Friday, December 28, 2007

తీరిక చిక్కి - మొత్తానికి "ముఖపుట" మారింది

అను క్లిప్ ఆర్ట్స్ సి.డి. సెట్టు (6 సి.డిలు - 4 వేల బొమ్మలు) చేతిలో పడిన రెండు వారాలకి తీరిక చిక్కి మాగంటి.ఆర్గ్ "ముఖపుట" మార్చడానికి వీలయ్యింది... ఇక నెమ్మదిగా ఇతర రూపురేఖలు మార్చాలి.

మాగంటి.ఆర్గ్

అను క్లిప్ ఆర్ట్స్ సి.డి. సెట్టులో చాలా మంచి మంచి క్లిప్ ఆర్ట్స్ ఉన్నాయి. మన తెలుగువారికి అంతర్జాలంలో దొరికే సగం పైన బొమ్మలు అను వాళ్ళ క్లిప్ ఆర్ట్స్ లోని బొమ్మలని ఇతర సాఫ్ట్ వేర్లతో మార్చి సొబగులద్దినవే అని నాకనిపిస్తుంది.

5 comments:

 1. వంశీ గారూ, మీ కృషి ఎంతయినా అభినందనీయం. మీ సేవ ఇంకో భాషలో అయ్యుంటే మీకు ఇప్పటికే పద్మశ్రీ వచ్చుండేది. తెలుగు కదా కనీసం మీకు డెబ్భయ్యేళ్ళు వచ్చే వరకూ పెద్దల కంట్లో పడే అవకాశం లేదు. ఇందులో ఎక్కువ మీవ్యక్తిగత ఇష్టాలున్నా ఇకముందు పూర్తిస్థాయి వెబ్ సైట్ గామారే క్రమంలో మీరు మరిన్ని జాగ్రత్తలు, అప్డేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ1: అమెరికాకు అధ్యక్షులు ఉంటారు. రాష్ట్రపతులు కాదు. ఉదాహరణ2: మన రాష్ట్ర పతిగా ప్రతిభాపాటిల్ వచ్చి కొంతకాలంఅయ్యింది. గమినించగలరు. ఉదాహరణ3: నమ్మకాలు భాగం లో అవిఎందుకుండేవో ఇంకా ఎందుకుండాలో మీరు వివరిస్తే బాగుంటుంది,వాటిలో చాలా శతాబ్దాల క్రితమే మనం మర్చిపోయినవీ ఉన్నాయి.

  మరికొన్ని తర్వాత రాస్తాను

  ReplyDelete
 2. శుభవార్త. శుభాకాంక్షలు. అసలు మన ప్రభుత్వాలు నిజంగా ఈ-విద్య పాఠశాలలు మొదలుపెడితే మీ సైటు అన్ని తరగతులకూ పాఠ్యపుస్తకమే.

  ReplyDelete
 3. రాజేంద్ర కుమార్ గారు, సుధాకర్ - ఇలా వచ్చినందుకు ధన్యవాదాలు

  ReplyDelete
 4. సుధాకర్ - జాబు వ్రాసినందుకు సంతోషం. మీకు నా సైటు నచ్చినందుకు సంతోషం. కృషి, శ్రమ అంటారా? నేను ఎప్పుడూ చెప్పేదే - ఒక పనిని బాధ్యతగా భావించి చేసినప్పుడు అది కృషి అనుకోకూడదు అని నా భావన. నా సైటు ఒక్కరికి అయినా ఉపయోగపడితే ఒక వ్యక్తిగా నా సామాజిక బాధ్యత సఫలం అయినట్లే. చేసే ఏ పని అయినా బాధ్యతగా భావించే మనిషినే కానీ, దాని అర్హతల గురించి ఆలోచించే స్థాయికి ఇంకా ఎదగలేదు..నేను పడ్డది శ్రమ అని , దాన్ని అందరూ గుర్తించి నాకు సన్మాన పత్రాలు, బిరుదులు ఇవ్వాలి అని మటుకు కోరుకోలేదు...అయ్యో నేను ఇంత ఇదిగా రాస్తే ఈయనేంటి, ఒక్క మాటలో ఇలా తీసిపారేసాడు అని మటుకు అనుకోకండి..నా మటుకు నాకు పెద్దవాళ్ళు మనకు అందించిన జ్ఞానాన్ని మన తరువాతి తరాలకు అందచేయటమే మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత - అది భాష పరంగా కానివ్వండి , ఆ భాష లో ఇమిడిఉన్న సాహితీ సంపద పరంగా కానివ్వండి, సంస్కృతీసాంప్రదాయ పరంగా కానివ్వండి...

  ReplyDelete