Wednesday, October 31, 2007

తిట్టుకోండి, అరుచుకోండి, బట్టలు చింపేసుకోండి, కానీ...

మనువు మీద కోపమెందుకో? ఈ మధ్య మనువు (పెళ్ళి కాదండోయ్)మీద మనసు మళ్ళి మంత్రాంగంతో మేధ మధిస్తే ముచ్చటయిన ముత్యాలు మురిపెంగా మకిలి లేకుండా తవ్వుకొచ్చినాయి. ఆ ముత్యాలు ఏంటి అంటారా? ఈ స్త్రీవాదులు, స్త్రీవాదాన్ని సమర్ధించేవారు , మనువు మీద అక్కసు ఉన్నవాళ్ళు, ఆ అక్కసుని దాచుకోలేక వెళ్ళగక్కేవాళ్ళు కాసింత ఆ మనువు ఏర్పరచిన ప్రామాణికా ముత్యాలను చూసి ఆలోచించి, ఆ పై ఆనందించండి. ఇంకా ఏడుస్తారా ? మీ ఖర్మ..మిమ్మల్ని ఎవడూ బాగు చెయ్యలేడు, భూషయ్య, లాడెన్, మోడీల్లాగా చరిత్రలో మిగిలిపోండి. ఇలా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా?

అసలు ఇది అంతా ఎందుకు రాయవలసి వచ్చింది అంటే ఇవ్వాళ్ళ ఒక చిత్రమయిన డాక్టరేట్ మహాతల్లి ఇక్కడి తెలుగువారి కబురూ కాకరకాయ సమావేశానికి( నా భాషలో సాహితీ గోష్టికి) మా తలకు మాసిన సంఘానికి సుధారాణి అని ఒకావిడ ఉంది లెండి..ఆవిడ ఆహ్వానం మీద వచ్చి మనువు మీద పేద్ద లెక్చర్ ఇచ్చింది.

మనువు అనే వాడు పుట్టడమే తప్పు అన్నంత ఇదిగా వాదించింది. ఆవిడకి కొత్త డాక్టరేట్ పరిశోధనాంశం మనువు అట. అక్కడ ఆవిడకి సమాధానం చెప్పడానికి వెధవ గోల - ముఖ్య అతిథి అయిపోయిందాయె. సరే లేచివచ్చేద్దాము అని అనుకున్నా కానీ అసలు ఆవిడ బాధ ఏంటో చూద్దాము అనిపించి చివరిదాకా ఉన్నాను...ఒక ఇరవై నిముషాలు ఏకింది, ఏకింది, ఏకింది...చివరికి ఒక రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగి అందరి వంక చూసి నవ్వింది...అదిగో ఆ నవ్వే నాకు ఎక్కడో కాలింది..పైగా ఈ సారి సమావేశానికి ఆవిడ వస్తోంది అనేటప్పటికి ఆడ జనాభా 22 మంది వచ్చి - ఈలలు గట్రా వేసుకుంటు ( ఈలలు అనేది మటుకు నేను కల్పించి రాసింది - ఈలలు అంటే యమా హుషారుగా అని అర్థం చేసుకోవాలి) ఉండేటప్పటికి మిగిలిన 4 మగ పుంగవులు గమ్మున అయిపోయాము అన్నమాట. సరే అక్కడ తక్కువయినా ఈ బ్లాగాయుధం ప్రయోగించి ఈనాడు మనువుకి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెపుదాము అని ఇది రాస్తున్నా అన్న మాట.ఈ బ్లాగు ఆవిడ కూడా చదువుతుంది లెండి. అందుకే ఇక్కడ రాసా... :)

నేను చదివిన పుస్తకాల్లో మనువు చెడ్డవాడు అని నాకు అనిపించలేదు. ఆ పుస్తకాల్లో మనువును గూర్చి వివరించిన దాన్ని బట్టి నాకు తోచింది ఇది. యే పుస్తకం? ఎక్కడ ఉంది? అది నేను కూడా చదివి అందులో తప్పులు పట్టుకంటాను, అంటే మటుకు చెప్పేది లెదు.

1. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాః తు న పూజ్యంతే సర్వాః తత్రాః ఫలాః క్రియాః
అంటే దీని అర్థం - స్త్రీలను ఆదరించి గౌరవించి నడిచే కుటుంబంలో దేవతల వంటి సంతానం, దివ్యమయిన సంతోషాలు లభిస్తాయి అని, అది జరగని చోట అన్నీ నిష్ఫలాలే అని భావం

2. పుత్రేణ దుహితా సమా
పుత్రిక కూడా పుత్రికతో సమానం. పుత్రిక ఆత్మతో సమానం. అందుకని ఆమె పితృసంపదకు అధికారిణి

3. పుత్రికకి తండ్రి ఆస్తిలో సమానాధికారం నిర్ణయించిన మనీషి మనువు

4. స్త్రీలను అబలలుగా భావించి, ఆమె బంధువులు ఆ స్త్రీల ధనం స్వాధీనం చేసుకుంటే దొంగలుగా నిర్ధారించి కఠిన శిక్ష వెయ్యాలి అని మనువు చెప్పాడు.

