Tuesday, October 30, 2007

ఒక వ్యంగ్యాస్త్రం - చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు

కరుణశ్రీ గారు రాసిన ఒక వ్యంగ్యాస్త్రం

చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు
చదువు కొనెడివేళ 'సంకరు'డనె
చదువు ముదిరిపోయి షంకరుండనెనయా
స్నిగ్ధ మధురహాస ! శ్రీనివాస!

8 comments:

 1. హహహా.నవ్వలేక పొట్ట చెక్కలయ్యింది.మంచి సెటైర్ కల పద్యం

  ReplyDelete
 2. అద్భుతంగా వ్రాశాడాయన. మీరీ పద్యాన్ని మాకందరికీ పరిచయం జేసినందులకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 3. గొప్ప వ్యంగ్యం! దీన్ని చూపించినందుకు నెనరులు.

  ReplyDelete
 4. భలే వుంది. ఈ మకుటంతో ఇంకా పద్యాలేమైనా ఉన్నాయా వంశీగారూ?

  ReplyDelete
 5. ఉన్నదేమో తెలియదు రానారె..మా నాన్నగారిని కనుక్కుని చెప్పగలను...ఈ పద్యం మటుకు మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన మా నాన్నగారి పాత డైరీలో దొరికింది....

  ReplyDelete
 6. వెన్నెల గారు,చదువరి గారు, తెరెస గారు, రాఘవ గారు - ఈ గూటికి వచ్చినందుకు సంతోషం..వ్రాసినందుకు మరింత సంతోషం..

  ReplyDelete