Friday, March 7, 2008

బుడుగో బుడుగో

బుడుగో బుడుగో


వానల్లు కురవాలి
వరిచేలు పండాలి
బుడుగో బుడుగో

వరిచేలు కొయ్యాలి
పాలేళ్ళు నూర్చాలి
బుడుగో బుడుగో

కావిళ్ళ తేవాలి
గాదెల్లో పోయాలి
బుడుగో బుడుగో

మా నాన్న తియ్యాలి
మా దాసికివ్వాలి
బుడుగో బుడుగో

మా దాసి దంపాలి
మాయమ్మ కివ్వాలి
బుడుగో బుడుగో

మా యమ్మ వండాలి
మా బొజ్జ నిండాలి
బుడుగో బుడుగో

1 comment:

 1. మీ తెనుగు సొగసులు చాలా బాగున్నాయి. చిన్ననాటి అనుభవాలను జ్ఞప్తికి తెస్తున్నాయి.
  పూర్వం చిన్నపిల్లల బడి పంతుల్ల్లు దసరా పండుగకు పిల్లలను తీసుకొని ఇంటింటికీ పోయి దసరా పాటలను పాడించేవారు ఇలా:
  దసరాకి వస్తిమని విసవిసలు పడక
  చేతిలో లేదనక అప్పివ్వరనక
  ఇరుగుపొరుగుల వరు ఇస్తారు సుమ్మి
  అయ్యవారికి చాలు ఐదు వరహాలు
  పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

  దూర్వసుల పద్మనాభం

  ReplyDelete