Friday, November 2, 2007

ఎగ్గేమి - సిగ్గేమి?

అసలు వీళ్ళు కవితలు ఎందుకు రాస్తున్నారో, ఈ వెబ్జైనులు ఆ కవితలను ఎలా ప్రచురిస్తున్నాయో అర్థం కాకుండా ఉన్నది. ఇప్పుడు పేర్లు గట్రా ఎందుకు కానీండి కానీ...ఈ మధ్య అంతర్జాలం లోని కొన్ని పత్రికలలో వచ్చిన కవితలని చూస్తే పరమ రోతగా ఉంది. వీళ్ళ కవిత్వం ఎవరికోసం? రాసిన వారి ఆత్మ సంతృప్తి కోసమా? వీళ్ళకి పాఠకులెవరు? అందరూ చదివేలా రాయక్కర్లేదా? ఉచ్ఛ నీచాలు, ఉచితానుచితాలు పట్టించుకోకుండా కొత్తగా గమ్మత్తుగా రాయాలి అన్న తపన అడ్డగోలగా వాడుకభాషలోని పదాలను, రోజువారీ మాటలను అటూ ఇటూ తిప్పి ఒక పద్య పాదంగా రాసి చేతులు దులుపుకుంటున్నారు...

బాబోయి ...నా వల్ల కాదు ఈ దుర్మార్గపు కవితలు చదవడం...పోనీ ఆ కవులకు లేదు అంటే, ఆ పత్రికల సంపాదకులకు ఏమయ్యింది? ఏదో రకంగా నాలుగు కవితలు ప్రచురించి కాలం గడుపుకుందాము, నాకేమి పోయె చదివేవాడి ఖర్మం అని పత్రికా సంపాదకులే ఆలోచిస్తున్నప్పుడు , అడ్డగోలుగా రాసే ఆ కవివరులకు "ఎగ్గేమి - సిగ్గేమి?".


ఉదాహరణకి ఒక కవితలో - ఓహో బాటసారి, ఇలా చేయ్యవలె మీరు , ముక్కు మూసుకోండి మీరు, పక్కకు జరగాలండి మీరు, ఎక్కడికొచ్చారో తెలుసా? కంపు కొట్టేచోటికి - ఏవండీ కవిగారు ఇది ఒక కవితా? అయ్యో జనాలు చదివి నవ్వుతారే అని కూడా అనిపించలేదాండీ మీకు? పైగా దీని పేరు భావ కవిత్వమా? హయ్యో హతవిధీ...ఇలా ఖర్మం కాలబట్టే .....సరే

ఇంకో పత్రికలో పరుపులు, మరకలు,లేవండి, పదండి, అడక్కండి, మాట్లడకండి అని ఇంకో కవిత...హయ్యయ్యో హయ్యయ్యో...

సంతృప్తి రచయితకో, లేక కవికో మాత్రమే కలిగితే సరిపోతుందా? పాఠకుడికి కలగఖ్ఖరలా? ఏ రచన అయినా సరే ఎవరూ ఏవగించుకోకుండా ఉండాలి..సరే ఎన్ని అనుకుని ఏమి లాభం...

1 comment:

  1. ప్రపంచ్జ సాహిత్యాకాశంలో తెలుగు సాహిత్యానికి ఒక విశిష్టమైన స్థానం వుంది.ఏందరో మహోన్నతమైన సాహిత్యకారులు తమ అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యానికి ఒక ప్రత్యెకమైన స్థానం తెచ్చి పెట్టారు. కాలక్రమేణా ప్రపంచీకరణ నేపధ్యంలో సాహిత్యానికి ఆదరణ కరువయ్యింది. కంప్యూటర్ చదువులు వచ్చి భావుకతను వాశనం చేసాయి. కవులకు, కళాకారులకు ఆదరణ కరువయ్యింది.సాహిత్యాన్ని అభ్యసించేవారు,చదివేవారే లేరు. ఇన్స్టెంట్ కవులు పుట్టుకొచ్చారు. మాట్లాడే వాక్యాలను అటూ ఇటూగా మార్చి కవితలను తయారు జెస్తున్నారు.కొంత మంది పుస్తకాలనుండి వాక్యాలను యధాతధంగా కాపీ కొట్టి లైన్ల కింద విడగొట్టి కవిత్వమంటూ మనమీదకు వదుల్తున్నారు. ఇది కవిత్వం కాదు కపిత్వం. అయ్యా ఆధునిక కవుల్లారా ! దయ చెసి ఇటువంటి చెత్తను మా మీదకు వదలకండి.మంచి కవిత్వం రాయాలంటే మంచి పుస్తకాలను ముందుగా చదవండి, అభ్యాసం చెయ్యండి.భావుకతను,సృజనాత్మకతను పెంచుకోండి. తెలుగు కళామ తల్లి గర్వపడేలా చక్కని రచనలను సృష్టించండి.

    ReplyDelete