Friday, February 8, 2008

చాకలి "చలువ"

ఊర్లల్లో చాకలి వారి మాటల్లో దొర్లే "చలువ" అనే పదానికి అర్థం ఏమిటి? మా అమ్మమ్మగారి ఊరు చల్లపల్లిలో కిష్టమ్మ అని చాకలి అమ్మాయి పని చేసేది, చిన్నప్పుడు ఆ మాట పెద్ద పట్టించుకోలేదు కానీ, నిన్న ఎందుకో చాకలి వాళ్ళ మాట వచ్చి గబుక్కున ఈ మాట గుర్తుకు వచ్చింది. ఆ అమ్మాయి బట్టలు తీసుకెళ్ళి తిరిగి తెచ్చినప్పుడల్లా "కమలమ్మగారూ - బట్టలు చలువ చేసి తెచ్చానండి, పద్దు చూసి పంపించండి" అని అనేది. చలువ అనేది బట్టలు ఉతికే నీళ్ళలో కలిపే పదార్థమా , లేక బట్టలు ఆరపెట్టే విధానమా?

2 comments:

  1. చలువ అంటే బట్టలు ఉతకటమే. వెనుకటి రోజులలో చాకలి వాళ్ళు బట్టలు చెరువు దగ్గరికో కాలువ దగ్గిరికో తీసుకు వెళ్ళి బ్లీచింగు పౌడరు వేసి ఉడకపెట్టి ఉతికేవాళ్ళు. దీనినే చలువ అనేవాళ్ళు. బ్రౌన్ డిక్షనరీ కూడా అదే చూపిస్తుంది.

    ReplyDelete
  2. బ్రౌన్ డిక్షనరీ ఏంచెప్పిందో నేను చూడలేదుగానీ, నాకు తెలిసినంత వరకూ చలువ అంటే బట్టలని ఇస్త్రీ చెయ్యటం.

    ReplyDelete