర్ధం బాలకృష్ణప్రసాద్ గారి కంటే హిగ్గిన్స్ గారు బాగా పాడారని నా వుద్దేశం కాదు..

  * విన్నారా అని మాత్రమే
  * ఆ మాటకొస్తే బాలకృష్ణప్రసాద్ గారి గాత్రంలో ఆ కీర్తన నేను వినలేదు..

  * మాగంటి గారూ నేను వ్యంగ్యంగా అనలేదు..అడిగానంతే..

  * బాలకృష్ణప్రసాద్ గారి గాత్రంలో ఆ కీర్తన వినటం ఎలా?

  -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

  ReplyDelete
 7. అయ్యా శర్మగారూ

  మీరు వ్యంగ్యంగా అన్నారు అని నేను అనలేదు...ఈ పాటకు నాకు బాలకృష్ణప్రసాద్ గారి గాత్రం మాత్రమే నచ్చుతుంది అని చెప్పాను..జాన్ హిగ్గిన్స్ గారి పాటలు నేను విన్నాను, ఎందరో మహానుభావులుతో సహా .. అదే చెప్పాను కూడా - passion అనే పదానికి అర్థం ఆయన పాటల్లో తెలుస్తుంది అని ...మీకు బాలకృష్ణప్రసాద్ గారి ఈ పాట ఎక్కడయినా దొరికితే దయచేసి నాకు ఆ క్లిప్పు పంపమని అడుగుతున్నాను..నాకు తెలుగుబిజ్ సైటు అందకుండా పోయాక, మళ్ళీ ఆ పాట వినే అదృష్టం కలగలేదు..ఎక్కడ ప్రయత్నించినా దొరకలేదు..కాబట్టి ఒకవేళ మీకు దొరికితే నాకు పంపండి..అందుకు ముందుగానే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను..

  ReplyDelete
 8. శర్మ గారు,
  ఆలోచించి అడిగాననుకున్నాను.
  తప్పుగా తోస్తే క్షమించండి.
  నాకు చాలా కంఠాలతో పరిచయమే కాని పరిజ్ఞానం లేదండి.
  మా పిల్లలు రోజూ తెలుగు వింటూ కూడా తెలుగు పలకడానికి కష్టపడతారు.
  మొదట్లో విన్నప్పుడే ఆయన గురించి ఆశ్చర్యపోయాను.
  ఇప్పుడూ ఇంకా ఆశ్చర్యం వేస్తుంది నాకు.
  మనది అని చెప్పుకునే సంగీతాన్ని మన వారు కాదనుకునే వారు ఆదరిస్తుంటే
  వారు అది ఎంత భక్తిగా అభ్యసిస్తున్నారు, ఎంత నేర్చుకుంటున్నారని కాక
  ఎన్ని దోషాలతో అంటున్నారనుకోవడం నాకు బాధగా ఉంటుంది. అది కూడా
  ఉచ్చారణ పరంగా. సంగీత జ్ఞ్ఞానం లో తేడాల గురించి ఎక్కువ వాదనలు వినలేదు.
  అప్పుడప్పుడూ కొందరు రాగానికి ప్రాధాన్యం ఇస్తే కొందరు భావానికి ప్రాధాన్యం ఇస్తారని అలా వింటూ ఉంటాను.
  అప్పుడెపూడో కొత్తపాళీ గారు ఏదో టపా రాసినట్టున్నారు కూడా.
  తెలిసిన వారు చర్చించుకుంటుంటే తెలుసుకోబుద్ధేస్తుంటుంది.
  నా లాంటి పానకంలో పుడకల వల్ల చర్చ దారి మళ్ళనివ్వద్దు:-)
  అప్పుడప్పుడూ "విభూషణం మౌనమపణ్డితానాం" అని మర్చిపోతుంటాను:-)

  ReplyDelete