Friday, November 2, 2007

"నేను సైతం" గారి టపా - "నేను…నా నాటకాలు "

"నేను సైతం" గారి టపా - "నేను…నా నాటకాలు " - నేనుసైతం గారు..ఎందుకో మీ టపాలో నేను కామెంటు చెయ్యలేకపోతున్నాను...ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్ అని తెగ తిడుతోంది..లేదా తెల్ల కాగితం చూపిస్తోంది...అందుకని ఇక్కడ రాస్తున్నా...


"హబ్బా హబ్బా హబ్బా హబ్బా...అబ్బో అబ్బో అబ్బో అబ్బో...ఉబ్బి తబ్బిబ్బు...ఇంతవరకు నాకు ఈ అంతర్జాలంలో మా అమ్మమ్మగారి స్వగ్రామం "చల్లపల్లి" అనే మాట రాతల్లో రాసి కనపడిన మొదటి వ్యక్తి మీరే...నేను పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాదులో అయినా, సంవత్సరానికి ఏదో ఒక కారణం - పండగలు అనో, పెళ్ళిళ్ళు అనో, చుట్టాలకి ఒంట్లో బాగోలేదు అనో, ఇలా ఏదో ఒక మిష మీద నాలుగు నెలలు చల్లపల్లి, బందరులో ఉండేవాడిని... యమా సంతోషం వేసింది చల్లపల్లి అనే మాట వినగానే..అందుకని మీ టపాకి ఈ రాతకి సంబంధం లేకపోయినా ఏమీ అనుకోవద్దు. అదేదో సినిమాలో "కోట" ఎవరయినా "మాది బందరు" అనగానే వాణ్ణి వాటేసుకుని ఆనందంతో తొక్కి నారదీస్తాడు లాగా ఉంది వీడి వ్యవహారం అని మీరు అనుకున్నా ఫరవాలేదు.. "

1 comment:

  1. వంశీ గారు..నెనెర్లు.మీ కామెంటు అందుకునే స్థాయికి ఇంకా నా బ్లాగు ఎదగలేదోమోనండి. ;)

    ఎంతమాటండి....వంశీ గారు కూడా మా ఊరి బంధువులే అని చెప్పుకోవచ్చు నేను ఇంక.ఎనిమిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నా చదువు అంతా చల్లపల్లి రాజా వారి కళాశాలలోనే.(వాపసు నాటిక లో లాగా ఫీజు వాపసు అడగలేదులెండి;) )
    చల్లపల్లి కళాశాల తీపి గుర్తులు ఎప్పడినుండో రాద్దామనీ అనుకుంటూనే బద్దకిస్తున్నాను,త్వరలోనే రాస్తా..
    -నేనుసైతం

    ReplyDelete