Saturday, February 2, 2008

కృష్ణదేవరాయ సింహానికి బిలప్రవేశ దోషం

కృష్ణదేవరాయ సింహానికి బిలప్రవేశ దోషం


కృష్ణదేవరాయల వారు ఒకనాడు పెద్ద పళ్ళెం తెప్పించి ఎవరయినా ఒక నిర్దుష్టమయిన పద్యం చెప్పిన వారు , ఆ పళ్ళెరంలోని కానుకలన్నిటినీ తీసుకొనిపోవచ్చు అనగా - పెద్దన గారు -



"శర సంధాన బల క్షమా గురుత రైశ్వర్యంబులున్ కల్గి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహ క్షితిమండలేశ్వరుల కృష్ణా ! రాజకంఠీరవా !"

అని చెప్పాడట.



దీని అర్థం - నరసింహ క్షితి మండలేశ్వరుడి కుమారుడయిన కృష్ణదేవరాయలవారిని నరుడితోనూ, సింహంతోనూ, క్షితిమండలంతోనూ, ఈశ్వరుడితోనూ పోల్చవచ్చుట. ఎప్పుడు? నరుడికి బృహన్నల రూపం లేనప్పుడు, సింహానికి గుహ నివాసం లేకున్నప్పుడు, క్షితి మండలానికి నిరంతర చలనం లేనప్పుడు, ఈశ్వరుడికి బ్రహ్మఘ్నత లేనప్పుడు మాత్రమే అని.



అయితే రామలింగడు ఊరుకుంటాడా? అద్భుతమయిన దోషం ఒకటి చూపించాడట ఇందులో."ఒక పక్క సింహానికి బిలప్రవేశ దోషం ఉంది అని చెపుతూనే, మళ్ళీ కృష్ణరాయలవారిని రాజకంఠీరవా అని సంబోధించడం దోషమే" అని తేల్చి చెప్పాడట.

ఇలాంటివి మరిన్ని - ఇక్కడ చూడండి


వంశీ

3 comments:

  1. వంశీ గారు,
    నా ignorance ని మన్నించి,బిలప్రవేశ దోషం అంటే ఏమిటో చెప్తారా ప్లీజ్??

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. భువనవిజయంలో శ్రీకృష్ణదేవరాయలవారి శౌర్యమునుగూర్చి అల్లసాని పెద్దన చెప్పిన పద్యం ఇది. పద్యం చెప్పడం పూర్తవగానే సభికులంతా భేష్ భేష్ అంటూండగా, తెనాలి రామకృష్ణుడు మాత్రం ముసిముసిగా నవ్వుకుంటాడు. వికటకవిని కారణం అడుగుతాడు రాజు. ‘తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి రాదంటూనే, రాజకంఠీరవా! అని తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది’ అంటాడు. రాజకంఠీరవమంటే సింహరాజమని అర్ధం. ఆ మాటకు పెద్దన నొచ్చుకోక నవ్వుతూ ‘మంచి పట్టేబట్టావ్ మనవఁడా! ఏదీ నువ్వొక పద్యం చెప్పు’ అంటారు. మిగతా వివరాలకు తెనాలి రామకృష్ణ సినిమా చూడవచ్చు. :)

    ReplyDelete