Friday, March 7, 2008

మాటాడి తప్పవు మన్మధాకార....

పొగడ్త పాట


బంగారు, జలతారు రంగయిన పాగ
ముత్యాల పోగులు ముద్దుటుంగరము
చేతి కంకణబిరుదు చంద్రహారములు
నిలువుటంగీలును నీలాపు మణులు
గోమేధికాపుష్య గొలుసు రత్నములు
మాణిక్యకిరీట మహితప్రతాప
అయ్యవారికిచాలు ఐదువరహాలు
చిన్నవాళ్ళకుచాలు సిరిసెనగపప్పు
పిల్లవాళ్ళకుచాలు పప్పుబెల్లాలు

మాటాడి తప్పవు మన్మధాకార
సాటిలేరెవ్వరు సద్గుణాకార
సరసనీవచనములు జాజిపూతోట
వరసతో నీమాట వరహాలమూట
అసమానగుణధీర అంగజాకార


వసుధలో (ఇంటి పేరు) వారి వంశవిస్తార
గరిమ (తల్లి పేరు) గర్భసుకుమార
భళి భళీ (ఆసామి పేరు) భాగ్యదేవేంద్ర

2 comments:

  1. పొగడ్తకు పొంగిపోని తెలుగువాడుంటాడా?..


    గుంటూరు,సురేష్ కాలేజిలో పని చేస్తున్నరోజుల్లో..పి.వి.జి.కె అని పేరొందిన ఫిజిక్స్ లెక్చరర్ వుండేవారు.నేను,పి.వి.జి.కె గారు,సాంబశివరావు కలిసి ఒకసారి మాట్లాడుకుంటుండగా..పి.వి.జి.క్.వారు నావైపు తిరిగి"శర్మా..సాంబశివరావు నన్ను పొగుడ్తున్నాడని తెలుసు.ఏం చెయ్యను..నాకు పొగడ్తలిష్టం..ఒక్క రూపాయి ఖర్చుండదు"

    ReplyDelete
  2. Very true. A word of praise costs nothing and gives everything.

    Chaala baaga chepparandi

    Damayanthi

    ReplyDelete