Monday, October 15, 2007

పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు

పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు, తాము జరిపిన ఒక శతావధానము లోని "చంపకమాల" పద్యం

కరకరలాడు కొంచెమగుకారము గల్గు బలాండువాసనా
హర మగుగొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట
ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా
దరమునబల్కుచుందు రదితాదృశమే యగునంచుదోచెడిన్

1 comment:

  1. తిరుపతి వెంకట కవులంతటి వాళ్ళని పట్టుకుని చిలకమర్తి వారు పకోడీ మీద పద్యం చెప్పమన్నార్ట
    శనగపిండి ఉల్లిపాయ చిన్ని మిర్పకాయలన్
    జునిపి అందు అల్లమంత దొనిపి ముద్దచేసినన్
    అనల తప్తమైన నేతియందు వైచి వేచినన్
    జను పకోడి అనెడు పేర చక్కనైన ఖాద్యమౌ !!

    నాకు తెలిసిన ఒక పకోడి పద్యం....

    ReplyDelete