5. స్త్రీల మీద జరిగే అత్యాచారాలకు, అరాచకాలకు అత్యంత కఠిన శిక్షలు ఏర్పరచింది కూడా మనువే

6. వివాహం చేసుకోవటం లో స్త్రీ కి సంపూర్ణ స్వతంత్ర అధికారం కల్పించించి మనువే.

ఇలా ఎన్నో ఉన్నాయి...ఇవి చదివిన తరువాత అయినా మనువు మీద కోపం తగ్గించుకోండి...ఆయన పాపం అన్నీ ఖచ్చితంగానే చెప్పాడు.


దాన్ని వేరే విధంగా అమలు చేసిన దుర్మార్గపు మనుషులను తిట్టుకోండి, అరుచుకోండి, బట్టలు చింపేసుకోండి, కానీ మనువు ని ద్వేషించొద్దు.

4 comments:

 1. ఆడవాళ్ళకు శాసనాలు చేసే అధికారమిస్తే ఆ శాసనాలు ఇంకా అధమాతి అధమంగా నీచాతినీచంగా అమానుషంగా ఉంటాయనడంలో నాకెలాంటి సందేహమూ లేదు. వాస్తవం చెప్పాలంటే రేణుకా చౌదరి కేంద్రంలో కూచుని పార్లమెంటులో ఎవరూ లేకుండా చూసి కనీస మెజారిటీతో మగవాళ్ళకు వ్యతిరేకంగా చట్టాలు చేయిస్తోంది. ఈ మధ్య గత మూడేళ్ళలో జారీ అయిన చట్టాల సారాంశమేమిటంటే - ఒక ఆడది మగవాడి మీద ఆరోపణలు చేస్తే ఆరోపణ నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిదే నట. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన/భారతదేశం సంతకం చేసిన మానవహక్కుల చార్తర్‌కే ఇది పచ్చి వ్యతిరేకం. ఏ నేరం విషయంలోనైనా సరే, ఆరోపణ చేసినవాళ్ళే దాన్ని నిరూపించాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఇలా మనం చూస్తూ ఊరుకుంటే ఆడవాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోతుంది. మగవాణ్ణి శిక్షించడానికి మగవాణ్ణే వాడుకునే ఆడ ఫెమిస్టుల కుట్రలకు వ్యతిరేకంగా యావత్తు పురుషజాతీ మేలుకోవాల్సిన అవసరం ఉంది.

  మగజాతి వెంటనే మేలుకుని ఆ చట్టాలు అమలుచెయ్యకుండా అమలు కాకుండా కాయితాలకే పరిమితమయ్యేలా సంపూర్ణ సహాయ నిరాకరణ చెయ్యడమొక్కటే మార్గం. మగవాడికి వ్యతిరేకమైన ఏ కేసునీ మనం ముందుకు పోనివ్వకూడదంతే ! ఈ దిశగా మనం మగ న్యాయవాదుల్నీ మగ పోలీసుల్నీ ఆఖరికి మగజడ్జిల్ని కూడా మగజాతి హక్కుల గురించి చైతన్యపరచాలి. చూద్దాం. ఎవరు గెలుస్తారో ! ఫెమిస్టులో ? మగవాళ్ళో?

  మనుధర్మశాస్త్రాన్ని తెలుగు తాత్పర్యాలతో సహా త్వరలో scribd.com లోకి ఎగుమతి చెయ్యబోతున్నాను. ఎవడో/ఎవర్తో చెప్పినది నమ్మే పని లేకుండా ఎవరికి వారు చదువుకుంటే విషయం తెలుస్తుంది కదా !

  ReplyDelete
 2. see this for bloggers
  http;//nijamga-nijam.blogspot.com

  ReplyDelete
 3. రమణ గారూ

  మీరు ఎవరో తెలీదు కానీ, నేను రాసిన విషయం వేరు -"మనువు ను ద్వేషించొద్దు" అయితే (అందులో భాగంగా దానికి దారితీసిన పరిణామాలు కూడా వ్రాయవలసి వ్రాస్తే) , మీరు ఏదో కసి తీర్చుకోటానికి ఈ టపా రాసినట్టు అనిపిస్తోంది.

  మీ బ్లాగు మీ ఇష్టం - అది ఒప్పుకుంటాను...నిర్మొహమాటంగా చెపుతున్నాను - అయితే మీరు ఇలా వ్రాయటం మంచి పద్ధతి మటుకు కాదు..సభ్యతగా ఉండదు అని మటుకు చెప్పగలను.

  ఇంతకంటే చెప్పటానికి ఏమీ లేదు.

  ReplyDelete
 4. తాడేపల్లి వారు

  ఆ పుస్తకం తాత్పర్యాలతో సహా ఎక్కిస్తే జనాలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. మంచి ప్రయత్నం. అప్పుడయినా జనాలకి మనువు, అతని స్మృతుల్లో తప్పు లేదని, కానీ ఆ స్మృతులని విభిన్నంగా ఆచరణలోకి తీసుకొచ్చిన జనాల తప్పు మాత్రమే అని తెలిసి వస్తుంది

  ReplyDelete